Take a fresh look at your lifestyle.

సాహితీ వేత్త, విమర్శకురాలు, తెలంగాణ మాండలికానికి వన్నె తెచ్చిన పాకాల యశోదారెడ్డి

“తెలుగు మాండలిక మునకు చిరునామా. ఇంటిపేరులో  పాకాల కల్గి ప్రాచీఃన సాహిత్య మునకు పట్టు గొమ్మ లా కాల మునకు అనుగుణంగా బాల్య దశ నుండే రాయడం ఆమె ప్రతిభ కి తార్కాణం. సూటి తప్ప పక్క పోటెరుగదు నా మాట’ అని పొల్లు పోని వ్యక్తిత్వంతో తెలుగు మాండలిక పదసంపదకు, పరిరక్షణకు ఎనలేని సేవలందించిన సాహితీ వేత్త పాకాల యశోదారెడ్డి. రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షురాలిగా పనిచేసిన ఏకైక మహిళ.”

(నేడు పాకాల యశోదారెడ్డి వర్ధంతి …)

తెలుగు సాహిత్యం లో ఆమె ఒక దృవ తార.తెలుగు మాండలిక మునకు చిరునామా. ఇంటిపేరులో  పాకాల కల్గి ప్రాచీఃన సాహిత్య మునకు పట్టు గొమ్మ లా కాల మునకు అనుగుణంగా బాల్య దశ నుండే రాయడం ఆమె ప్రతిభ కి తార్కాణం. సూటి తప్ప పక్క పోటెరుగదు నా మాట’ అని పొల్లు పోని వ్యక్తిత్వంతో తెలుగు మాండలిక పదసంపదకు, పరిరక్షణకు ఎనలేని సేవలందించిన సాహితీ వేత్త పాకాల యశోదారెడ్డి. రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షురాలిగా పనిచేసిన ఏకైక మహిళ. మహబూబ్‌నగర్‌ ‌జిల్లా బిజినేపల్లిలో సరస్వతమ్మ కాశిరెడ్డి దంపతులకు ఆగస్టు 8, 1929లో యశోదారెడ్డి జన్మించారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమెను రుక్కునమ్మ చేరదీసి పెంచారు. చదువే ప్రాణంగా పెరిగిన ఆమె ఉన్నతవిద్యను అభ్యసించారు. 1955లో హైదరాబాద్‌ ‌మహిళా  కాలేజీలో తెలుగు ఉపన్యాసకురాలిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. సంస్కృతం, జర్మన్‌ ‌భాషలను అధ్యయనం చేసిన యశోదారెడ్డి తెలుగులో ‘హరివంశములు’ అంశంపై పరిశోధన చేసి 1969లో డాక్టరేట్‌ ‌పట్టాను పొందారు.

తన పన్నెండో ఏట నుండి రచనలు చేయడం మొదలుపెట్టి సుమారు 40గ్రంథాలను ప్రచురించారు. పారి జాతాపహరణ పర్యాలోచనము, ఆంధ్ర సాహిత్య వికాసము, నేమాని భైరవకవి, ఉత్తర హరివంశము, భారతంలో స్త్రీ, అమరజీవులు, నారదీయం, చిరుగజ్జెలు, ద్విపద, ప్రబంధ వాజ్మయము, రచ్చబండ, నాగి, అచ్చ తెలంగాణ యాసలో రాసిన మావూరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కతలు, ధర్మశాల తదితర రచనలు ఆమె సాహిత్య పటిమకు నిదర్శనాలు. నవల, కథ, కవిత, వ్యాసం తదితర ప్రక్రియల్లో సాగిన రచనావ్యాసంగం తెలుగు సాహిత్యలోకంలో ఆమెకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టాయి. ‘మూసీ’, ‘పరిశోధన’, ‘ఆంధ్రప్రదేశ్‌’, ‘‌జాగృతి’, ‘ప్రజాతంత్ర’, ‘భారతి’, ‘నా తెలంగాణ’ పత్రికల్లో ఆమె రాసిన వందలాది పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. తెలంగాణ మాండలికంలో రాసిన కథలు, హాస్యరచనలు, పండగలు – పబ్బాలు, ఎచ్చమ్మ ముచ్చట్లు, మహాలక్ష్మి ముచ్చట్లు, జెర ఇనుకోవే తల్లీ అనే శీర్షికలతో రెండు వందలకు పైగా ప్రసంగాలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి.1949 -50 ప్రాంతంలో దక్కన్‌ ‌రేడియోలో మాండలిక భాషలో మొట్టమొదటి కథలు, సంభాషణలు, పిల్లల నాటికలు ప్రారంభించిన ఘనత ఆమెకే దక్కింది.

