Take a fresh look at your lifestyle.

రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుదాం..!

ఇప్పుడు ఏ సామజిక మాధ్యమాల్లో లేక సోషల్‌ ‌మీడియాల్నో ఎటు చుసిన ‘‘ఐ స్టాండ్‌ ‌విత్‌ ‌ఫార్మర్‌ ‘‘అనే క్యాప్షన్స్ ‌కనబడుతున్నాయి సమాజ పరివర్తనతో ఆధునిక పోకడల్లో తెలియాడుతున్న మనిషి మరియి ఎసి గదుల్లో ఉండే ప్రొఫెషనల్స్ ‌కి కూడా వ్యవసాయం పైన ఒకింత ప్రేమచూపడం అబినందించక ఉండలేము ,ఏ విపత్హు వచ్చిన ఆగని సేద్యం వ్యవసాయం.. రైతు ఏ కాలమైనా కష్టించి ఇస్టమైన రీతిలో ఓర్పుతో చేస్తుంది తాను తల్లి లా భావిన్చే వ్యవసాయమే ,ఆరుగాలం చేసిన కష్టం నేలపాలైన కుమిలి కుమిలి ఏడ్చినా బాధను బయటకి చెప్పడు ,మందులోడు ముంచిన ,ప్రబుత్వాలు నిట్టూర్చిన గేర్‌ ‌మార్చక ఉండలేడు ..ఆ మట్టివాసనలు అలాంటివి. మరి ,మన దేశం గ్రామీణ భారతం దేశానికీ గ్రామాలే వెన్నుముక ,పట్టు కొమ్మలు దేశం లో 80 శాతం వ్యవసాయం పై ఆధారపడి ఉంది కాబట్టి రైతులకు కావాల్సిన సాయం ,ఆర్ధిక చేయూత అందిస్తాం అని స్వాతంత్రం వచ్చి నప్పటి నుంచి నేటి వరకు ప్రభుతాలు ఉదరగొడుతున్నాయి కానీ.. నేటి వరకు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర నిర్ణయించుకునే అధికారం రైతులకు లేదు ….పైగా రైతులు ఎప్పుడు రోడ్డెక్కి యాచించే పరిస్థితులే కనిపిస్తున్నాయి.

ప్రపంచంలో లో ఎనిమిదో వంతు వ్యవసాయ భూమి భారతదేశంలో ఉంది, భారతదేశంలో భూమి విస్తీర్ణం 32 లక్షల 83 వేల చదరపు కిలోమీటర్లు దీనిలో ఎక్కువగా వ్యవసాయ భూమి ఉంది. ప్రపంచ పటంలో లో భారతదేశం వ్యవసాయ భూమి వాటా 12 శాతం, 16 కోట్ల హెక్టార్ల భూమి భారత దేశంలో ఉంటే అదే పొరుగున ఉన్న చైనాకు 10 కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమి ఉంది,ఇన్ని వనరులు ఉన్నా వ్యవసాయం వాటా ప్రపంచంలో 2.3 శాతం మాత్రమే. పళ్లు కూరగాయలు ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానం లో ఉంది కానీ వీటి వాణిజ్య వ్యవహారాల్లో భారతదేశం 1.7 శాతం మాత్రమే, బొప్పాయి నిమ్మకాయ లాంటి పంట ఉత్పత్తులు భారతదేశం మొదటి స్థానంలో ఉంది.. కానీ వీటి వ్యాపార వ్యవహారాల్లో మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఒక ఒక శాతాన్ని కూడా అ మించలేదు. ఇన్ని రంగాల్లో ముందున్న రైతు ఎందుకు వెనకబడి పోతున్నారు అనేది అసలు సమస్య ,కారణం సరైన, పంట నిల్వ అ చేసే సామర్థ్యం లేదు సరైన గిడ్డంగులు లేవు రైతుకు తనకు ఇష్టమొచ్చిన, రేటుకు ధాన్యాన్ని అమ్ముకునే స్వేచ్ఛ లేదు, ఎగుమతుల నిషేధం ,ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌విధానం లేకపోవడం, అంటే ప్రభుత్వ విధానాలు రైతుకు మేలు చేసేవి కాకుండా కీడు చేసేవిగా ఉన్నాయని అనుభవజ్ఞుల మాట. అంతేకాకుండా ప్రభుత్వాలు రైతు పక్షపాతిగా ఉంటున్నామని నటిస్తున్నాయి అని రైతుల రోదన.

ప్రతి ఏటా రైతులు గిట్టుబాట దర లేకనో లేక ప్రబుభుత్వాల వైఫల్యమో లక్షలాది రైతులు రోడ్డున పడి ఆందోళనలు చెయ్యటం నిత్య కృత్యం అయ్యాయి. రైతే రాజు అని చెప్పుకునే ఈ ప్రభుత్వాలు ఏ ఒక్క హామీ పరిపూర్ణంగా అమలు చేయక విసుగుచెంది లెక్కలో లేని రైతు ఆత్మాహత్యలెన్నో, గత ఏడాది అధిక వర్షాలు ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా రైతులు తాము పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్మలేక పండిన పంట సకాలం లో చేతికి రాక అవస్థలెన్నో పడ్డారు , కోవిడ్‌ ‌కారణంగా ప్రభుత్వం కూడా కనీస మద్దతు ధర ఇచ్చి తన వాటాను కొనుగోలు చేయలేకపోయింది. వ్యవసాయం అనేది రాజ్యాంగం ప్రకారం అది రాష్ట్రాల హక్కు కానీ కేంద్ర ప్రభుత్వం చెబుతున్న వ్యవసాయ చట్టాల్లో విప్లవాత్మక మార్పులు అని ఏ గ్రామాములో పండించిన రైతైనా తాను పండించిన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని వన్‌ ‌కంట్రీ వన్‌ ‌మార్కెట్‌ అనే నినాదాన్ని తీసుకొచ్చింది ఈ విధానం స్వాగతించ దగిందే అయినప్పటికీ ఏ రైతు ఆదిలాబాద్‌ ‌లో పండించిన పంటను అలహాబాద్‌ ‌వెళ్లి అమ్ముకోలేడు. దీనివల్ల దలారీ వ్యవస్తకు రహదారులు తెరిచి నట్లే, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిదానాన్ని దేశమంతా ఒకే మాదిరిలో అమలు పరచాలని నిర్ణయించింది ,దక్షణాది రాష్ట్రాలు ఇది కాషాయ విద్య అని వ్యతిరేకిస్తున్న అది అమలు జరిగిపోతానే ఉంది ,విద్యార్తి అవకాశాలని బట్టి ఎక్కడికైనా వెళ్లి చదువుకొనే ఆస్కారముంది కానీ రైతు ఆలా కాదే ,కొన్ని చట్టాలు అన్నింటికీ ఒకే మాదిరిలా ఆపాదించడం సరి అయింది కాదు అని రాష్ట్రాల వాదన.

నేడు దేశవ్యాప్తంగా రైతులు చీణ• ప్రభుతం తీసుకువచ్చిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు ‘‘జై జవాన్‌ ‌జై కిసాన్‌’’ అనే నినాదం కేవలం నినాదం గా మిగిలి పోవటం బాధాకరం .కొత్త చట్టాలను మేము తీవ్రమైన మేధోమథనం తర్వాతే తీసుకువచ్చామని పాలకులు చెబుతున్న వాటి వాల్ల మాకు నష్టం ప్రభు అని మొత్తుకున్నా పట్టించుకునే నాధుడు లేడు .. ప్రతిపకాలు మేము ఉన్నాం ,దేశ వ్యాప్తం గా ప్రజలు అండగా ఉంటారు అని చెబుతున్నా ఏలికలు బలంగా ఉండటం వారు తీసున్నా నిర్ణయం శాసనం కావటం రైతులకు శాపం గా మారింది, మరోపక్క ‘రైతులకు వ్యతిరేకంగా ఉండే కొందరు కావాలనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలపై వదంతులు సృష్టిస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని ప్రతిపక్షాలను మోదీ పరోక్షంగా దుయ్యబట్టారు.

మోడీ ప్రభుత్వం ఊపిరి ‘అదాని -అంబానీ’ల చేతుల్లో ఉందని, వాళ్లకోసమే దేశం మొత్తాన్ని తాకట్టు పెట్టడానికి సహితం వెనుకాడబోరని, వాళ్ళ ఆస్తులను పెంచేందుకే మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని అందుకే అర్థం చేసుకున్న పంజాబీ రైతులు ముందు తిరగబడింది రాజ్యం మీద కాదు ‘అంబానీ – అదాని’ మీద అని అంతే కాకుండా మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ ‌కంపెనీలకు లాభం చేకూర్చే మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన వెంటనే అక్టోబర్‌ 1‌వ తేదీనుండి పంజాబ్‌ ‌రైతు సంఘాలు ఎన్నుకున్న మార్గం కార్పోరేట్‌ ‌హౌస్‌లను ‘బహిష్కరణ’ చేయాలని. వామపక్షాల డిమాండ్‌. అం‌దుకే కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చిన తర్వాత రైతుల్లో ఆందోళనలు పెరిగాయని.మరోవైపు గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధిని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వకపోవడం కూడా రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ఇదివరకు ఈ నిధి నుంచి ఏటా మూడు శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఇచ్చేది. కానీ, ఈ ఏడాది అందుకు నిరాకరించింది.

ధరలు నిర్ణయించేది ఎవరు?
ఎంఎస్‌పీకి కొనుగోళ్లను కొనసాగిస్తామని ప్రభుత్వం చట్టంలో పెట్టినా, దాని అమలు సాధ్యపడుతుందో, లేదోనని సిరాజ్‌ ‌హుస్సేన్‌ ‌సందేహం వ్యక్తం చేశారు.‘ఒక ‘న్యాయమైన సగటు నాణ్యత’ ఆధారంగా ఎంఎస్‌పీ నిర్ణయిస్తారు. పంట నిర్ణీత నాణ్యత ప్రమాణాలను చేరుకుంటేనే ఎంఎస్‌పీ లభిస్తుంది. ప్రమాణాలను చేరుకోలేని పంటల మాటేమిటి?’’ అని ఆయన ప్రశ్నించారు.ప్రభుత్వ కొనుగోళ్లు తగ్గే అవకాశం వరి ధాన్యం, గోధుమలను కొనుగోలు చేయడాన్ని ప్రభుత్వం తగ్గించాలని చాలా కమిటీలు సిఫార్సు చేశాయని సిరాజ్‌ ‌హుస్సేన్‌ ‌తెలిపారు.శాంతా కుమార్‌ ‌కమిటీ నుంచి నీతి ఆయోగ్‌ ‌వరకు ప్రభుత్వానికి ఇలాంటి నివేదికలు ఇచ్చాయి.ప్రభుత్వం కూడా ఈ సూచనలకు అనుగుణంగా పనిచేస్తోంది. అందుకే రాబోయే రోజుల్లో ప్రభుత్వం పంటల కొనుగోళ్లను తగ్గించవచ్చని రైతులు భయపడుతున్నారు.

ప్రైవేటు సంస్థలు ఎంఎస్‌పీకి కొంటాయా?
భవిష్యతులో ప్రభుత్వం కొనుగోళ్లు తగ్గిస్తే, రైతులు ప్రైవేటు సంస్థలకు పంటలు అమ్ముకోవాల్సి వస్తుందని చండీగఢ్‌లోని సెంటర్‌ ‌ఫర్‌ ‌రీసెర్చ్ ఇన్‌ ‌రూరల్‌ అం‌డ్‌ ఇం‌డస్ట్రియల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌ప్రొఫెసర్‌ ఆర్‌ఎస్‌ ‌ఘుమన్‌ అన్నారు. ‘ఎంఎస్‌పీ కన్నా తక్కువకు పంటలను ప్రైవేటు సంస్థలు కొనుగోలు చేయాలనుకుంటాయి. లేకపోతే అవి కూడా ఉత్పత్తుల ధరలను పెంచాల్సి వస్తుంది. అందుకే, ఎంఎస్‌పీకే పంటలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు షరతులు పెట్టాలనుకోవడం లేదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.కార్పొరేట్ల నుంచి ఎంఎస్‌పీ షరతు పెట్టకూడదన్న ఒత్తిడి కూడా ప్రభుత్వంపై ఉందని సిరాజ్‌ ‌హుస్సేన్‌ అం‌టున్నారు.రైతుల ఇబ్బందులు పెరగవచ్చు ఏదైనా ఉత్పత్తిని అమ్మే వ్యక్తి ఒకరే ఉంటే, దాన్ని ‘మోనోపలీ’ అంటారు. ఆ అమ్మే వ్యక్తి ఆ ఉత్పత్తిని తనకు ఇష్టమైన ధరకు అమ్మవచ్చు.అదే సమయంలో ఒక ఉత్పత్తిని కొనే వ్యక్తి ఒక్కరే ఉంటే, దాన్ని ‘మోనోప్లాస్నీ’ అంటారు. కొనే వ్యక్తి కూడా తనకు ఇష్టమైన ధరకు ఆ ఉత్పత్తిని కొనుగోలు చేయొచ్చు.కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాల వల్ల రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలో ‘మోనోప్లాస్నీ’ వస్తుందని ఆర్‌ఎస్‌ ‌ఘుమన్‌ అం‌టున్నారు.

ప్రైవేటు సంస్థలు కలిసి ఒక జట్టుగా ఏర్పడి పంటల ధరలను శాసించే పరిస్థితి రావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.ఎంఎస్‌పీని చట్టంలో చేర్చితే, ప్రైవేటు సంస్థల గుత్తాధిపత్యాన్ని నివారించవచ్చు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు సంస్థలు పంటల కొనుగోళ్లు ఎక్కువగా చేయకపోవచ్చు.ఓవైపు స్వయంగా పంట కొనుగోళ్లను ప్రభుత్వమే తగ్గిస్తూ, మరోవైపు ఎంఎస్‌పీకే పూర్తిగా పంటలన్నీ కొనుగోళ్లు చేయాలని ప్రైవేటు సంస్థలకు చెప్పే పరిస్థితి లేదు.ఈ నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు పెరగవచ్చు.ప్రభుత్వం తప్పుకోవాలనుకుంటోంది’ పంటల ధరలు మరీ పడకుండా ఎంఎస్‌పీ ఓ రకమైన రక్షణ కల్పిస్తుంది.ప్రైవేటు సంస్థలు డిమాండ్‌, ‌సరఫరా ప్రకారం ధరలు నిర్ణయిస్తాయి.ఈ వ్యవహారం మొత్తం రెండు పక్షాల (రైతులు, ప్రైవేటు సంస్థలు) మధ్యే ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని, తృతీయ పక్షంగా తాము ఉండాలని అనుకోవడం లేదని ఘుమన్‌ అభిప్రాయపడ్డారు.

పరిష్కారం ఏంటి?

భారత్‌లో 85 శాతం చిన్న, సన్నకారు రైతులేనని అంచనాలు ఉన్నాయి. వీరి వద్ద ఉన్నవి ఐదు ఎకరాల కన్నా తక్కువ కమతాలే.కొత్త చట్టాల్లో ఎంఎస్‌పీని చేర్చినా ఫలితం ఉండదని, ఆ చట్టాలను పూర్తిగా ఉపసంహరించుకోవడమే పరిష్కారం అని ఆర్‌ఎస్‌ ‌ఘుమన్‌ అన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇందుకు సిద్ధంగా లేదు.అయితే, ‘కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి’ లాంటి ఏర్పాటుతో రైతులకు ప్రభుత్వం నేరుగా ఆర్థిక చేయూతను అందించవచ్చని సిరాజ్‌ ‌హుస్సేన్‌ అభిప్రాయపడ్డారు.ఒక చిన్న, సన్నకారు రైతు నిజంగా తన పంటను వేరే రాష్ట్రానికి వెళ్లి అమ్ముకుంటాడా? పక్క జిల్లాలోని మార్కెట్‌ ‌యార్డులోనే అమ్ముకోవడానికి ట్రాక్టర్లు, లారీలకు బాడుగలు ఇచ్చుకోలేక నలిగిపోతున్నాడు. తీరా అక్కడికి వెళ్ళాక సరైన ధర లేక కొన్నిసార్లు అక్కడే పడేసి వస్తున్నాడు. కాబట్టి ఇది రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి చేసిన చట్టం కాదు. దలారీలు, కార్పొరేట్‌ ‌కంపెనీలు దేశంలో మరియు ప్రపంచంలో ఎక్కడ డిమాండ్‌ ఉం‌టే అక్కడ అమ్ముకోవడానికి ఈ చట్టం ఇది అని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం పాస్‌ ‌చేసిన 3 బిల్లులు పైకి రైతుల మంచికోసమే అని అనిపించినా వాటి పర్యవసానాలు భవిష్యత్తులో దారుణంగా ఉండబోతున్నాయి. అందుకే పంజాబ్‌, ‌హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలే కాకుండా దేశంలోని చాలా రైతుసంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి.

నిజంగా రైతుల మంచి కోసమే అయితే ప్రభుత్వం ఈ బిల్లులతో పాటు ఇంకొన్ని మార్పులు చేసి ఉంటే రైతులు నమ్మేవారు ఆందోళనకారుల ఢిమాండ్‌
1. ‌కాంట్రాక్ట్ ‌ఫార్మింగ్‌ ‌చేసే కంపెనీ, వీ• స్వామినాథన్‌ ‌చెప్పినట్టు, రైతు పెట్టుబడికి 50% అదనంగా సొమ్మును కలిపి మద్దతు ధారగా చెల్లించాలి.
2. రైతు ఉత్పత్తులు కొన్న కంపెనీ ఫారిన్‌ ‌కి ఎక్స్పోర్ట్ ‌చేయడానికి వీలు కల్పించకూడదు. లేదా భారతదేశంలో ఖచ్చితంగా 70% సేల్‌ ‌చేయాలి అని నిబంధన తేవాలి.
3. కాంట్రాక్ట్ ‌ఫార్మింగ్‌ ‌కేవలం సేంద్రీయ ఎరువులు లేదా జీరో బడ్జెట్‌ ‌నాచురల్‌ ‌ఫార్మింగ్‌ ‌ద్వారానే చేయాలి. రసాయనాలు వాడడం బ్యాన్‌ ‌చేయాలి. లేదంటే కార్పొరేట్లు పిప్పి పీల్చేసిన భూమి రైతులకు దేనికీ పనికిరాదు.
4. ప్రభుత్వమే రైతు ఉత్పత్తులు కొని మార్కెటింగ్‌ ‌చేసుకోవాలి. మార్కెట్‌ ‌కమిటీలు, యార్డులపై శ్రద్ధ పెట్టాలి.
5. ప్రతి గ్రామంలో శీతల గిడ్డంగులు, గోదాముల కట్టించాలి. ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌యూనిట్లు పెంచాలి.

ఇప్పుడిక ప్రత్యకంగా ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు ఢిల్లీ వీధుల్లోకి వచ్చారు.మనం చేయాల్సిందంతా వాళ్లకు మద్దతు ఇవ్వడమే ప్రభుత్వం తో రైతుసంఘాల చర్చలు విఫలమయ్యాయి. ఈ పోరాటాన్ని అందరికి అర్థం అయ్యేలా చేయడమే.. అందరి మద్దతును కూడగట్టడం.కాబట్టి రైతులు, ప్రజలు కలసి కట్టుగా పోరాటం చేస్తే తప్ప పాలకులు దిగిరారు.
‘‘జై జవాన్‌ ‌జై కిసాన్‌’’.
‌డాక్టర్‌ ‌సామల్ల కృష్ణ, ఫ్ఫ్రీలాన్స్ ‌జర్నలిస్ట్
9705890045

Leave a Reply