Take a fresh look at your lifestyle.

మిడ్‌ ‌మానేరు గేట్లు ఎత్తివేత.. లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల

సిరిసిల్ల, జులై 22,(ప్రజాతంత్ర ప్రతినిధి) : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్‌మానేరు ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో 22 గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేశారు.మిడ్‌మానేరు నీటి సామర్థ్యం 27.5 టిఎంసిలు కాగా గురువారం సాయంత్రం వరకు 25.5 టిఎంసిలు నీరు నిల్వ ఉండగా ఎగువన గల మానేరు వాగు,మూలవాగులు,వంకల ద్వారా 82 వేల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమై లక్షకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.దీనితో చూడటానికి వందలాది జనం అక్కడకు చేరుకుంటున్నారు.

Leave a Reply