- వరద సాయం రు . 25 వేలు! అని ఒక జాతీయ పార్టీ చెబితే,
- మరొక జాతీయ పార్టీ ఏకంగా రు .50 వేలు! ఇస్తానని ప్రకటన ..
- ఎలా ఇస్తారు ? ఎలా ఇవ్వగలరు ?
- ఇరు పార్టీలు వివరించలేదు మరీ
- ఇవ్వగలిగే అవకాశాలేమిటి?
- ఆ అవకాశం అసలు ఉంటుందా?
ఓ నగర పాలక సంస్థకు ఉండే పరిమితులు తెలియనంత అమాయకంగా హైద్రాబాదీ ఈ పార్టీలకు కనిపిస్తున్నాడా? శతకోటి దరిద్రాలకు ఆనంతకోటి ఉపాయలన్నట్లుగా సరైన తీర్పే ఇవ్వగల విజ్ఞత,వివేకం, పరిణతి కలిగిన హైద్రాబాదీ వోటరు ఆచరణ సాధ్యం కాని హామీలు,గాలి మాటలకు సరైన,ధీటైన జవాబే ఇవ్వగలడని గతంలో ఎన్నో మార్లు రుజువు చేసాడు.
ఇపుడు కూడా తన విజ్ఞతను నిలుపుకోవాలని ఆశిద్దాం..
-ఓ సాధారణ వోటరు