Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు : వాతావరణ శాఖ

రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. మేడ్చల్‌, ‌సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్‌, ‌యాదాద్రి భువనగిరి, జనగామ, జగిత్యాల, హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తాయని చెప్పింది. ఇదిలా ఉండగా..బుధవారం ఉదయం 8.30గంటల వరకు మెదక్‌ ‌జిల్లా పాపన్నపేటలో అత్యధికంగా 87.8 మిల్లీ వి•టర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది.

నిజామాబాద్‌ ‌జిల్లా భీంగల్‌లో 55 మిల్లీ వి•టర్లు, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో 51.4, ఆదిలాబాద్‌ ‌జిల్లా ఉట్నూరులో 49.2, నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 46.4 మిల్లీవి•టర్ల వర్షాపాతం రికార్డయిందని వాతావరణ శాఖ వివరించింది.

Leave a Reply