Take a fresh look at your lifestyle.

‌స్త్రీలను గౌరవిద్దాం…

నేను ఒక మనిషిగా నా తోటి మనిషి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నా దురదృష్టం ఏమిటంటే ఆ మనిషి ఒక స్త్రీ అయ్యింది. స్త్రీకి నేడు సమాజంలో ఉన్న ప్రాముఖ్యత గురించ చెప్పదలచుకున్నాను. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి గురించి మాట్లాడితే భారతీయ సంస్కృతి చాలా గొప్పది.మహోన్నతమైనదని మేధావులు చరిత్రకారులు మొదలుకొని ఉపాధ్యాయుని వరకు భారతీయ సంస్కృతిని ప్రశంసిస్తారు. కానీ వాళ్లు గొప్పది అనుకుంటున్న ఈ భారతీయ సంస్కృతిలో మహోన్నతమైనది అని చెబుతున్న ఈ దేశంలో నేటికీ స్త్రీలకి స్వాతంత్య్రం లభించడం లేదు. భయపడకుండా, తోడు లేకుండా బయటికి వచ్చే పరిస్థితి లేదు నేటి సమాజంలో. దీన్నిబట్టి స్త్రీలకి ఇచ్చే విలువ మనకు తెలుస్తున్నది. మన శరీరంలో ఒక కన్ను పొడి చేసుకుని మరో కన్ను బాగుగా ఉంటే నీకు సంపూర్ణ దృష్టి ఉన్నట్లు కాదు. అదేవిధంగా వేల సంవత్సరాల నాగరికత ఉన్నటువంటి భారతదేశంలో స్త్రీలకు గౌరవం లేదు.

అలాంటిది ఎలా గొప్ప నాగరికత అవుతుంది. దయచేసి చరిత్రకారులు మౌనం వహించండి. మీకు తెలిసిన ఒకటో రెండో కులాల పేర్లు చెప్పి ఆ కాలంలో స్త్రీలు గౌరవించబడ్డారు. గొప్ప ఉన్నతి పొందారు అని చెప్పవద్దు. ఎందుకంటే ఒక రోజులో ఒక గంట బాగా నవ్వి మిగతా సమయమంతా ఏడుస్తూ గడిపితే అది ఇది మంచి రోజు అవ్వదు ఒక్క విషయం గమనించాలి. స్త్రీని భారతీయులు మనిషిగా గుర్తించిన కాలం ఎక్కడ లేదు. అది సింధు నాగరికత మొదలుకొని భారతీయ చరిత్రలో ఇస్లాం రాజ్యం గా పేరుపొందిన మొగలాయిల కాలంలో గాని స్వాతంత్య్ర దేశం అని చెప్పుకుంటున్న 21వ శతాబ్దంలో గాని లేదు. ఉంటే అది ఏ విధంగా ఉందో ఆలోచించాలి. చదువుల తల్లి సరస్వతి భూ భారం మోసేది భూమాత ఈ సృష్టికి మూలం ఒక స్త్రీ. ఎంతో గొప్పది అయిన సహనం అనే గుణాన్ని ఒక స్త్రీతో పోలుస్తారు.

- Advertisement -

మనం తినే అన్నం అన్నపూర్ణ త్రాగే నీరు గంగా మనకు దెబ్బ తగిలితే అరిచే మొదట అరుపు అమ్మ అని ఇలా అన్ని విధాల స్త్రీలే ఆధిపత్యం వహించిన ఈ దేశంలో స్త్రీలకు సరైన స్థానం ఎందుకు ఇవ్వరు. స్త్రీని ఎందుకు తక్కువగా చూస్తారు…ఎందుకు స్త్రీలను నిజంగా భావిస్తారు. వారు చేసిన ద్రోహం ఏమిటి. పసి బాలికల మీద అత్యాచారాలు ఉద్యోగం చేస్తున్న స్త్రీల మీద లైంగిక వేధింపులు అత్తమామల గృహహింసలు భర్తల చిత్రహింసలు లోకుల యొక్క సూటిపోటి మాటలు నిరంతరం వారిని పట్టిపీడిస్తున్నాయి. ఆడపిల్లల్ని కడుపులోనే కరిగించడం చెత్త కుండీల్లో పారేయడం గొంతు నుమిలి చంపేయడం. ఇది మన నేటి భారతీయం…. ఇది గొప్ప సంస్కృతి కిందికి వస్తుందా! భారతీయ సంస్కృతి గొప్పదే తండ్రి చేతిలో అత్యాచారానికి గురైన ఆడపిల్లలు తల్లే వ్యభిచారానికి ప్రోత్సహించడం ఈ భారతీయ సంస్కృతిలో మనమందరం జీవిస్తున్న ఈ సమాజంలో జరిగాయి. జరుగుతున్నాయి. స్త్రీలపై అత్యాచారాలు ఇలాగే కొనసాగితే జాతి మనుగడకే ప్రమాదం. రండి స్త్రీలను గౌరవించడం మన జాతిని కాపాడుకుందాం.

– నరేష్‌ ‌జాటోత్‌. ఎం ఏ. ‌బీఈడీ.కాకతీయ విశ్వవిద్యాలయం(8247887267)

Leave a Reply