Take a fresh look at your lifestyle.

‘‘‌గ్రామాలలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు’’

మామూళ్ల మత్తులో అధికారులు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పుట్టగొడుగుల్లా  బెల్టు దుకాణాలు మద్యం ను విక్రయిస్తున్నాయి.  నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలుపల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ఏరులై పారుతున్న అన్నీ తెలిసినా అటువైపు కన్నెత్తిచూడ కుండా  ఎక్సైజ్‌ అధికారులు వ్యవహరించడం జరుగుతుందని ఆరోపణలు వినవస్తోంది. అన్ని జిల్లాలలో బెల్టు షాపుల దందా జోరుగా సాగుతోంది. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా కిరాణాదుకాణం నుంచి మొదలుకొని నివాసగృహాలు, పాన్‌ ‌షాపులు, కల్లు కాంపౌండ్‌ల సమీ పంలో మద్యం ఏరులై పారు తోంది. భవననిర్మా ణ కార్మికులు, కూలీలు, హోటల్‌లు, ఇసుక రవాణా కార్మికుల కు తెల్లవారు జామునే మద్యం అందిస్తూ బెల్టు దందాను మూడు క్వార్టర్లు, ఆరు ఆఫ్‌లుగా సాగిస్తున్నారు. గతంలో వైన్‌ ‌షాపుల పరిసరాలలో కొనసాగిన ఈ దందా ప్రస్తుతం గల్లీకొకటి ఏర్పాటు కావడంతో మ ద్యం ప్రియులు ఉదయం టీ, కాఫీల కు బదులుగా మద్యంను తాగుతూ ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ గాయాలపాలవుతున్నారు.

కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా ఉదయం పూట వా హనాలలో తీసుకువచ్చి, ఆ ప్రాంతంలోనే ఓ కల్లు కాంపౌండ్‌ ‌పరిసరాలలో పలువురు పాన్‌షాపులు ఏర్పాటుచేసి అందులో బెల్టుదుకాణం నడిపిస్తున్నారు. ఈ విషయం ఎక్సైజ్‌ అధికారులకు తెలిసినా అటు వైపు కన్నెతి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి.గుడుంబా విక్రయాలు మానేసిన వారికి ప్రభుత్వం ఓవై పు స్వయం ఉపాధి మార్గాలతో జీవనోపాధి కల్పిస్తుంటే, మ రో వైపు బెల్టు దుకాణాలు పల్లెలు, పట్టణ ప్రజలను మత్తులో ముంచుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లో బెల్టు దుకాణాలు కొనసాగుతున్నా.. చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోందన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.లిక్కర్‌ ‌డాన్లు వివిద  జిల్లాల్లో   కమీషన్లకు బెల్టు షాపుల వారికి మద్యం సరఫరా చేస్తున్నారు. రోజుకు ఎంత అమ్మితే అంత కమీషన్లు అందిస్తుండడంతో బెల్టుషాపుల నిర్వాహకులు ఒకరిని చూసి మరొకరు ఈ దందాను జీవనోపాధిగా చేసుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ దందాను బహిరంగంగా కొనసాగిస్తూ ప్రజలను మత్తులో ముంచుతున్నారు. ఆ మద్యం తాగిన వ్యక్తులు వాటికి బానిసలై తమ ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు.ఒకప్పుడు  నగరాలు ,పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈ దందా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ విచ్చలవిడిగా కొనసాగు తోంది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో బెల్టు దుకాణాలపై ఉక్కుపాదం మోపుతున్నామని అధికారులు ప్రకటిస్తుంటే.. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో యథేచ్ఛగా బెల్టుదుకాణాలు కొనసాగుతున్నాయి. కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే గ్రామాల్లో బెల్టుదుకాణాలు జోరందు కున్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఇట్టే అర్థమవుతుం ది. ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలోనే మద్యం షాపులు కొనసాగుతున్నాయి.

వివిధ  మండలంలలోని  కొన్ని గ్రామంలలో బెల్టు షాపులు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని గ్రామస్థులు ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల బెల్టు షాపు లు నిర్వహిస్తున్నారని తెలుస్తుంది.అందులో బాటిళ్లను ఎంఆర్‌పీ కంటే రూ.30 నుంచి రూ.50 వరకు ఎక్కువకు విక్రయిస్తున్నారు.. కొందరైతే వాహనాల ను ఉదయం సమయంలో తీసుకువచ్చి అడ్డకూలీలకు, ఇసు క ట్రాక్టర్ల మీద వెళ్లే కూలీలకు అమ్మకాలు  జరుపుతున్నారు.వివిధ ప్రాంతాల్లోని కల్లు కాంపౌండ్ల వద్ద గల కిరాణా దుకాణాల లో కల్తీమద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆ డుతున్నారని తెలుస్తోంది.అన్ని జిల్లాలలో ఈ దందా సంగతి తెలిసిన సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నిరేత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. కొందరు సిబ్బందికి ప్రత్యేకంగా వారం, నెలకు చొప్పున ముడుపులు అందుతుండడంతో ఏదైనా ఫిర్యాదురాగానే బెల్టు షాపుల నిర్వాహకులకు సమాచారం అందించి తనిఖీల విషయాలను చేరవేస్తున్నారు. దీంతో అప్రమత్తం అవుతున్న బెల్టు షాపుల వారు తనిఖీలలో ఏమీ దొరకకుండా జాగ్రత్త పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉ న్నతాధికారులు దృష్టిసారిస్తేనే ఈ బెల్టుదందాకు అడ్డుకట్టప డడమే కాకుండా ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పించిన వార వుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.యువత మాత్రం నిత్యం వీనికి బానిస ఆయి ఒళ్లు గుళ్ల చేసుకుని భవిష్యత్‌ ‌నాశనం చేసుకుం టున్నారు.ప్రజల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతి ంటూంది.ఇకనయినా ప్రభుత్వం ,సంబంధిత అధికారులు దృష్టి సారించాలి.బెల్ట్ ‌షాప్‌ ‌నిర్వాహకుల మీద ఉక్కు పాదం మోపాలి.
– కామిడి సతీష్‌ ‌రెడ్డి జడలపేట,జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా.9848445134.

Leave a Reply