Take a fresh look at your lifestyle.

జీవితం

సమయవిడితి తెలియని
సందిగ్దపు పయనమది!
గమ్యం ఎప్పుడన్నది
తెలియని వింత గమనమది!

తరగతి సంఖ్య తెలియని
చదువుల చావడది!
పరీక్షలే పాఠాలుగా
మలిచే వాస్తవ పాఠశాల అది!

ఎవరు ఎప్పుడు వస్తాడో
ఎప్పుడు వీడుతాడో!
తెలియని కథతో సాగే నాటకమది!
ప్రతీక్షణం ఉర్రూతల కథనమది!

నవ్వుతూ సాగే సన్నివేశంలో
ఏడుపు పాత్రల తాళవింపది!
చీకటి మలుపుల పయనంలో
వెలుగు రేఖల మేళవింపది!

ఏడుస్తూ వస్తే, ఏడిపిస్తూ వెళ్లే
చిత్రమైన ఘటనల పర్వమది!
ఏడుపునవ్వులు ఏకకాలంలో
ఏకపాత్రలో నటించే రంగమది!

తొర్రల తోలుతిత్తిలో గాలి పట్టి
దాగుడుమూతలాడే ఆట అది!
సమయం చెప్పని , సందర్భం పట్టని
కాలపు ముల్లుపై నిలిచిన బుడగది!

– ఉషారం, 9553875577

Leave a Reply