Take a fresh look at your lifestyle.

మోడీజీ.. చేతులు జోడించి వేడుకుంటున్నా

  • పాలూ, చేనేత, శ్మశానాలపై జిఎస్టీ ఎత్తేయండి
  • ప్రజలను బతికేలా చేయాలి తప్ప..చంపకండి
  • వి• విధానాలతో దేశానికి నష్టం వొస్త్తుంది
  • నెహ్రూ నాటి సంస్కారం లేకుండా పోయింది
  • నీతి ఆయోగ్‌లో పల్లీలు తినేందుకు రావాలా
  • రాజకీయంగా కేంద్రంతో పోరాటం తప్పదన్న కెసిఆర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 6 : ‌ప్రధానికి రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా. పాలు, చేనేత, శ్మశానాలపై జీఎస్టీ ఎత్తేయండి. గాలి తప్ప అన్నింటిపై జీఎస్టీ విధించారని సిఎం కెసిఆర్‌ ‌వి•డియా సమావేశంలో మండిపడ్డారు. దీనిపై పోరాడుతామని అన్నారు. మోదీ నాకు మంచి మిత్రుడు. ఆయనకు నాకు వ్యక్తిగత విభేదాలు లేవు. కానీ దేశ ప్రగతి కోసం సంఘర్షణ తప్పదు. నా ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తానని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. కేంద్రం అవలంబిస్తున్న విధానాలు దేశ ప్రగతిని దెబ్బతీస్తున్నాయని అన్నారు. అప్పట్లో ఎవరు మంచి చెప్పినా వినే సంస్కారం ప్రధాన మంత్రులకు ఉండేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సీఎం కేసీఆర్‌ ‌మండిపడ్డారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో వి•డియా సమావేశం సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రం డిక్టేటరిజం పెరిగిపోయిందని సీఎం కేసీఆర్‌ ‌విమర్శించారు. నీతి ఆయోగ్‌లో కో-ఆపరేటివ్‌ ‌ఫెడరలిజం లేదని అన్నారు.

అన్ని రంగాల్లో దేశం వెనకబడిపోయిందని అన్నారు. దేశ భవిష్యత్తు రోజురోజుకు ప్రమాదంలో పడుతుందన్నారు. కూర్చున్న కొమ్మను తామే నరుకున్నట్లు కేంద్రం వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. నల్లగొండ జిల్లాలో ప్లోరైడ్‌ ‌సమస్యను పట్టించుకోలేదని,. తెలంగాణ రాష్ట్రం వొచ్చాక సమస్య పరిష్కారానికి కృషి చేశామని గుర్తు చేశారు. కేంద్రం అవార్డులు, నీతి ఆయోగ్‌ ‌ప్రశంసలన్నీ అందుకున్నా.. నిధుల విషయంలో రాష్ట్రంపై చిన్నచూపు చూపిస్తున్నారని ప్రస్తావించారు. ఫెడరల్‌ ‌స్ఫూర్తి పోయి మేము ఏం చెబితే అది చేయాలనే వరకు పరిస్థితి వొచ్చింది. మేము చెప్పింది చేయకపోతే.. వి• కథ చూస్తామని హెచ్చరిస్తున్నారు. ట్యాక్సులకు సెస్‌లనే పేరు మార్చి రాష్ట్రాల నిధులను కేంద్ర కొల్లగొడుతుంది. సీఎం స్థాయి వ్యక్తికి కూడా టైమ్‌ ‌పెట్టి అయిపోగానే బెల్‌ ‌కొడుతుంటారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రాలకు కాళ్లు అడ్డం పెట్టకుండా ప్రోత్సహించాలని కోరాను.

