Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌ ఉన్నంతవరకు మద్యం షాపులు మూసివేయాలి : ఐద్వా

ఖమ్మం సిటి, మే 14 (ప్రజాతంత్ర విలేకరి) : అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో స్థానిక జిల్లా ఆఫీసులో బండి పద్మ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల హైమావతి హాజరై మాట్లాడుతూ కరోనా మహమ్మారితో ప్రజలు ఇబ్బంది పడుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులు తీసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. భౌతిక దూరాన్ని పాటించాలని చెపుతున్న ప్రభుత్వం ఈ రోజు మద్యం షాపులు తెరవడం వల్ల కరోనా వ్యాప్తికి కారణమవుతుందని అన్నారు.

అందుకని తక్షణమే మద్యం షాపులు మూసివేయాలని డిమాండ్‌ ‌చేసారు. వలస కూలీకి నిత్యావసర సరుకులు అన్ని రకాలు సరఫరాచేయాలని నగదు రూపంగా రూ. 5వేలు ఇవ్వాలని కోరారు..కరోనా సమయంలో ప్రభుత్వం పేదలందరికీ నిధులు ఎక్కువ కేటాయించి ఇవ్వకపోగా సంపన్నులకు మాత్రమే 60వేల కోట్ల రూపాయలు మాఫీ చేసిన ప్రభుత్వం ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న డ్వాక్రా మహిళకు కూడా బుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌ ‌చేసారు. ప్రభుత్వం కంటోన్మెంట్‌ ‌జోన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా టెస్టులు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి, జిల్లా ఉపాధ్యక్షులు అఫ్రోజ్‌ ‌సమీనా, మెరుగు రమణ, పిన్నింటి రమ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply