Take a fresh look at your lifestyle.

వినపడుతున్నదా! ప్రైవేటు టీచర్ల గోడు!?

చూడు మళ్ళీ బడుల మూసివేత
ప్రేవేటు పంతుల్లకు బాధల మోత
పగోడికి కూడా రావొద్దు ఆ…కష్టం
కష్టాల కొలిమి చల్లారని ఆ..కాష్టం

కరోనాతో కకావికలమైన బతుకు
కన్నబిడ్డల నోటికి అందని మెతుకు
ఇంట్లిల్లిపాదికి రోజూ తప్పని పస్తులు
ఆ..టీచర్లకు ఏడాదిగా అవే ఆస్తులు

రోడ్డెక్కీ బళ్ళు తెరవాలని కోరిండ్లు
తమ ఆకలి కేకలు వినమని అడిగిండ్లు
కరుణలేనీ సర్కారు చెవిలో మన్నుపడ!
వినపడుతన్నదా! ఆ..గురువుల గోడు!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్

Leave a Reply