Take a fresh look at your lifestyle.

నిరక్షరాస్యతను నిర్మూలిద్దాం…

అక్షరానికి, పుస్తకానికీ, మస్తకానికీ విలువ ఎవరు తగ్గించలేరు. అందుకే అంటారు ‘‘అక్షరం ఆయుధం కన్నా గొప్పదని’’. బాధలన్నింటికీ మూలం ‘‘అజ్ఞానం’’ మన పాలకులు తమకు తాము స్వయంగా అక్షరాస్యత మీద శ్రద్దపెట్టి సంపూర్ణ అక్షరాస్యతను సాదిస్తే విశ్వమానవాళి సకల బాధలను నివారించగలరు. అభివృద్ధికి, ఆత్మవిశ్వాసానికి అక్షరాస్యతే శరణ్యం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల పాలకులు ప్రజల్లోని నిరక్షరాస్యతను సమాజం నుండి తొలగించలేకపోవుచున్నారు. మాతృభాషకూడారాని వయోజనులు ఒకవైపు, మరోవైపు పేదరికంతో అక్షరాస్యతకు దూరమౌతున్న వారిమూలంగా అక్షరాస్యతను పెంచలేకపోవుచున్నాము. ఈ నిరక్షరాస్యత జాఢ్యాన్ని సమాజం నుండి తరిమివేయడానికి 1965 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలోని యునెస్కో (ఖచీజు•••) సభ్యదేశాల ప్రతిపాధనలతో ‘‘8-సెప్టెంబర్‌, 1966’’ ‌నుండి ‘‘అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని’’ ప్రతి ఏడాది ప్రపంచదేశాలు జరుపుచున్నారు. ఈ రోజున ప్రపంచ దేశాల పాలకులు అక్షరాస్యత ప్రాముఖ్యతను తెలియజేయడం, అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి వయోజనులకు మరియు విద్యవ్యాప్తి కోసం అంచనాలు వేస్తారు. భవిష్యత్‌ ‌ప్రణాళికలు ఏర్పరచుకొని అమలుకు పూనుకుంటారు. ప్రపంచంలో కొన్ని దేశాలు అన్ని రంగాల్లో వెనకబడి ఉండటానికి నిరక్షరాస్యత ముఖ్య కారణం. అందువలన ఆయాదేశాల్లో పిల్లలకు, వ్యక్తులకు, సంఘాలకు, వయోజనులకు విద్యమీద దృష్టికేంద్రీకరించేలా చేయడం జరుగుతుంది. ప్రపంచం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించుటకు, ఉన్నతమైన జీవనానికి, విద్య, విజ్ఞానం, సాంస్కృతిక, నాగరికత వికాసానికి విద్య ఎంతో అవసరం. ఐక్యరాజ్య సమితిలోని ప్రధాన అంగమైన విద్యా, విజ్ఞాన (శాస్త్రీయ) మరియు సాంస్కృతిక సంస్థ (యునెస్కో) శాంతి, రక్షణలతోపాటు అంతర్జాతీయ సహకారంతో విద్య, విజ్ఞానం,సాంస్కృతిక పరిరక్షన కోసం పాటుపడుతుంది.

భారతదేశం ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చితే ! అక్షరాస్యతలో ఆగాధంలో ఉంది. నిరక్షరాస్యత నిర్మూలనకు నిత్యం ఎన్నో చర్యలు, పథకాలు, ఏకరువుపెడుతున్నా ధనం వృదా అవుతుంది. ఆచరణ క్షేత్రస్థాయిలో పూర్తిగా వైఫల్యం కనిపిస్తుంది. నిరక్షరాస్యతను మనదేశంలో నిర్మూలించలేని జబ్బులా దాపురించుకొని పీడిస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అక్షరాస్యత నెమ్మదిగా పెరిగినప్పటికీ, 2011 నుండి 2021 వరకు వచ్చే సరికి పెరుగుదల రేటు తగ్గిపోయింది. అందులో ఈ రెండు సంవత్స రాలుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసినప్పటికీ, దీని ప్రభావం మనదేశంలో విద్యావ్యవస్థపై పడి అక్షరాస్యత శాతం చాలా తగ్గే అవకాశం ఉందనిపిస్తుంది. సమాజం చదువుల మాటెత్తకుండా బతకుజీవుడా అని కాలం వెల్లదీశారు.

