Take a fresh look at your lifestyle.

లైఫ్‌ ‌లైన్‌

‌పిల్లల తలరాతను రాసే
ఆన్‌లైన్‌ అయోమయ మాయనో..
మరచిన ఆఫ్‌ ‌లైన్‌ ‌తరగతులో
మొదలౌతున్న ముహూర్తం
పిడుగుపాటులా రానేవచ్చింది
మహమ్మారి జాడలింకా
మాయమే కాలేదు
కొత్త రూపాల్లో మూడో, నాలుగో
అలల పేరిట కబళించేందుకు
దాగి కాచుకునే ఉంది
బ్రతుకు తెరువు కోసం తెగించి
భయంగానే బయటికి
రాక తప్పని రోజుల్లో
రెండేళ్లు రెక్కల చాటున పొదిమి
దాచుకున్న చిన్నారులను
అప్పనంగా మృత్యు నోట్లో నెట్టేందుకని
తెరవకూడని బడుల్ని తెరవాలనుకున్న
ఏలికలకేంతెలుసు క్షేత్రస్థితి
కార్పొరేట్‌ ‌బడుల్లో క్లాసుల పేరిట
కాసులు రాల్చేదుకు
కొరోనా ఫీజుల వసూళ్లు
రంజుగా మొదలయ్యాయి
బడుగు బడుల్లో కూర్చునేందుకు
బల్లలు కరువై
నేలచదువులు తప్పని
నిర్భాగ్యుల పిల్లలకు
భౌతిక దూరాలెక్కడ ?
ఆడ కూతుర్లకు మరుగునిచ్చే
శౌచాలయాల జాడలేక సిగ్గుతో
తల్లడిల్లే దీనస్థితిలో…
తాగేందుకు మంచినీళ్ళుండని
సర్కారు బడుల్లో
సానిటైజర్‌ ‌లెక్కడ?
గుడులమీద భక్తి పొంగిపొర్లే
నేతలకు బడులగతి
పట్టించుకున్నదెప్పుడు ?
సామాన్యుల అందుబాటులోని
సర్కారు బడుల దశ మార్చక
తొందరపాటుతో రేపటి
తరాన్ని వైరస్‌ ‌కోరలకు
దుర్మార్గంగా బలిచేయకండి
అందుకే ఆన్‌లైన్‌ అయినా
ఆఫ్‌ ‌లైన్‌ అయినా భావితరం
లైఫ్‌ ‌లైన్‌ ‌ను కాపాడుకోవాలి
(రాష్ట్రంలో విద్యాలయాలను

– డా. కె. దివాకరా చారి
9391018972

Leave a Reply