అమరవీరుల స్తూపానికి నివాలర్పించిన టియూడబ్లూజె (ఐజెయూ) నాయకులు
తెలంగాణ రాష్ట్ర అవతర దినోత్సవంను పురస్కరించుకొని మంగళవారం టియూడబ్లూజె రాష్ట్ర కమిటి పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగదాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించి, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌తో మృతి చెందిన వారికి జిల్లా టియూడబ్లూజె (ఐజెయూ) నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కమిటీ కార్య వర్గ సభ్యులు కూతురు రాజిరెడ్డి, జిల్లా యూనియన్ నేతలు చిటుకుల మైసారెడ్డి, పాతర్ల వెంకటేశ్వర్లు, నాయిని సంజీవ్ రెడ్డి, జర్నలిస్టులు మన్నే వెంకట్, మురళీ కృష్ణ, చందు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.