Take a fresh look at your lifestyle.

మరో సారి ఉద్యమ స్ఫూర్తి ని చాటుదాం..!

  • తెలంగాణలో 24 గంటల జనతా కర్ఫ్యూ
  • కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
  • ఇళ్లలోంచి ఎవరూ బయటకు రావద్దు
  • ఎక్కడి వారు అక్కడే ఉండిపోదాం
  • తెలంగాణ ఐక్యతను చాటడంలో ముందుందాం
  • రవాణా వ్యవస్థలన్నీ బంద్‌ ‌చేస్తున్నాం
  • అత్యవసర పరిస్థితుల కోసం అందుబాటు రవాణా
  • మహారాష్ట్ర సరిహద్దులను మూసేసే ఆలోచన
  • ప్రధాని పిలుపు మేరకు సాయంత్రం 5గంటలకు చప్పట్లతో ఐక్యత చాటుదాం
  • ప్రగతిభవన్‌లో మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్‌ ‌పిలుపు

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కోసం 60 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసిన ఘన చరిత్ర తెలంగాణా ప్రజలది ..అదే స్ఫూర్తి తో కొరోనా వైరస్ విస్తరణ నివారణకు తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని సీఎం కేసీఆర్‌ ‌పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు జనతా కర్ఫ్యూ లో పాల్గొనాలన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో అంతా ఐక్యత చాటుదామని అన్నారు. ఆదివారం తెలంగాణలో ఎమర్జెన్సీ సేవలు తప్ప అన్నీ సేవలు బంద్‌ ‌చేస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ, మెట్రో సేవలు బంద్‌ అని అన్నారు. అత్యవసరం కోసం డిపోకు ఐదు ఆర్టీసీ బస్సులు, ఐదు మెట్రో రైళ్లు నడుస్తాయన్నారు. దుకాణాలు, వైన్స్ ‌షాపులు బంద్‌ ‌చేయాలని ఆదేశించారు. మహారాష్ట్రలో వ్యాధి తీవ్ర పెరుగుతున్నందన బార్డర్‌ను మూసివేసే ఆలోచన చేస్తామన్నారు. ఇతర రాష్టాల్రనుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు కూడా ఆపేస్తామన్నారు. మాల్స్, ‌షాపులు కూడా మూసేయాలన్నారు. ఆస్పత్రులు, పాలు, పండ్లు,కూరగాయలు, పెట్రోబంక్‌ ‌లు, డియా సిబ్బందికి బంద్‌ ‌నుంచి మినహాయింపునిస్తున్నట్లు ప్రకటించారు.

Let's talk about the spirit of the movement once again ..!

24 గంటలు కర్ఫ్యూ పాటించి యావత్‌ ‌దేశానికి ఆదర్శంగా నిలుద్దామన్నారు. తెలంగాణ ఐక్యతను చాటేలా దేశానికి ఆదర్శంగా నిలుద్దామని అన్నారు. కరోనా బంద్‌ ‌నేపథ్యంలో ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌ ‌డియాతో మాట్లాడారు. కరోనా వైరస్‌ ‌నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు అందరూ సహకారం అందించాలని కెసిఆర్‌ ‌కోరారు. ఆదివారం ఉదయం 6 గంటలనుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24గంటల పాటు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు. వందకు వంద శాతం ఆర్టీసీ బస్సులు తిరగవని చెప్పారు. ఇతర రాష్టాల్రకు చెందిన బస్సులను రాష్ట్రంలోకి అనుమతివ్వమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. షాపులు, మాల్స్ ‌స్వచ్ఛందంగా మూసివేయాలన్నారు. వ్యాపార, వర్తక సంఘాల ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉదయం 7నుంచి రాత్రి 9 గంటల వరకు అని ప్రధాని పిలుపునిచ్చినా తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూని 14గంటలు కాకుండా 24 గంటలు పాటించి దేశానికే ఆదర్శంగా నిలుద్దామన్నారు. కరోనా వైరస్‌ ‌దేశంలో ఎవరిని ఏం చేసినా తెలంగాణవాళ్లను ఏం చేయలేక పోయింద నేలా మసులుకుందామన్నారు.

రాష్ట్రంలో అత్యవసర సేవల సిబ్బంది మాత్రమే పనిచేయనున్నట్లు తెలిపారు. మిగతా వారంతా ఎవరికి వారే స్వచ్ఛందంగా బంద్‌ ‌పాటించాలన్నారు. ఇది ఒక కఠిన సమయమని, సంకట స్థితి అని, స్వయం నియంత్రణ పాటించాలన్నారు. అందరం కలిసి పాటిస్తే తప్ప ఇది సాధ్యం కాదన్నారు. స్వీయ నియంత్రణ మనల్ని కాపాడుతదన్నారు. మన కోసం, మన కుటుంబం కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం, మన ప్రపంచం కోసం అందరం కలిసి జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొందామన్నారు. రేపు ఏం జరుగుతందో తెలియదు. ఎలా ఉంటుందో తెలియదు. ఎలాంటి కఠిన పరీక్షనైనా ఎదుర్కొంటామని అన్నారు. అసవరమైతే ప్రజలకు నేరుగా నిత్యావసరాలు పంపిణీ చేస్తామన్నారు. ఎక్కడైతే నియంత్రణ పాటించలేదో వైరస్‌ అక్కడ బాగా విస్తరించిందన్నారు. ఎవరికివారే స్వీయ నియంత్రణ పాటిస్తే రాష్టాన్రికి, దేశానికి సేవ చేసినట్లేనని సీఎం అన్నారు. వైరస్‌ ఎక్కువగా 60 ఏండ్ల పైబడిన వాళ్లు, 10 ఏండ్ల లోపు పిల్లలకు ప్రాణాంతకంగా ఉంటున్న నేపథ్యంలో వారిని బయటకు రాకుండా చూసుకోవాలన్నారు.

వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ ‌పాటించాలన్నారు. ఈ సందర్భంగా జనతా కర్ఫ్యూలో భాగంగా ప్రధాని పిలుపు మేరకు సాయంత్రం 5 గంటలకు అందరూ ఇళ్ల బయటికి వచ్చి చప్పట్లు కొట్టాలని అన్నారు. . సాయంత్రం 5 గంటలకు నేను కూడా కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వచ్చి చప్పట్లు కొడతాను. చప్పట్లు కొట్టి మన ఐక్యతను చాటి చెప్పాలి. సాయంత్రం 5 గంటలకు సైరన్‌ ‌మోగిస్తాం. సైరన్‌ ‌మోగగానే బయటికి వచ్చి 4 నిమిషాలు చప్పట్లు కొట్టాలి ’ అని తెలంగాణ ప్రజానీకానికి కేసీఆర్‌ ‌పిలుపునిచ్చారు. కరోనా ఉధృతి ఎక్కువైతే ఇంటింటికి రేషన్‌ ‌పంపేందుకు యోచిస్తున్నాం. ఎన్ని వేల కోట్లయినా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ఢిల్లీ నుంచి టెస్టింగ్‌ ‌పరికరాలు, మాస్క్‌లు వచ్చాయి. సమస్య తీవ్రమైతే మనం ముందుగా వైద్యుల్ని కాపాడుకోవాలి. వారు చేస్తున్న సేవలను అభినందించారు. వారి ఆరోగ్యాలకు భంగం రాకుండా చూసుకోవాల్సి ఉందన్నారు. డియా సమావేశంలో మంత్రులు, సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌, ‌డిజిపి మహేందర్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy