Take a fresh look at your lifestyle.

నేరడి బ్యారేజ్‌ ‌నిర్మాణం కోసం చర్చిద్దాం

ఒడిషా సిఎం పట్నాయక్‌కు జగన్‌ ‌లేఖ
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ ‌పట్నాయక్‌కు ఏపీ సీఎం వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి శనివారం లేఖ రాశారు. వంశధార నదిపై నేరడి బ్యారేజ్‌ ‌నిర్మాణంలో ఒడిశా ప్రభుత్వం సహకారం కోరుతూ ముఖ్యమంత్రి ఈ లేఖ రాశారు. నేరడి బ్యారేజీ నిర్మాణ విషయంలో ఒడిశాతో సంప్రదింపులకు తాము సిద్ధమని లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి చర్చించేందుకు ఒడిశా సీఎం నవీన్‌ ‌పట్నాయక్‌ ‌సహాయం కోరారు. నేరడి బ్యారేజ్‌ ‌నిర్మాణంతో ఒడిశా రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు. దీనివల్ల ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రైతులకు, ఒడిశాలోని గజపతి జిల్లా రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని లేఖలో తెలిపారు. సముద్రంలోకి వృథాగా పోయే 80 టీఎమ్‌సీల నీటిని నేరడి బ్యారేజ్‌ ‌నిర్మాణం ద్వారా వినియోగంలోకి తీసుకురావచ్చన్నారు.నేరడి బ్యారేజ్‌ ‌నిర్మాణంతో శ్రీకాకుళం, ఒడిశాలోని గజపతి జిల్లాకు మేలన్నారు. ఇప్పటికే 80 టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తుందని లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply