Take a fresh look at your lifestyle.

కొరోనా కట్టడికోసం కలిసి నడుద్దాం..

కరోనా వైరస్‌ ‌కట్టడి కోసం ప్రతి ఒక్కరం కలిసి నడుద్దామని, ప్రతి ఒక్కరం సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి సామాజిక భాద్యతగా మెలుగుదామని పెద్దపల్లి డీసీపీ రవిందర్‌ అన్నారు.  ఈ మేరకు మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రం రంగంపల్లి డీసీపీ కార్యాలయం వద్ద స్పీడ్‌ ‌గన్‌లతో వాహనాల వేగ పరీక్ష నిర్వహించిన సంధర్భంగా ఆయన మాట్లాడారు. రామగుండం పోలీస్‌ ‌కమీషనర్‌ ‌సత్యనారాయణ ఆదేశాల మేరకు కోవిడ్‌ ‌వైరస్‌ ‌నియంత్రణలో భాగంగా కొంతమేర నిబంధనలు సడలించినప్పటికి..అందరు సామాజిక దూరం, తప్పనిసరిగా మాస్క్ ‌ధరించాలి అన్నారు. వాహనాదారులు ట్రాఫిక్‌ ‌రూల్స్ ‌విధిగా పాటించాలని సూచించారు.

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్‌ ‌ధరించి తమ వాహనాలను నడపాలని, సీట్‌ ‌బెల్ట్ ‌ధరించాలని, అధిక స్పీడ్‌ ‌వెళ్ళే వారికి ఆన్లైన్లో జరిమానాలు విధించడం జరుగుతుందని వివరించారు. అధిక లోడుతో వెళ్లే లారీలు, టిప్పర్లు  స్పీడ్‌ ‌లిమిట్‌ ‌లో వెళ్ళాలన్నారు. లేనిచో అట్టి వాహనాలను హెవీ వెహికల్స్ ‌స్పీడ్‌ ‌గన్ను ద్వారా జరిమానాలు విధించడంతో పాటు వాహనాలు సీజ్‌ ‌చేయడం కూడా జరుగుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్క  వాహనదారులు ఎవరైనా రాంగ్‌ ‌రూట్లో వెళ్లినా, సెల్ఫోన్‌ ‌మాట్లాడుకుంటూ వెళ్లినా, వాహనాలకు సంబందించిన  సరైన పత్రాలు లేకున్నా జరిమానాలు తప్పవని హెచ్చరించారు. రామగుండం ట్రాఫిక్‌ ఏసీపీ రాంరెడ్డి, పెద్దపల్లి ట్రాఫిక్‌ ‌సిఐ కోట బాబురావు, ట్రాఫిక్‌ ‌సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply