పాటల పూదోట
జాన పదాల ఊట
ప్రకృతి వర్ణనల మీట
శ్రమైక్య జీవన బావుటా
అతడే వాగ్గేయకారుడు
ప్రజా కవి గోరటి వెంకన్న
పాలమూరు మట్టిలో పుట్టి
అంతట విరిసిన అక్షర రేడు
పాటై,మాటై,పదమై,పద్యమై
హోరెత్తిన సాహితీ సంద్రుడు
పల్లె బతుకుల మధ్య ఒదిగి
ఎదిగిన కవితా సంపన్నుడు
వల్లంకి తాళానికి లయాత్మక
దరువేసిన జన పద నర్తకుడు
తెలంగాణ భాష యాసను
ఎల్లెడల చాటిన సారథుడు
సామాజిక ఉద్యమాలకు
ఊపిరిలూదిన ఉద్దండుడు
కృష్ణశాస్త్రి ,జాషువా,గద్దర్లను
కలగలసిన మణి ప్రవాళికుడు
అడవి అందం ప్రకృతి సౌందర్యం
నిర్మల ప్రేమతత్వం తాత్వికతకు
గేయ రూపిచ్చిన నేటి వేమనుడు
కేంద్ర సాహిత్య అకాడమి అవార్డ్
అందుకున్న సాంస్కృత శిఖరుడు
తెలంగాణ కీర్తి కిరీటం
కళామతల్లి పుత్ర రత్నం
జనకవి గోరటి వెంకన్నకు
జాతి గర్వంతో తలెత్తుకు
అక్షర హారతులు పడుతుంది
కవన నీరాజనం పలుకుతుంది
(గోరటి వెంకన్నకు అక్షర ప్రణతి సమర్పిస్తూ…)
– కోడిగూటి తిరుపతి, 9573929493