మిషన్‌ ‌కాకతీయ, మిషన్‌ ‌భగీరథకు 24 ఏల కోట్లు ఇవ్వమంటే 24 పైసలు కూడా ఇవ్వలేదు. నీతి ఆయోగ్‌ ‌సిఫార్సుల మేరకు నిధులు ఇవ్వనప్పుడు ఇంక ఆ సంస్థ ఎందుకు’ అంటూ కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌పై సీఎం కేసీఆర్‌ ‌ద్వజమెత్తారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన ఒకసారి అమెరికా వెళ్లారు. అప్పుడు ఐసెన్‌ ‌హోవర్‌ ఆ ‌దేశాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఎస్కే డే అనే వ్యక్తిని నెహ్రూకు పరిచయం చేశారు. ఈయన కూడా వి• భారతీయుడే..అమెరికాకు చాలా అద్భుతమైన సేవలు అందించారు అని హోవర్‌ ‌పరిచయం చేస్తే.. నెహ్రూ మరుసటి రోజే ఎస్కే డేను భోజనానికి రావలసిందిగా ఆహ్వానించారు. ఆయన వొచ్చినప్పుడు భారత్‌కు స్వతంత్రం వొచ్చిన తర్వాత కూడా ఎస్కే డే వంటి మేధావులు పరాయి దేశాల్లో ఉండిపోతే.. భారత్‌ ‌పరిస్థితి ఏంటని? ఆవేదన వ్యక్తం చేశారు నెహ్రూ. ఆయన్ను భారత్‌ ‌వొచ్చేయాలని పిలిచారు. దానికి డే నిరాకరించారు. ఎందుకు? వి•కు దేశంపై ప్రేమ లేదా? అని నెహ్రూ ప్రశ్నించగా.. వి• ప్రాధాన్యతలు సరిగా లేవని కరాఖండీగా చెప్పేశారు డే. దేశంలో ఆకలితో ప్రజలు అలమటిస్తున్నారు, నదీజలాలు వృధా అవుతున్నాయి. ఇలాంటి సమయంలో వి•రు మాత్రం మొదటి పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యతనిచ్చారు అంటూ డే విమర్శించారు.

దాంతో రెండో పంచవర్ష ప్రణాళికలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. అనంతరం ఎస్కే డే స్వదేశానికి వొచ్చినప్పుడు రాజ్యసభ మెంబర్‌ను చేసి, కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ‌పోర్ట్‌ఫోలియో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆయన్ను మంత్రిగా నియమించారు. ప్రజల విశాలమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అప్పట్లో ఎన్నో నిర్ణయాలు తీసుకునేవారు. ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం పోయి, ఎన్డీయే ప్రభుత్వం వొచ్చింది. దీంతో ప్లానింగ్‌ ‌కమిషన్‌ ‌స్థానంలో నీతి ఆయోగ్‌ అమల్లోకి వొచ్చింది. ముఖ్యమంత్రులను దానిలో భాగస్వాములు చేసి, భారతదేశ రూపురేఖలు మార్చేస్తామని, ఇదొక టీమిండియా అని చెప్పడంతో చాలా సంతోషించా. ఇక్కడకు వొచ్చిన తర్వాత మంత్రులతో కూడా ఇదే విషయం చెప్పి ఆనందం వ్యక్తం చేశానని కేసీఆర్‌ ‌చెప్పారు. రాష్ట్రాల ప్రగతిని కేంద్ర ప్రభుత్వం దెబ్బ తీస్తోందని మండిపడ్డారు. మూర్ఖులు తాము కూర్చున్న కొమ్మలను తామే నరుక్కుంటారని, కేంద్రం వైఖరి కూడా ఇదే విధంగా ఉందని కేసీఆర్‌ ‌ధ్వజమెత్తారు. పన్నుల వసూలులో రాజ్యాంగంపరంగా కొన్ని పద్ధతులు ఉన్నాయన్న కేసీఆర్‌… ‌రాష్టాల్రకు పన్నుల్లో వాటా ఇవ్వాల్సి వొస్తుందని సెస్సులు వసూలు చేస్తున్నారన్నారు.

రాష్ట్రాలకు రావాల్సిన రూ.14 లక్షల కోట్ల నిధులు ఎగ్గొట్టారని మండిపడ్డారు. కేంద ప్రభుత్వ విధానాలు రాష్ట్రాల ప్రగతిని దెబ్బతీస్తున్నాయని వెల్లడించారు. ప్రగతిలో దూసుకెళ్తున్న రాష్ట్రాల కాళ్లల్లో కట్టెలు పెట్టవద్దని నీతి ఆయోగ్‌ ‌సమావేశాల్లో చెప్పానని గుర్తు చేశారు. ఇండియా భూభాగం 83 కోట్ల ఎకరాలు. ఇందులో 40 కోట్ల ఎకరాలు వ్యవసాయ అనుకూలమైనవి. ప్రతి ఎకరాకు నీరిచ్చే వనరులు దేశంలో ఉన్నాయి. అయినా అన్నీ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. శ్రీలంక, పాకిస్థాన్‌ ‌లాంటి పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. చాలా బాధతోనే నీతి ఆయోగ్‌ను బహిష్కరిస్తున్నాం. నా నిరసనపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని కెసిఆర్‌ అన్నారు.  రాష్టాల్ర అభివృద్ధిని కేంద్రమే అడ్డుకుంటోందని  మండిపడ్డారు.

Leave a Reply