Take a fresh look at your lifestyle.

కర్నాకట ఎన్నికలతో సరిహద్దుల్లో మద్యం బంద్‌

‌చెన్నై,మే9 : పొరుగున కర్ణాటక రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దుల్లో రెండు రోజులపాటు మద్యం విక్రయాలను బంద్‌ ‌చేయాలని హోసూరు కలెక్టర్‌ ‌దీపక్‌జాకబ్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో హోసూరు సపంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నకిలీ మద్యం 150 లీటర్లను ధ్వంసం చేశారు. సమాచారం మేరకు హోసూరు ఎక్సైజ్‌ ‌పోలీసులు దాడులు నిర్వహించారు.

ఇన్‌స్పెక్టర్‌ ‌పంకజం ఆధ్వర్యంల్లో బత్తలపల్లి అటవీ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించగా ఇద్దరు వ్యక్తులు నాటు సారా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. శాంతాపురం గ్రామానికి చెందిన మురుగన్‌(53), ‌వేపనహల్ళి కొండనాయకనపల్లి గ్రామానికి చెందిన మునియప్పన్‌ (37)అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply