Take a fresh look at your lifestyle.

ఎల్జీ పాలిమర్స్ ‌ఘటనలో మరొకరుమృతి

‌విశాఖపట్టణం,మే 27 : ఎల్జీ పాలిమర్స్ ‌ఘటనలో మరొకరుమృతి చెందారు. దీంతో ఈ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం పదమూడు మంది మృతి చెందారు. విశాఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరో మహిళ మృతి చెందింది. ఇదిలావుంటే బాధితులను ఆదుకుం టామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ‌భరోసా ఇచ్చారు. సీఎం జగన్‌ ‌పాదయాత్రలో ఇచ్చిన హాల్ని అమలు చేస్తున్నారని, ఏడాదిలోనే 90శాతం హాలను జగన్‌ అమలు చేశారని తెలిపారు. విద్యకు సీఎం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, కార్పొరేట్‌ ‌స్కూల్స్‌కి ధీటుగా స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇంగ్లిష్‌ ‌డియంపై చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలు గురివింద సామెతలా ఉన్నాయని దుయ్యబట్టారు.

చంద్రబాబు హయాంలో పోలవరం,పట్టిసీమలో అవినీతి జరిగిందని ఆరోపి ంచారు. టీడీపీ ఎందుకు ఓడిపోయిందో మహానా డులో సక్ష చేసుకోవాలన్నారు. ఇంకా చంద్రబా బు అధికారంలో ఉన్నారనుకుంటున్నారని తప్పు బట్టారు.చంద్రబాబు మైండ్‌సెట్‌ ‌మార్చుకుని అభి వృద్ధికి సహకరించాలని అవంతి సూచించారు.వి శాఖలో భూకబ్జా జరిగినట్లు నిరూపిస్తే రాజీనా మా చేస్తానని ప్రకటించారు. నిరూపిం చలేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. కొన్ని వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్‌ ‌చేస్తున్నారని అవంతి శ్రీనివాస్‌ ‌మండిపడ్డారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!