Take a fresh look at your lifestyle.

10‌మంది బాల కార్మికులకు విముక్తి

Liberation of 10 child laborers
ఇటుక బట్టిలో పని చేసిన బాలకార్మికులు

సిద్దిపేట కలెక్టరేట్‌: ఆపరేషన్‌ ‌స్మైల్‌ 6 ‌లో భాగంగా తడ్కకపల్లి గ్రామ శివారులో సోమన్న రాజు ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 10మంది బాల కార్మికులకు విముక్తి కలిగించి వారి తల్లిదండ్రులకు డివిజన్‌ ఇం‌చార్జి సిద్దిపేట టూ టౌన్‌ ఎస్‌ఐ ‌కనకయ్య గౌడ్‌, ‌చైల్డ్ ‌వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ‌స్వర్ణలత, సిడబ్ల్యుసి కౌన్సిల్‌ ‌మెంబర్‌ ఆత్మ రాములు కౌన్సిలింగ్‌ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బాలకార్మికుల నిర్మూలన కొరకు ఆపరేషన్‌ ‌స్మైల్‌ ‌టీములు జిల్లా నందు పని చేస్తున్నాయన్నారు. ఎవరైనా షాపులలో, ఇండ్లల్లో, ఫ్యాక్టరీలలో, ఇటుకబట్టీల లో ఇతర సిమెంటు పరిశ్రమలలో బాల కార్మికుల చేత పనిచేస్తున్నట్లయితే వెంటనే 1098 లేదా డైల్‌100 ‌నెంబర్లకు సమాచారం అందిం చాలన్నారు. అట్టి యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply