Take a fresh look at your lifestyle.

ముడిబియ్యం ఎంతయినా కొంటాం
ఒప్పందం మేరకు ధాన్యం సేకరణ
ధాన్యమంటే ముడిబియ్యమే..వడ్లు కాదు
బాయిల్డ్ ‌రైస్‌ ఇవ్వబోమని తెలంగాణ హా ఇచ్చింది
పంజాబ్‌ ‌తరహాలోనే బియ్యం సేకరణ
ధాన్యం సేకరణపై కేంద్ర విధానం స్పష్టంగా ఉంది
రాజ్యసభలో సభ్యుల ప్రశ్నలకు కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌సమాధానం

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 1 : ‌ధాన్యం అంటే ముడి బియ్యం అని, వడ్లు కాదని, ముడి బియ్యం ఎంతైనా కొంటామని కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ అన్నారు. ధాన్యం సేకరణపై కేంద్ర విధానం స్పష్టంగా ఉందని మరోమారు •ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ధాన్యం సేకరణపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా బాయిల్డ్ ‌రైస్‌పై మరోసారి తన విధానాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. బాయిల్డ్ ‌రైస్‌ను సేకరించమని, వీటిని అవసరమనుకున్న రాష్ట్రాలు అవే తయారు చేసుకోవాలన్నరు. కేంద్రం కేవలం ప్రజలు ఉపయోగించే బియ్యం మాత్రమే సేకరిస్తుందని అన్నారు.

ఈ క్రమంలో రాష్ట్రాల నుంచి బాయిల్డ్ ‌రైస్‌ ‌సేకరించేది లేదని పీయూష్‌ ‌గోయల్‌ ‌స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు లిఖిత పూర్వకహాలు ఇచ్చాయన్నారు. ఇందులో తెలంగాణ కూడా ఉందన్నారు. అవసరాల రీత్యా రాష్ట్రాలే బాయిల్డ్ ‌రైస్‌ ‌సేకరించాలని సలహా ఇచ్చారు.. కేంద్రం మాత్రం సేకరించేది లేదని తేల్చేశారు..బాయిల్డ్ ‌రైస్‌ ‌సేకరించ బోమని గత ఖరీఫ్‌లోనే స్పష్టంగా చెప్పామని ఈ సందర్భంగా గుర్తుచేసిన మంత్రి ..ధాన్యం అంటే బియ్యమనే విషయంలో అనుమానలు అక్కర్లేదన్నారు. పదేపదే తెలంగాణ నుంచి వడ్లు అన్న డిమాండ్‌ ‌రావడంపై కేంద్రమంత్రి అసహనం వ్యక్తం చేశారు. ముడిబియ్యం ఎంతయినా కొంటామని చెప్పినా.. ధాన్యం కొనడం లేదన్న ప్రచారం తగదన్నారు. తెలంగాణ ప్రభుత్వం పారా బాయిల్డ్ ఇవ్వమని రాతపూర్వకంగా ఇచ్చిందని, ఎంవోయూ ప్రకారమే ముడి బియ్యం ఇస్తామని రాసిచ్చారని పీయూష్‌ ‌గోయల్‌ ‌తెలిపారు.  ఇప్పుడు కొత్తగా వడ్ల సేకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని, ధాన్యం సేకరణ అంశానికి సంబంధించి సీఎం ద్వారా ద్కలు ఇస్తున్నారని తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. పంజాబ్‌ ‌తరహాలో కొనాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌లేఖ రాశారని, పంజాబ్‌లో పండే బియ్యాన్ని దేశమంతటా తింటారని ఈ సందర్భంగా పీయూష్‌ ‌గోయల్‌ ‌స్పష్టం చేశారు. మరి అటువంటి బియ్యాన్ని ఇవ్వాలని కోరామని పీయూష్‌ ‌గోయల్‌ అన్నారు. రైతులను తప్పుదోవ పట్టించేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన ధ్వజమెత్తారు.

 

Leave a Reply