ప్రజలకు సిఎం కెసిఆర్ పిలుపు
ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణను మించిన సంపద లేదన్నారు. ప్రస్తుత కరోనా సమయంలో ఈ విషయం రుజువైంది. స్వచ్ఛమైన ప్రాణ వాయువు దొరక్క పరితపిస్తున్న దుర్భర పరిస్థితి ఏర్పడింది.
ఆరోగ్య సంపదను మించిన సంపద లేదు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. నాసిరకం ప్లాస్టిక్ వాడకం వి•ద నియంత్రణ విధించాం. గ్రీన్ కవర్ పెంచే హరితహారం వంటి పలు పథకాలు అమలు చేస్తున్నాం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.