Take a fresh look at your lifestyle.

ప్రాణ దాతలు నేడు డాక్టర్స్ ‌డే

‌వైద్యో నారాయణో హరి’’ వైద్యున్నిసాక్షాత్తు నారాయణ స్వరూపంగా భావించే సంస్కృతి మనది.కరోనా వైరస్‌ ‌కట్టడిలో వైద్యులు అహర్నిశలు ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్నారు. వారి విద్యుక్త ధర్మ నిర్వహణలో వారు కనిపించే దైవాలుగా, ప్రాణదాతలుగా ఇప్పుడు ఎందరికో అనుభవపూర్వకంగా బోధపడుతున్నది. 1 జులై 1882 లో జన్మించి 80 వ ఏట అదే తేదీన తనువు చాలించిన సుప్రసిద్ధ వైద్యుడు డాక్టర్‌ ‌బిధాన్‌ ‌చంద్ర రాయ్‌ ‌గౌరవార్ధం’’ వైద్యుల దినోత్సవం’’ మనదేశంలో 1991వ సంవత్సరం నుండి ఘనంగా జరుపు కుంటున్నా ము.అనునిత్యం ప్రజల ఆరోగ్యం కాపాడటంలో కీలక పాత్ర పోషించే వైద్య సేవలను గుర్తించి వారి గొప్పతనం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే వైద్య దినోత్సవ ముఖ్య ఉద్దేశం.

‘‘వైద్యో నారాయణో హరి’’ వైద్యున్నిసాక్షాత్తు నారాయణ స్వరూపంగా భావించే సంస్కృతి మనది.కరోనా వైరస్‌ ‌కట్టడిలో వైద్యులు అహర్నిశలు ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్నారు. వారి విద్యుక్త ధర్మ నిర్వహణలో వారు కనిపించే దైవాలుగా, ప్రాణదాతలుగా ఇప్పుడు ఎందరికో అనుభవపూర్వకంగా బోధపడుతున్నది. 1 జులై 1882 లో జన్మించి 80 వ ఏట అదే తేదీన తనువు చాలించిన సుప్రసిద్ధ వైద్యుడు డాక్టర్‌ ‌బిధాన్‌ ‌చంద్ర రాయ్‌ ‌గౌరవార్ధం’’ వైద్యుల దినోత్సవం’’ మనదేశంలో 1991వ సంవత్సరం నుండి ఘనంగా జరుపు కుంటున్నా ము.అనునిత్యం ప్రజల ఆరోగ్యం కాపాడటంలో కీలక పాత్ర పోషించే వైద్య సేవలను గుర్తించి వారి గొప్పతనం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే వైద్య దినోత్సవ ముఖ్య ఉద్దేశం. వైద్య వృత్తి పవిత్రమైనది. వారి త్యాగనిరతి అపూర్వం.తమ కుటుంబాలను,వ్యక్తిగత జీవితాన్ని సైతం పక్కన పెట్టి వృత్తికే ప్రాధాన్యతనిస్తారు.రోగుల మధ్య నిరంతరం గడిపేవారికి అనారోగ్యానికి గురి చేసే ప్రమాదాలు పొంచి ఉంటాయి అని తెలిసి కూడా తమ దగ్గరికి వచ్చిన రోగుల ఆనారోగ్య సమస్యలు తెలుసుకుంటూ అనునిత్యం వైద్యం అందిస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే తల్లి మనకు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ నిస్తారు.

కొరోనా కష్టకాలంలో వైద్యులు ప్రాణ దాతలు అయ్యారు. ఏ కాస్త ఏమరుపాటుగా ఉన్నా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న కరోనా వైరస్‌ ‌తో పోరాడుతూ ధైర్యంగా విధులు నిర్వహిస్తున్నారు .ఎన్నో కుటుంబాలకు ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. కోవిడ్‌ 19 ‌లక్షణాలు ఉన్నాయని వింటేనే కుటుంబ సభ్యులతో సహా ఆత్మీయులంతా దూరంగా జరిగి పోతున్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వారికి చికిత్స అందించడం వృత్తిపట్ల వారికి ఉన్నఅంకితభావాన్ని తెలియజేస్తున్నది. కోవిడ్‌ ‌వైరస్‌ ‌సోకిన వారికి మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. వైరస్‌ ‌బారిన పడిన వాళ్లకు చికిత్స అందిస్తూ కనిపించే దైవాలుగా నిలుస్తున్నారు. దేశంలో గత సంవత్సరం జనవరి 30న తొలి కరోనా కేసు నమోదైంది. అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటిదాకా కరోనా వైరస్‌ ‌పై అలుపెరుగని పోరాటం చేస్తునే ఉన్నారు. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా వైరస్‌ ‌బారినపడి 400 మందికి పైగా వైద్యులు మరణించినను భయపడకుండా బాధితులకు వైద్యం అందిస్తున్నారు. వైద్యులు నిర్విరామంగా పని చేయడం, అనివార్యంగా సేవలను అందించే క్రమంలో ఎంత అప్రమత్తంగా ఉన్నా వైద్య సిబ్బంది కొరోనా బారినపడి ప్రాణాలు కోల్పో తున్నారు. ఒకరి చావు తప్పించడానికి తామే మృత్యు ద్వారం వరకు వెల్తున్నారు. వారితో పాటు వారి కుటుంబాలు కూడా వ్యాధిబారిన పడుతున్నాయి. వారి కుటుంబాల ప్రాణాలు కూడా కొన్నిసార్లు గాల్లో కలుస్తు న్నాయి. అయినప్పటికీ వారు ధైర్యముగా వారి సేవలను అవిశ్రాంతముగా కొనసాగిస్తున్నారు.

వైరస్‌ ‌బారిన పడిన బాధితులకు కాపాడేందుకు ప్రయత్ని స్తున్నారు. అయినను దురదృష్టవశాత్తు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.ఇంతటి సంక్షోభంలో వైద్య సిబ్బంది అందిస్తున్న సేవల వలన ఎంతోమంది ప్రాణాలు కాపాడబడుతున్నవి. వారి కృషి వలన మరియు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రస్తుతం కరోనా వైరస్‌ ‌వ్యాప్తి కొంత నెమ్మదించింది అని చెప్పవచ్చు. వైద్యులు పూర్తి వృత్తి నిబద్ధతతో వైరస్‌ ‌కట్టడికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఇంతటి విపత్కర సమయంలో వారు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. వారు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ తమ శక్తికి మించి సేవలం దిస్తున్నారు. కంటికి కనిపించని వైరస్‌ ‌తో అను నిత్యం అవిశ్రాంత సైనికుల్లా పోరాడుతున్నారు. వారిపై విపరీతమైన పని భారం పెరుగుతున్నది. సరిపడా వైద్య సిబ్బంది లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. వారిపై పని భారాన్ని తగ్గించాల్సిన అవసరం కలదు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు ఉండాలి. ప్రస్తుతం మనదేశంలో 1500 మందికి ఒక వైద్యుడు మాత్రమే పని చేస్తున్నాడు.ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్య సిబ్బంది ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై కలదు . వారిని కాపాడుకుంటేనే వారు మన ప్రాణాలను కాపాడగలుగుతారు అనే సత్యం మరువరాదు. ఆస్పత్రిలో వైద్యులకు కావాల్సిన మౌలిక వసతులతో పాటుగా వారికి కావలసిన రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై కలదు.

ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని అడ్డుకుంటున్న వైద్యులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.మన ప్రాణాలను కాపాడుతున్న వారిని గౌరవంగా చూసుకోవాలి . విధి నిర్వహణలో వారు ఎదురుకుంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు పరిష్కరిస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపాలి. వారి పై జరిగే దాడులను అరికట్టి వారికి రక్షణ కల్పించాలి. వారిపై దురుసుగా వ్యవహరించరాదు . వారు తమ విధులు సక్రమంగా నిర్వహించుకునేందుకు సహకరించాలి. కరోనా వైరస్‌ ‌నుండి మనల్ని కాపాడుతున్న రక్షణ కవచాలు డాక్టర్లు. అలాంటి రక్షణ కవచాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై కలదు. మన ప్రాణాల రక్షణ కొరకు వారు తమ ప్రాణాలను ఘనంగా పెట్టి పనిచేస్తున్నారన్న అవగాహన మనమందరం కలిసి ఉండాలి. డాక్టర్లు లేని సమాజాన్ని మనం కలలో కూడా ఊహించలేం. వారికి మేమున్నామంటూ ప్రజలు,ప్రభుత్వాలు భరోసా కల్పించినప్పుడే వారు సక్రమంగా విధులు నిర్వహించగలుగుతారు.

వ్యాధులనుండి మనను అను నిత్యం రక్షిస్తున్న డాక్టర్లకు సహకరిద్దాం. వారిచ్చే నిస్వార్థ సేవ లను వృధా కానీయకుండా వారిచ్చే అమూల్యమైన సూచనలు పాటిస్తూ ఆరోగ్యాన్ని ప్రాణాలను కాపాడుకుందాం.’’ వైద్యం ఒక వృత్తి కాదు ప్రాణాలను కాపాడే ఒక అద్భుత శక్తి’’ అని భావిస్తూ ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులందరికీ ‘‘వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు’’.
– పుల్లూరు వేణు గోపాల్‌. 9701047002

Leave a Reply