తెలంగాణ నుడికారంతో కథలు రాయమని తొలుత ఆమెను బెజవాడ గోపాలరెడ్డి, తిరుమల రామచంద్ర ప్రోత్సహించారట. అలా మాండలికంలో సాహిత్యాన్ని సృష్టించిన ఆద్యురాలుగా తెలంగాణ చరిత్రలో సుస్థిరంగా ఆమె పేరు నిలిచిపోయింది.రచయితే కాకుండా ఆమె గొప్ప వక్త. పండితులు మెచ్చే భాషలో ఉపన్యసిస్తూ, ముచ్చటగొలిపే మాండలిక యాసతో సభికులను ఆకట్టుకేనేలా ప్రసంగించేవారు. ఆమె ఉపన్యాసం విన్న ప్రఖ్యాత చిత్రకారుడు పి.టి.రెడ్డి ఆమెను ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. ఉద్యోగ, సాహిత్య జీవితానికి ఆయనందించిన తోడ్పాటుతో ఆమె ఎన్నో రచనలు చేశారు. చిత్రకళా ప్రదర్శనల కోసం భర్తతో పాటు దేశవిదేశాల్లో పర్యటించి ‘భారతీయ చిత్రకళ’ గ్రంథాన్ని రచించారు.మారుతున్న భాషా ప్రవాహంలో ప్రాచీన రూపాలు కొట్టుకుపోకుండా కాపాడటం భాషావేత్తల బాధ్యతగా భావించిన యశోదారెడ్డి మాండలికపదాలను, జాతీయాలను, పదబంధాలను, పరిణామాక్రమంలో మాండలిక పదాలు పలకడంలో వస్తున్న మార్పులను గ్రంథస్థం చేశారు. అనేక భాషా సాహిత్య సంఘాలకు ప్రధాన  సభ్యురాలిగా ఉండి సేవలందించిన ఆమె 1990 నుంచి 1993 వరకు రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలిగా పనిచేశారు.ఆమె అందుకున్న పురస్కారాలు లెక్కకు మించి వున్నాయి .రాష్ట్ర సాహిత్య అకాడమీ నుంచి ‘ఉత్తమ రచయిత్రి’ పురస్కారం అందుకున్నారు. ఆగ్రా విశ్వవిద్యాలయం నుంచి డి.లిట్‌ ‌గౌరవ పట్టాను పొందారు.ఇతర దేశముల నుండి కూడా ప్రశంసలు లభించాయి.కాళోజీ నారాయణరావు తర్వాత తెలుగు మాండలిక భాష అభివృద్ధి కి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయం.35  సంవత్సరాలు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో పనిచేసిన యశోదారెడ్డి ప్రొఫెసర్‌గా, సాహితీ వేత్తగా, విమర్శకురాలిగా ప్రత్యేకమైన శైలి,   కచ్చితంగా మాట్లాడే వ్యక్తిత్వం గల సమర శీల వనిత. తెలుగుభాషను సజీవభాషగా, తెలంగాణ మాండలికాన్ని నిలబెట్టడంతో కృషి చేసిన ఆమె అక్టోబర్‌ 7, 2007‌న పరమపధించినారు.వారి సాహిత్యం అజరామరం.నేటి తరం లోని కవులు,రచయితలు ఆమె ని స్పూర్తి గా తీసుకుని సమాజ వికాసానికి అనుకూలంగా రచనలు చేయాల్సిన అవసరం ఎంతయినా వుంది.వారి రచనలు తప్పక అధ్యయనం చేయాలి.తెలంగాణ మాడలికం భాష లొ మాట్లాడుధాం.వారి వర్ధంతి ని జరుపుకుని వారికి నివాలులు అర్పించుధాం.
కామిడి సతీశ్‌ ‌రెడ్డీ, జడలపేట, జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా,       9848445134..

Leave a Reply