Take a fresh look at your lifestyle.

సీజనల్‌ ‌వ్యాధుల నియంత్రణకై పటిష్ట చర్యలు చేపడుదాం

  • డెంగ్యూ, మలేరియా నియంత్రణ చర్యలకు చొరవ చూపాలి
  • ప్రజల్లో అవగాహన కల్పిస్తూ భరోసానివ్వాలి
  • టెలీ కాన్ఫరెన్స్‌లో ప్రజాప్రతినిధులకు మంత్రి హరీష్‌రావు పిలుపు

సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ 100 శాతం కోవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌పక్రియను వేగవంతంగా అమలయ్యేలా చూస్తూనే సీజనల్‌ ‌వ్యాధుల నియంత్రణకై స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో పటిష్ట చర్యలు చేపడుదామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  తన్నీరు హరీష్‌రావు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని సిద్ధిపేట అర్బన్‌, ‌సిద్ధిపేట రూరల్‌, ‌నారాయణరావుపేట, చిన్నకోడూర్‌, ‌నంగునూరు మండలాల్లోని ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, మండల ప్రజాప్రతినిధులు, మార్కెట్‌ ‌కమిటీ ఛైర్మన్లు, మునిసిపాలిటీ పరిధిలోని కౌన్సిలర్లు మొత్తంగా 224 మందితో మంత్రి హరీష్‌రావు టెలీ కాన్ఫరెన్స్ ‌ద్వారా సమీక్షించారు.

ప్రజలందరికీ కోవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌పక్రియ, సీజనల్‌ ‌వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ కట్టడికై ఆయా గ్రామాలలో సర్పంచ్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించాలనే అంశంపై నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులందరికీ మంత్రి దిశా నిర్దేశం చేశారు.  ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికీ కోవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, వ్యాక్సిన్ల కొరత లేదని అందుబాటులో ఉన్నాయనీ, థర్డ్ ‌వేవ్‌ ‌వచ్చే అవకాశం ఉందని వైద్య వర్గాలు చెబుతున్న దృష్ట్యా 100శాతం వ్యాక్సినేషన్‌ ‌జరిగితే మనకు ఏ ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా పంచాయతీ కార్యదర్శిలకు, ఏఎన్‌ఎం‌లకు, ఆరోగ్య సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీచేసిందనీ, ఈ నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌చేపట్టి, ఏ ఒక్క గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన ఒక్క మనిషి కూడా వ్యాక్సినేషన్‌ ‌వేసుకోకుండా ఉండొద్దనీ, అలా చూడాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులదేనన్నారు. అలాగే, పట్టణ ప్రాంతాల్లోని వార్డులో కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా వ్యాక్సిన్‌ ‌తీసుకోకుండా ఉండొద్దని చూసే బాధ్యత స్థానిక మునిసిపల్‌ ‌కౌన్సిలర్లు తీసుకోవాలని కోరారు.

ప్రజాసేవలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజారోగ్య పరిరక్షణ కూడా ప్రజాసేవలో భాగమే కాబట్టి మీ ప్రాంత పరిధిలో అందరికీ కోవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌పక్రియ సజావుగా జరిగేలా నిత్యం పర్యవేక్షణ జరపాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. ఆయా గ్రామ, పట్టణ పరిధిలోని అర్బన్‌ ‌హెల్త్ ‌సెంటరు, ఆయా వార్డులలో ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ, ఆరోగ్య సిబ్బందితో పాటు మునిసిపల్‌ ‌కౌన్సిల్‌ ‌కమిషనర్‌, ‌స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశాలు నిర్వహించి సమన్వయంతో వ్యాక్సినేషన్‌ ‌పక్రియను ముందుకు తీసుకుపోవాలని కోరారు.  గత వారం నుంచి వైరల్‌, ‌డెంగ్యూ.. తదితర సీజనల్‌ ‌వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేలా నీటి ట్యాంకులు, డ్రైనేజీలు పరిశుభ్రంగా ఉండేలా, పట్టణంలో ఫాగింగ్‌ ‌చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.  సీజనల్‌ ‌వ్యాధులు పెరగక ముందేహొనిరోధించడానికి సకాలంలో ఆయా ప్రాంతాల్లో శానిటేషన్‌పై స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌చేపట్టే వంటి చర్యలపై మంత్రి  తన్నీరు హరీష్‌రావు స్థానిక ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు.

Leave a Reply