Take a fresh look at your lifestyle.

మనమే ‘లాక్‌ ‌డౌన్‌’ అవుదాం ..!

దేశ వ్యాప్తంగా కొరొనా వైరస్‌ ‌వ్యాప్తి కారణంగా సరిగ్గా సంవత్సరం కింద దేశ వ్యాప్తంగా లాక్‌ ‌డౌన్‌ ‌విధించడం జరిగింది..అంచలంచెలుగ విధించిన లాక్‌ ‌డౌన్‌ ‌ను ఆంక్షలతో ఉపసంహరించుకునె ప్రయత్నం చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు…కానీ కొన్ని రోజులుగా మళ్లీ పెరుగుతున్న పాజిటివ్‌ ‌కేసులు అటు పాలకులను…ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి..మళ్లీ లాక్‌ ‌డౌన్‌ ‌విధిస్తారని సామాజిక మాధ్య మాల్లో విస్తృత ప్రచారం జరుగుతున్నది.తెలంగాణా వ్యాప్తంగా ముఖ్యంగా విద్యాసంస్థల్లో వైరస్‌ ‌విస్తరిస్తున్నది.ప్రతి రోజు కొరోనా బాధిత విద్యార్థులు ,ఉపాధ్యాయుల సంఖ్యా పెరుగుతున్నది. ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. మంగళ వారం అసెంబ్లీ సమావేశాల్లో విద్య శాఖా మంత్రి సబితా రెడ్డి బుధవారం నుండి అన్ని బోధనా సంస్థలు ..వైద్య విద్యాలయాలు మినహాయించి ..తాత్కాలింగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆన్‌ ‌లైన్‌ ‌తరగతులు కొనసాగించాలని సూచించారు.

దశల వారీగా లాక్‌ ‌డౌన్‌ ఆం‌క్షలు సడలిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 5 నెలల క్రితం 6వ తరగతి నుంచి భౌతిక తరగతులకు అనుమతివ్వడం వివాదాస్పదమైంది. పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించకుండా భౌతిక తరగతులు ప్రారంభించడంలో పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి నివారణకు పరిసరాల్లో పరిశుభ్రత అతి ప్రధానమైంది. సాధారణ సమయాల్లోనే పాఠశాలల్లో మరుగుదొడ్లు,మూత్రశాలల పరిశుభ్రంగా ఉంచడంలో తగిన సిబ్బంది లేక సాధ్యం కానీ పరిస్థితి ..కొరోనా కాలంలో తెరిచినా పాఠశాలల్లో ఒక విద్యార్థి మూత్ర విసర్జన చేసిన తరువాత ..20 నిమిషాలకు మరో విద్యార్థికి అనుమతించాలని కోవిద్‌ ‌నిబంధనలు చెబుతున్నాయి. టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచడానికి కావలసిన కనీస సిబ్బంది,యంత్రాంగం ను ప్రభుత్వం కల్పించలేక పోతున్నదని ఉపాధ్యాయ సంఘాలు పలు సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం ,విద్యాధికారులు మాత్రం కోవిద్‌ ‌నిబంధనలు 100 శాతం అమలు చేస్తున్నామని ప్రకటించుకున్నాయి.

ఆ ప్రకటనలో డొల్లతనం మరో సారి బయట పడింది. 6 వ తరగతి నుంచి బడులు ప్రారంభించడంలో కూడా రాజకీయ కోణం లేక పోలేదు. లాక్‌ ‌డౌన్‌ ‌కారణంగా ప్రైవేట్‌ ‌పాఠశాలలు మూసివేయడం ..అందులో పనిచేస్తున్న వేలాది మంది ఉపాధి కోల్పోవడం జరిగింది. ఉపాధ్యాయ వృత్తి నే ఎంచుకుని తమ కుటుంబాలను పోషించు కుంటున్న వారి బతుకు దుర్లభమయింది. వారి నుంచి పాలకులు వ్యతిరేకతను ఎదుర్కోవలసి వొచ్చింది. అదే సమయంలో పట్టభద్రుల నియోజక వర్గాల ఎన్నికలు నిర్వహించవలసి రావడం తో ప్రైవేట్‌ ‌పాఠశాలల్లో ఉపాధి కోల్పోయిన వారి ఆగ్రహాన్నీ చల్లార్చడానికి బడుల ప్రారంభానికి ప్రభుత్వం అనుమతించిందన్న విమర్శ ఉంది.తగ్గుముఖం పట్టిన కొరోనా వైరస్‌ ‌కేవలం విద్యాసంస్థల ప్రారంభం వల్లనే విస్తరించిందనడం అసమంజసం.ఈ మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో జరిగిన ప్రచార సరళి కోవిద్‌ ‌కాలంలో పార్టీల బాధ్యతారాహిత్యాని తెలుపుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టభద్రుల నియోజక వర్గ ఎన్నికల కోసం అభ్యర్థుల ప్రచార సరళి మన కళ్ళ ముందున్నది..భారీ వాహన శ్రేణిలో నామినేషన్‌ ‌దాఖలు ..బహిరంగ సమావేశాలు ..ఫంక్షన్‌ ‌హాల్స్ ‌లో విందులు వినోదాలు ..

ప్రలోభాలు ..తీవ్ర అభ్యంతరకరమయినవి.. .కొరోనా కాలంలో పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేయడం తో వైరస్‌ ‌విస్తరణ ఆగిపోదు…సామూహిక సమావేశాలను తక్షణమే నియంత్రించాలి ..రాబోయే రోజుల్లో ృలీ ,శ్రీరామ నవమి పండుగలకు బహిరంగ ప్రదేశాల్లో అనుమతి నిరాకరించాలి..లేని పక్షంలో ఈ రోజు విద్యాసంస్థలు మూసేసిన ప్రభుత్వం లాక్‌ ‌డౌన్‌ ‌దిశగా ఆలోచించే ప్రమాదమున్నది ..ప్రభుత్వాలు మనలని లాక్‌ ‌డౌన్‌ ‌చేసే ముందే ,,మనమే లాక్‌ ‌డౌన్‌ ‌కావడం ఉత్తమం ..ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ ..మాస్క్ ‌ధరించడం ,,చేతులను తరచు శానిటైజ్‌ ‌చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.. . ముందు మన ఆరోగ్యం,మన ప్రాణం ముఖ్యం.ఈ రెండు బాగుంటే భవిష్యత్తులో అనేకం అనుభవించొచ్చు.ఇది ప్రజలందరూ గమనించాల్సిన సందర్భం ..

గత యేడాది సరిగ్గా ఇదే నెలలో ప్రారంభమైన కొరోనా మహమ్మారి కరాళ నృత్యం ఇంకా మన మనసుల నుంచి చెరిగిపోలేదు. భారత శాస్త్రవేత్తల అకుంఠిత దీక్షతో కొరోనా వైరస్‌కు విరుగుడు కనుగొన్నామనే సంతోషం ఇంకా తీరకుండానే మరోమారు కొరోనా రక్కసి కోరలు చాస్తున్నది. ఈ పరిస్థితుల్లో వైరస్‌ ‌నుంచి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు మన ద్వారా ఇంకొకరికి విస్తరించకుండా ఉండాలంటే విధిగా మాస్కు ధరించడం, తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, బహిరంగ ప్రదేశాలకు వెళ్లకపోవడం, భౌతిక దూరం పాటించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన మార్గదర్శకాలను విధిగా పాటించడమే కొరోనా బారి నుంచి మనం బయటపడటానికి మన ముందున్న ఏకైక పరిష్కారం. కొరోనా నియంత్రణకు ప్రభుత్వాలు విధించే నిబంధనలను ప్రతీ పౌరుడూ కచ్చితంగా పాటిస్తే కొరోనా మహమ్మారిని జయించడం పెద్ద కష్టమేమీ కాబోదు.

Leave a Reply