Take a fresh look at your lifestyle.

ఇక తాడో పేడో

  • ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో తేల్చుకుంటాం
  • ఉద్యమంలో పాల్గొన్న రైతులపై కేసులు ఎత్తివేసి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలి
  • తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రతీ కుటుంబానికి రూ.3 లక్షలు అందజేస్తాం
  • తెలంగాణ ఏపీ మధ్య కృష్ణా గోదావరి నదీ జ లాల వాటాను వెంటనే తేల్చాలి
  • ఈ సీజన్‌లో పండించిన చివరి గింజనూ ప్రభుత్వమే కొంటుంది
  • బీసీ గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను కేంద్రం వెంటనే తేల్చాలి
  • కొత్త విద్యుత్‌ ‌చట్టాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి
  • ప్రతీ ఏటా తెలంగాణలో ఎంత ధాన్యం కొంటారో స్పష్టంగా చెప్పాలి.. సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ప్రతినిధి: తెలంగాణలో యాసంగిలో పండించే వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతీ ఏటా ఎంత ధాన్యాన్ని కొంటారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో ధర్నా చేసినప్పటికీ కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేదనీ, చివరి ప్రయత్నంగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని, అవసరమైతే ప్రధాన మంత్రిని సైతం కలుస్తామనీ, రాష్ట్రంలోని ఏ ఒక్క రైతునూ అన్యాయానికి గురి కానివ్వబోమని తేల్చి చెప్పారు. శనివారం ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడారు.

అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల రద్దుపై రైతులు కేంద్రం మెడలు వంచి అద్భుత విజయం సాధించారని వ్యాఖ్యానించారు. నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించిన ప్రధాని మోదీ రైతులకు క్షమాపణ కూడా చెప్పారనీ, ఉద్యమంలో అమరులైన 750 మంది రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సాయం ఇవ్వడంతో పాటు రైతులపై నమోదు చేసిన దేశద్రోహం కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఉద్యమంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలకు సంఘీభావంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల చొప్పున త్వరలోనే ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అమరులైన రైతుల వివరాలు ఇవ్వాలని రైతు సంఘటన్‌ ‌నేతలను అడిగినట్లు తెలిపారు. మంత్రులతో పాటు తాను కూడా స్వయంగా వెళ్లి ఆర్థియ సాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ‌వెల్లడించారు. అలాగే, వచ్చే పార్లమెంటు సమావేశాలలో కనీస మద్దతు ధరకు సంబంధించిన చట్టాన్ని ప్రవేశపెట్టాలనీ, దీనికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విద్యుత్‌ ‌చట్టం త్వరలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనుందనీ, టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. విద్యుత్‌ ‌మోటార్లకు మీటర్లను బిగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మెడపై కత్తి పెట్టి వొత్తిడి తీసుకొస్తున్నదనీ, దీనిపై రైతులు చాలా అందోళనతో ఉన్నారని చెప్పారు. అవసరమైతే బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఈ చట్టాన్ని అమలు చేయండి కానీ, ఉచిత విద్యుత్‌ ఇచ్చే రాష్ట్రాలపై వొత్తిడి తీసుకురావడం మానుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు పూర్తయినప్పటికీ తెలంగాణ ఏపీ మధ్య ఉన్న కృష్ణా, గోదావరీ జలాల పంపిణీ వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించలేదని విమర్శించారు.

దీనిపై సుప్రీం కోర్టులో ఉన్న పిటిషన్‌ను కేంద్రం సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుందనీ, తెలంగాణకు కృష్ణా, గోదావరి జలాల నీటి పంపిణీ విషయాన్ని ట్రిబ్యునల్‌కు అప్పగించడంలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు.ఈ విషయంపై కేసీఆర్‌ ఏమైనా అడ్డుపడుతున్నాడా లేక కేంద్ర మంత్రి కాళ్లు ఎవరైనా కట్టేశారా అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో వానా కాలంలో పండే ప్రతీ గింజనూ ప్రభుత్వమే కొంటుందనీ, దీనిపై రైతులు ఎలాంటి ఆందోళన చేయాల్సిన అవసరం లేదని దీని కోసం ఇప్పటికే 6600 ధాన్యం కొను స్పష్టం చేశారు. అలాగే, బీసీ గణన, ఎస్సీ వర్గీకరణ, అంశాలపై కేంద్రం తాత్సారం చేస్తున్నదనీ, విమర్శించారు. ధాన్యం కొనుగోలు అంశంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఇకనైనా పిచ్చి కూతలు మానాలనీ, బీజేపీ నేతలు చేసే చిల్లర ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు నమ్మొద్దని సీఎం కేసీఆర్‌ ‌రైతులకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply