Take a fresh look at your lifestyle.

మట్టి గణపతులనే పూజిద్దాం

  • ప్రతిమలను పంపిణీ చేసిన సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌, ‌మంత్రులు
  • వసూలయిన చందాలో కొంత గ్రామాభివృద్ధికి వినియోగిస్తే మేలన్న సిఎస్‌
  • ‌రాష్ట్రంలో సంవత్సరం పొడవునా ఆజాదీ కా అమృతోత్సవ్‌ ‌కార్యక్రమాలు

పర్యావరణ హితం కోరి మట్టి గణపతులతో వినాయకచవితి నిర్వహించాలని పర్యావరణవేత్తలు ప్రజలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం తరఫున సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌, ‌మంత్రులు మట్టి విగ్రహాల పంపిణీని ప్రారంభించారు. రంగులు విషతుల్య రసాయన పదార్థాలతో ఏర్పాటు చేసిన మట్టి ప్రతిమలు వాడి కోరి ప్రమాదాలు తెచ్చుకోవద్దన్నారు. ప్రజల ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటానని రంగుల ప్రతిమలతో అనారోగ్యం బారినపడవద్దని ప్రజలకు సూచించారు. వినాయక చవితిని ఎంతగా ఆనందంగా జరుపుకుంటామో అంతే ఉత్సాహంగా పర్యావరణానికి మేలు చేద్దామన్న ప్రతినతో సాగాలని పిలుపునిచ్చారు. ఉత్సవ కమిటీలు పండుగకు వసూలుచేసే నగదులో కొంతైనా గ్రామాభివృద్ధికి వినియోగిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. స్వచ్ఛ భారత్‌, ‌స్వచ్ఛ ఆంధప్రదేశ్‌ ‌లక్ష్యాలకు అనుగుణంగా పర్యావరణహిత చవితిని రాష్ట్ర ప్రజలందరూ జరుపుకోవాలన్నారు.

మట్టి ప్రతిమలు తయారుచేసి ఉచితంగా పంపిణీచేసే వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం ఉంటే మంచిదన్నారు. ఈ చవితి ప్రజల ఆలోచనా ధోరణిలో ఆశాజనకమైన మార్పును చూపించాలని తాను కోరుకుంటున్నట్లు సభాపతి చెప్పారు. రసాయన పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలతో గాలి, నీరు, నేల సమస్తం కాలుష్యం బారినపడుతున్నాయన్నారు. క్యాన్సర్‌, ‌కిడ్నీలు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు పెరిగేందుకు రంగుల విగ్రహాలే కారణమన్నారు. తాను చవితి పండుగకు వ్యతిరేకం కాదని పర్యావరణ హితంగా జరుపుకుంటేనే పండుగ సమాజానికి బాగుంటుందని చెప్పారు. రసాయన పదార్థాలతో తయారుచేసిన విగ్రహాల్ని నీళ్ళల్లో నిమజ్జనంచేస్తే అందులో విషంచేరి నీటిలోని జీవరాశులు అంతరిస్తున్నాయన్నారు.

రాష్ట్రంలో సంవత్సరం పొడవునా ఆజాదీ కా అమృతోత్సవ్‌ ‌కార్యక్రమాలు
ఆజాదీ కా అమృతోత్సవ్‌ను పురస్కరించుకొని ఈ నెల నుండి సంవత్సరం పాటు రాష్ట్రంలో పలు సాంస్కృతిక, చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. ఆజాదీ కా అమృతోత్సవ్‌ ‌కార్యక్రమాల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో బిఆర్‌కెఆర్‌ ‌భవన్‌ ‌నుండి సిఎస్‌తోపాటు, రాష్ట్ర ప్రభుత్వ విద్యా శాఖ కార్యదర్శి సందీప్‌ ‌సుల్తానియా, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌మాట్లాడుతూ..దేశ స్వాతంత్ర 75వ సంవత్సరం సందర్బంగా స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని ప్రజల్లో అవగాహన కలిగించడానికే రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 75 ప్రాంతాల నుండి ఒక్కొక్క బృందం 75 కిలోమీటర్లు సాగే విధంగా సైకిల్‌ ‌ర్యాలీలను నిర్వహించనున్నట్టు తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్రోద్యమంపై స్టేట్‌ ఆర్ట్ ‌గ్యాలరీలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నామని అన్నారు. తెలంగాణలో జరిగే అతిపెద్ద పండగైన బతుకమ్మ పండగను కూడా 75 ఏళ్ల స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని కలిగించేదిగా నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో పటిష్టంగా ఉన్న సాంస్కృతిక సారధి బృందాలతో రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నామని వివరించారు. ఐ.టి.రంగం, తెలుగు సినిమా పరిశ్రమలతో కలిపి కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ద్వారా పలు సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తామని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ‌లో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కూడా పాల్గొన్నారు.

Leave a Reply