Take a fresh look at your lifestyle.

రుణమాఫీ వివరాలు అందుబాటులో ఉంచాలి

సూర్యాపేట, మే 20, ప్రజాతంత్ర ప్రతినిధి:జిల్లాలో రైతు రుణ మాఫీ కొరకు అర్హులైన రైతులను వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్ల సమన్వయంతో కలిసి గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ ‌సమావేశ మందిరంలో బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతు జిల్లా వ్యాప్తంగా 2.53లక్షల మంది రైతులకు ఖాతా కలిగి ఉంటే వారిలో 1,97, 595మంది రైతులు రుణాలను తీసుకోవడం జరిగిందని తెలిపారు. వీటిలో రూ. లక్షలోపు, రూ. 25వేల లోపు రుణాలను ఎంతమంది తీసుకోవడం జరిగిందని అలాగే వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లు అర్హులైన రైతులను గుర్తించి సమగ్ర సామాచారం అందించాలని పేర్కొన్నారు.

ఇప్పటివరకు రుణాలు పొంది తిరిగి చెల్లించి మళ్ళీ రుణం తీసుకున్నవారు, గ్రూప్‌ ‌లోన్‌ ‌తీసుకున్న వారు రుణమాఫీకి అర్హత ఉండదని స్పష్టం చేశారు. అదే విధంగా అర్బన్‌ ‌బ్యాంకులలో రుణాలు తీసుకున్న వారికి కూడా రుణ మాఫీ వర్తించదని పేర్కొన్నారు. నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ ‌సెంటర్‌ ‌నుండి రుణాలు పొందిన వారి జాబితా అందుబాటులో ఉంచడం జరిగిందని, రైతుల వివరాలను వ్యవసాయ, బ్యాంక్‌ అధికారులు జాయింట్‌ ‌మండల లెవెల్‌ ‌బ్యాంకర్స్ ‌కమిటీ మీటింగ్‌ ఏర్పాటుచేసి అర్హత కలిగిన రైతుల వివరాలను గుర్తించాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన అనెక్సర్‌ ఏలో పూర్తి వివరాలను త్వరతగతిన పొందుపర్చాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో లీడ్‌ ‌బ్యాంక్‌ ‌మేనేజర్‌ ‌జగదీష్‌ ‌చంద్రబోస్‌, ఎస్‌బిఐ ఏజిఎం జేకే నాయుడు, వ్యవసాయ శాఖ అధికారులు రామారావు నాయక్‌, ‌సంధ్యారాణి, బ్యాంక్‌ ‌మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply