Take a fresh look at your lifestyle.

నేతాజీ ని స్మరించుకుందాం..

భారతదేశ స్వతంత్ర పోరాటంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నేతాజీ సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌గారి యొక్క జయంతి సందర్భంగా ఒకసారి తను స్మరించుకుందాం. ఎందరో మంది త్యాగఫలం మన భారతదేశ స్వాతంత్రం ఒక వైవిధ్యభరితంగా తన యొక్క చాకచక్యంగా భారత దేశ స్వాతంత్రం కోసం తన పోరాటాన్ని నిర్వహించారు. నేతాజీ సుభాష్‌ ‌చంద్రబోస్‌ (‌జనవరి 23, 1897 ) భారత స్వాతంత్య్ర సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్‌ ‌మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.

నేతాజీ సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌గురించి వివరాలు తెలుసుకుంటే….
బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్య్ర సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్‌ ఇం‌డియా ఫార్వార్డ్ ‌బ్లాక్‌ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయుల పై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్‌ ‌హింద్‌ ‌ప్రభుత్వాన్ని సింగపూర్‌ ‌లో ఏర్పరచాడు.

బోసు రాజకీయ అభిప్రాయాలు, జర్మనీ, జపానుతో అతని మిత్రత్వం పై చరిత్రకారుల్లో న్నాభిప్రాయాలున్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే, మరి కొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారు. అతని జీవితం లాగే మరణం కూడా వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18 లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరిణించాడని ప్రకటించినప్పటికి, అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు.

బోస్‌ ‌నిర్వహించిన కీలక కార్యక్రమాలు…
బ్రిటిష్‌ ‌వారు తమ యుద్ధ సమస్యలు తీరినాక దేశానికి స్వతంత్రం ఇస్తారని గాంధీ, నెహ్రూ వంటి నాయకులు భావించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో తల మునకలుగా ఉన్న బ్రిటిష్‌ ‌వారి పరిస్థితిని అవకాశంగా తీసుకొని త్వరగా స్వతంత్రాన్ని సంపాదించాలని బోస్‌ ‌బలంగా వాదించాడు. బోస్‌ ఆలోచనలపై ఇటాలియన్‌ ‌రాజనీతిజ్ఞులు గారిబాల్డీ (%+ఱబవజూజూవ +•తీఱ•శ్రీ•ఱ%) , మాజినీ ప్రభావం ఉంది. స్వతంత్రం వచ్చిన తరువాత భారతదేశం ముస్తఫా కమాల్‌ ‌పాషా అతాతుర్క్ (%‌ఖవఎ•శ్రీ •••్షతీ•%) నాయకత్వంలోని టర్కీ దేశం లాగా కనీసం రెండు దశాబ్దాల కాలం సోషలిస్టు నియంతృత్వ పాలనలో ఉండాలని కూడా బోస్‌ అభిప్రాయం. ఈ సమయంలో బోస్‌ అనేక మంది బ్రిటిష్‌ ‌లేబర్‌ ‌పార్టీ నాయకులను కలుసుకొన్నాడు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న కన్సర్వేటివ్‌ ‌పార్టీ నాయకులెవరూ బోస్‌తో సమావాశానికి అంగీకరించలేదు. తరువాత కాలంలో అట్లీ నాయకత్వంలోని లేబర్‌ ‌పార్టీ ప్రభుత్వం కాలంలోనే భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందన్నది గమనించవలసిన విషయం.

Leave a Reply