Take a fresh look at your lifestyle.

నేడు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం

భూమిని కాలుష్యం నుండి కాపాడుదాం

విశ్వంలో మానవ జాతి లాంటి జీవులను కలిగి ఉన్న గ్రహం ఒక భూమి మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా 175 కంటే ఎక్కువ దేశాల్లో ఏప్రిల్‌ 22‌న ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అనాలోచిత మానవ చర్యల వల్ల కలుగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని నిలువరించి భూమిని కాపాడడమే దీని లక్ష్యం. 1969వ సంవత్సరంలో అమెరికా రాష్ట్రం కాలిఫోర్నియాలోని శాంటా బార్బరలో చమురు విస్ఫోటనం వల్ల జరిగిన విపరీతమైన నష్టాన్ని చూసిన తరువాత అమెరికా పార్లమెంట్‌ ‌సభ్యుడు గేలార్డ్ ‌నెల్సన్‌ ఏ‌ప్రిల్‌ 22‌వ తేదీని ధరిత్రి దినోత్సవంగా ప్రకటించారు. తొలి ధరిత్రి దినోత్సవం ‘యునైటెడ్‌ ‌స్టేట్స్ ఎన్విరాన్‌ ‌మెంటల్‌ ‌ప్రొటెక్షన్‌ ‌సంస్థ’’ ఆవిర్భవానికీ, పరిశుభ్రమైన నీరు, పరిశుభ్రమైన గాలి, అంతరించిపోతున్న జాతుల పరిరక్షణ చట్టాల రూపకల్పనకు దారి తీసింది. ఈ సంవత్సరం 50వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము.

ఇప్పుడు మనం ఉంటున్న భూమిపైన కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వం ఏ ప్రాణి ఉండేది కాదు. భూమి కాలక్రమేనా మార్పులు చెంది ఇప్పటి రూపం పొందటానికి సుమారు 460 కోట్ల సంవత్సరాలు పట్టి ఉంటుందని శాస్త్రజ్ఞుల అంచనా. సూర్య కుటుంబంలోని గ్రహాల్లో ఇప్పటికి తెలిసినంత వరకు ప్రాణులకు అవసరమైన గాలి, నీరు, అనుకూల శీతోష్ణస్థితి ఉండేది ఒక్క భూమి మీదే. భూమి తనచుట్టూ తాను తిరగడమే కాకుండా సూర్యుని చుట్టూ కూడా తిరుగుతున్నది. భూమి తన చుట్టూ తాను పడమర నుండి తూర్పు వైపుకు గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో, ఒకసారి తిరగడానికి 23 గంటల, 56 నిమిషాల, 4.09 సెకండ్ల కాలం(ఒక రోజు) పడుతుంది. భూమి సూర్యుని చుట్టూ గంటకు ఒక 1,07,160 కిలోమీటర్ల వేగంతో ఒకసారి చుట్టి రావడానికి 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 45 సెకన్ల కాలం(ఒక సంవత్సరం) పడుతుంది. భూమి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జియాలజీ అంటారు. భూమి యొక్క విస్తీర్ణంలో 70.8 శాతం సముద్రాలే ఆవరించి ఉండడం వల్ల భూ భాగం కంటే జలభాగం అధికం. మొత్తం భూమిపైన గల జల భాగంలో 97శాతం సముద్ర జలాలు, 2.25 శాతం మంచు గడ్డలు గాను, 0.63 శాతం భూగర్భంలోని నీరు గాను, 0.001 శాతం వాయు మండలంలోని నీటి ఆవిరి రూపంలో, ఇంకా మిగిలిన భాగం ఇతర జల రూపంలో ఉన్నది.

- Advertisement -

భూమి తన లోపలి అత్యుష్ణమును వెలువరించుటచే భూకంపాలు కలగడం, అగ్ని పర్వతాలు బద్ధలు కావడం, వంటి కారణాల వల్ల భూమి బీటలు వారడం, కొన్ని పర్వతాలు నేలమట్టం అవ్వడం, కొత్తగా పర్వతాలు ఏర్పడటం, సముద్రంలో మునిగి పోవడం, సముద్రాల నుండి బయటకు రావడం, ఇలా ఎన్నో మార్పులు కలుగుచున్నది. ఇలా మార్పులకు కారణమైన భూమి లోపలి వేడి చల్లబడటానికి కొన్ని కోట్ల సంవత్సరాల పాటు మార్పులు కటుగుతాయొ. విశ్వంలో మనలాంటి జీవాలు గల ఇతర గ్రహం మరేదైనా ఉందా అని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, నేలకాలుష్యం పర్యావరణ కాలుష్యం మానవ జాతిని, ప్రకృతిని నాశనం చేస్తాయి. అభివృద్థి పేరుతో పర్యావరణానికి ఎన్నో విధాలుగా నష్టపరుస్తున్నాము. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా మనిషి చేస్తున్న పనుల వల్ల భూగోళం చాలా వేడెక్కిపోతోంది. శిలాజ ఇంధనాలను ఎక్కువగా వాడడం వలన గాలి కాలుష్యం ఎక్కువ అవుతుంది. పట్టణాలు, నగరాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో పర్యావరణ కాలుష్యం పెరిగిపోతోంది. ఓజోన్‌ ‌పొర దెబ్బ తింటోంది. రసాయనాలు వ్యవసాయంలో విచ్చలవిడిగా వాడడం వలన భూమి నిస్సారంగా తయారవుతుంది. తరిగిపోయే వనరులకు బదులు, తరగని, పునర్వినియోగించుకోగల వనరుల కొరకు అన్వేషించాలి. అడువుల సంరక్షణ, మొక్కల పెంపకం, సుస్థిర యాజమాన్య పద్ధతులు, జీవవైవిధ్య సంరక్షణ, ఇదే మానవాళికి సుస్థిర భవిష్యత్తును చేకూరుస్తుంది. నానాటికి కాలుష్యకోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న భూగోళాన్ని సంరక్షించుకోవాలి. అలాగే ప్రకృతి వనరులను కొల్లగొట్టే రాజకీయాలు, ఆక్రమణలు, అక్రమాలు. హద్దూ అదుపూ లేని విధంగా జరుగుతున్నాయి. వీటిని అరికట్టాలి. అప్పుడే భూమి పైన మానవజాతి మనుగడ లేదంటే ప్రకృతి విపత్తులు సంభవించి జీవులు నశించే ప్రమాదం ఉంది.

nerupati aanandh

Leave a Reply