అక్షరాస్యత అంటే ‘‘యునెస్కో సూచనల ప్రకారం’’ అచ్చువేసిన, రాయబడిన సమాచారాన్ని గుర్తించగలిగి, అర్థం చేసుకోగలిగి, సాంకేతికంగా కంప్యూటరీకరణ సామర్థ్యం కలిగి ఉండడాన్ని ‘‘అక్షరాస్యతగా’’ భావిస్తుంది. కానీ మనదేశం ప్రపంచ నిరక్షరాస్యతల్లో సగం మంది మనదేశంలో ఉండటం విచారకరం. ఇలాగే అయితే దేశంలో స్థిర అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుంది? రాజకీయా(నాయకు)ల్లో అక్షరాస్యత స్థాయి లోపించడం, అలాగే అక్షరాస్యతలు రాజకీయాల్లో కుల, మతం, ప్రాంతీయ, స్వార్థాల (చోరబడి)తో విలువలు పతనానికి దారి తీస్తున్నాయి. ప్రపంచ సగటు అక్షరాస్యత (86.3%) కన్నా భారతదేశ సగటు అక్షరాస్యత (81 శాతం) చాలా తక్కువగా ఉంది. మనకాన్న చిన్నదేశాలైన, మన పొరుగు దేశాలు మయన్మార్‌ (93.7 ‌శాతం), శ్రీలంక (92.6 శాతం), చైనా (96.4 శాతం) గణాంకాలతో ముందున్నాయి. మనదేశంలో అత్యదిక అక్షరాస్యత కేరళలో 96.2 శాతం ఉంది. అత్యల్పంగా 66.4 శాతం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. మొన్నటివరకు వెనకబడిన బీహార్‌ ‌కూడా నేడు 70.9 శాతం అక్షరాస్యతతో మనకన్నా ముందుంది. ప్రపంచంలో ప్రజాస్వామ్య పథంలో ప్రవేశిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతున్నాయి కానీ పాలనాధికారం మాత్రం కొద్ధి మంది (కుటుంబాల)కే పరిమిత మౌతుంది. ఓ వైపు ఆటవిక దశనుండి నాగరికత వైపు నడు స్తూనే… అణిచివేత, నియం తృత్వాలు కూలిపోతున్నట్లే కనిపి ంచినా నిరంకుశ దోరణులు పెరిగిపోతున్నాయి.

అక్షరాస్యతతో సమాచార విప్లవం సహకారమైనా సాంకేతిక విజ్ఞానం పెడదారి పట్టి సామాజిక సంబంధాలు విశ్చిన్న మౌతు న్నాయి. మానవజాతి నిరక్షరా స్యత అనే చీకట్లను తరిమి వేసేకాంతి రేఖగా విద్య (అక్షరాస్యత)ను పెంచటం వలననే సమాజంలో విలువలకు సంజీవనీ మూలికలాంటిది విద్యాశక్తి మాత్రమే. దాని కోసం కావాల్సినంత చిత్తశుద్ధి, సంక ల్పబలం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత పాలకుల్లోనే ఉంది. అందుకే ప్రభుత్వాలు ప్రజల్లో అక్షరాస్యత వ్యాప్తికి, సంస్కారంతో కూడిన సమాజ నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించాలి. సరిహద్ధుల్లో సైనిక ధళాలకు, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి పెట్టే ధనం కన్నా ! జాతి అన్ని రంగాల్లో బలపడేలా శీల సంపద, సచ్చీలురైనా పౌరులే జాతికి బలం. నిజమైన శక్తి ధనంలో లేదు. సంపూర్ణ అక్షరాస్యత సమాజ నిర్మాణంలోనే ఉంది. పాలకులు నేడు దృష్టి పెట్టాల్సింది పేదరికం, ఆకలి మీద మాత్రమే కాదు ! అంతకన్నా ప్రమాదకరమైన అవిద్య మీద, ప్రతియేటా అక్షరాస్యతను పెంచుకుంటూ ఆరోగ్యవంతమైన నవజాతి నిర్మాణంలో సవ్యదిశగా ప్రపంచ(దేశ)ం సాగిపోవడం ఖాయం. ఇందుకు వ్యక్తుల నుండి వ్యవస్థలు, దేశాలు, సమిష్టి బాధ్యతతో కదలాల్సి ఉంది. నేటి పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రేపటి తరం ముందు దోషులుగా నిలబడుతారనేది ముమ్మాటికి కాదనలేని నిజం సుమా..
– మేకిరి దామోదర్‌, ‌వరంగల్‌
9573666650

Leave a Reply