Take a fresh look at your lifestyle.

తెలంగాణ విమోచనమా? విద్రోహమా?

1948 ‌సెప్టెంబర్‌ 13 ‌న భారత సైన్యం ఆపరేషన్‌ ‌పోలో’’ పేరిట హైదరాబాద్‌ ‌సంస్థానాన్ని ముట్టడించింది దీనికి పోలీస్‌ ‌యాక్షన్‌ అని పేరు పెట్టారు . ఆ తర్వాత సెప్టెంబర్‌ 17‌న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు. 1947 ఆగస్టు 15న బ్రిటిష్‌ ‌పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకున్నారు. కాని దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్‌ ‌సంస్థానం ప్రజలకు అదృష్టం లేకుండా పోయింది అప్పటి వరకు బ్రిటిష్‌ ‌సామంతులుగా ఉన్న హైదరాబాద్‌ ‌నవాబ్‌ ‌మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ‌తనకు తానుగా ప్రకటించుకున్నాడు రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాలు పరిపాలించిన పాలన అంతమైంది. హైదరాబాద్‌ అటు ఇండియాలో ఇటు పాకిస్తాన్లో కలవద్దన స్వతంత్రంగా ఉంటుందని ఉంటుంది అని ప్రకటించాడు కానీ సంస్థానాలలో ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు .ఆనాటి హైదరాబాద్‌ ‌సంస్థానం లోతెలంగాణ ,మరట్వాడ కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా ఫ్యూడల్‌ ‌పాలన కొనసాగుతుంది.

ఒకవైపు దేశ్ముఖ్‌ ,‌జాగీర్దార్‌ ‌దొరల వెట్టిచాకిరిలో గ్రామీణ ప్రజానీకం మగ్గి పోతుంటే మరోవైపు నిజాం అండతో రజాకార్లు చెలరేగిపోయారు. ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. గ్రామాలపై పడి ప్రజలను దోచుకుని హత్యాకాండను కొనసాగించారు. నిజాం ప్రోద్బలంతో రజాకార్ల నాయకుడు కాశీం రజ్వి ఢిల్లీ ఎర్రకోట పై అసఫ్జాహీ పతాకాన్ని ఎగురవేస్తాం అని ప్రగల్భాలు పలికాడు . అలాంటి పరిస్థితుల్లో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్టేట్‌ ‌కాంగ్రెస్‌ ‌కమ్యూనిస్టు పార్టీ, ఆర్య సమాజ్‌ ‌తమతమ మార్గాల్లో పోరాటాన్ని చేపట్టాయి. ఈ సంస్థలన్నింటినీ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ‌నిషేధించాడు. పోతుంటే మరోవైపు తో నిజాం అండతో రజాకార్లు చెలరేగిపోయారు. ప్రజల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. గ్రామాలపై పడి ప్రజలను దోచుకుని హత్యాకాండ కొనసాగించారు. నిజాం ప్రోద్బలంతో రజాకార్ల నాయకుడు కాశీం ఎర్రకోట పై అసఫ్జాహీ పతాకాన్ని ఎగురవేస్తాం ప్రగల్భాలు పలికాడు… అలాంటి పరిస్థితుల్లో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్టేట్‌ ‌కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టు పార్టీ, ఆర్య సమాజ్‌ ‌తమ తమ మార్గాలలో పోరాటాన్ని చేపట్టాయి.ఈ సంస్థలన్నింటినీ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ ‌నిషేధించాడు. దీంతో హైదరాబాద్‌ ‌సంస్థానం పై చర్య తీసుకోవడం తప్పదని అప్పటి హోం మంత్రి సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌నిర్ణయించుకున్నాడు.

పరిస్థితిని ముందే ఊహించిన నిజాం నవాబు పాకిస్తాన్‌ ‌సహాయం కోసం వర్తమానం పంపడంతో పాటు ఐక్యరాజ్యసమితి ని ఆశ్రయించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో 1948 సెప్టెంబర్‌ 13 ‌న భారత సైన్యం ‘‘ఆపరేషన్‌ ‌పోలో ‘‘పేరిట హైదరాబాద్‌ ‌సంస్థానం ముట్టడించింది. దీనికి పోలీస్‌ ‌యాక్షన్‌ అని పేరు పెట్టారు ఆ తర్వాత సెప్టెంబర్‌ 17‌న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు. ఈ విధంగా హైదరాబాద్‌ ‌వాసులకు స్వాతంత్రం వచ్చింది.’’ ఆ తర్వాత హైదరాబాద్‌ ‌రాష్ట్రం ఏర్పడింది .సెప్టెంబర్‌ 17‌న’’ తెలంగాణ విమోచన దినోత్సవం’’గా పాటిస్తారు .అయితే దీన్ని విమోచన దినోత్సవంగా పరిగణించని వారు ‘‘తెలంగాణ విలీన దినోత్సవం’’ గా జరుపుకుంటున్నారు.

గంగాధరీ శ్రీనివాస్‌,
‌టి పి టి ఎఫ్‌ ‌సభ్యులు,
9492725200.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!