Take a fresh look at your lifestyle.

గుజరాత్‌ ‌నుంచి 4 వేలమంది మత్సకారులకు విముక్తి

  • రాష్ట్రానికి బస్సుల్లో తీసుకుని వస్తున్నాం రాగానే క్వారంటైన్‌కు తరలిస్తాం మంత్రి మోపిదేవి వెంకటరమణ

అమరావతి,ఏప్రిల్‌ 29 : ‌గుజరాత్‌లో చిక్కుకున్న 4 వేల మంది మత్స్యకారులను త్వరలోనే రాష్ట్రానికి తీసుకువస్తామని ఆంధప్రదేశ్‌ ‌మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. 65 బస్సుల్లో వారందరినీ తీసుకొస్తామన్నారు. బుధవారం ఆయన డియాతో మాట్లాడుతూ..మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఎవరూ ఆందోళన చెందొద్దని, వారందరినీ ప్రభుత్వమే సొంత గ్రామాలను తీసుకొస్తుందని భరోసా ఇచ్చారు. ఇందుకోసం సిఎం జగన్‌ 3‌కోట్లు కేటాయించారని అన్నారు. మత్స్యకారుల గురించి సీఎం జగన్‌ ‌జగన్‌ ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా, గుజరాత్‌ ‌సీఎంలతో మాట్లాడారని, వారి అనుమతితో అందరిని తీసుకొచ్చే ఏర్పాట్లు చేశామన్నారు. సొంత గ్రామాలను చేర్చేందుకు ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరిస్తుందని స్పష్టం చేశారు. దీని కోసం సీఎం జగన్‌ ఇప్పటికే రూ.3 కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. ఇప్పటికే గుజరాత్‌కు 54 బస్సులు బయల్దేరాయని, మరో కొద్ది గంటల్లో మిగిలిన బస్సులు కూడా వెళ్తాయని చెప్పారు.

ఇక్కడికి వస్తున్న అందరినీ క్వారంటైన్‌కు తరలించి గడువు ముగిసిన తర్వాతనే ఇళ్లకు పంపిస్తామని పేర్కొన్నారు. గుజరాత్‌లో ఉన్న మత్స్యకారుల్లో ఇద్దరు అనారోగ్యంతో మరణించారని తెలిపారు. గ్రీన్‌జోన్లలో ఉన్న వలస కార్మికులను స్వస్థలాలకు పంపుతామని మోపిదేవి వెంకటరమణ భరోస కరోనా నియంత్రణలో దేశంలో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. కరోనాపై టీడీపీ అధినేత చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, పక్క రాష్ట్రంలో ఉండి ఆయన ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు ధైర్యం చెప్పడానికే మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటిస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలే స్లీపర్‌ ‌సెల్స్‌గా మారారనే అనుమానం ప్రజల్లో ఉందన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!