Take a fresh look at your lifestyle.

భయం కాదు, జనానికి భరోసా ఇద్దాం

పజలను ఉపాధి లేకుండా చేయడం సరైన పద్దతి కాదు. భారత్‌ ‌మావో చైనా కాదు. వలస కార్మికులు వేలాది మంది తమ స్వస్థలాలకు చేరుకోవడానికి ఎన్నో అవస్థలు పడుతున్నారు. భవిష్యత్‌లో అందరూ మరణించేవారే. కానీ, ఉన్నంత కాలం మంచి భవిష్యత్‌ను కోరుకుని జీవనం సాగిద్దాం. నిరాశా వాదం మనల్ని నిర్వీర్యుల్ని చేస్తుంది. రేపు మంచి జరగవచ్చని ఆశిద్దాం. కేన్సర్‌, ‌టీబీ వంటి భయంకరమైన రోగాలను  జయించే యత్నాల్లో ఉన్నాం, కొరోనా కూడా ఏదో ఒకరోజున లొంగక మానదు. ప్రజలను భయపెట్టవద్దు. భవిష్యత్‌పై వారి ఆశలపై నీళ్ళు పోయవద్దు. రేపు ఎప్పుడూ వస్తుందన్న ఆశ జనంలో కలిగిద్దాం.”

మనలో చాలా మంది వివేకం లేని అంచనాలు వేస్తుంటారు. కోవిడ్‌-19 ‌లక్షలాది మందిని బలిగొంటుందని ప్రజలను భయపెట్టే నేపథ్యాలు కూడా ఉండవచ్చు. గతంలో ఇలాంటి విపత్తులు ఎన్నెన్ని దుష్పరిణామాలను తెచ్చాయో గుర్తు చేస్తుంటారు. అయితే, మన భవిష్యత్‌ను ఏదీ ప్రభావితం చేయలేదని కూడా అంటూంటారు. పస్తుత కొరోనా సీజన్‌లో మనం అందరూ ఆమోదించిన రెండు అభిప్రాయాలను ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకుంటాం. సుప్రసిద్ధ ఆర్థిక వేత్త జాన్‌ ‌మోనార్డ్ అన్న మాటలను మాజీ ప్రధాని మన్మోహన్‌ ‌సింగ్‌ ‌పెద్ద కరెన్సీ రద్దు సందర్భంగా పార్లమెంటులో చేసిన ప్రసంగంలో గుర్తు చేశారు. భవిష్యత్‌లో మనమంతా పోతామని, అంటే నిరాశతో చేసినది కాదు ఆ ప్రకటన. ఇలాంటి చర్యలు మానవజాతి మనుగడకే ప్రమాదమని చెప్పడం ఆయన ఉద్దేశ్యం. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆశావాదం క్రమంగా తగ్గిపోతోందన్నది ఆయన అభిప్రాయం కావచ్చు కొరోనా గురించి మనం పెద్దగా అంచనాలు వేయకపోయినా, ప్రమాదాన్ని సిగట్టలేకపోయినా జరిగేది ఇంతే. కొరోనా దేశాలను దాటి విస్తరిస్తోంది. దానికి పాస్‌ ‌పోర్టులు, వీసాలు అవసరం లేదు. దానికి మనుషులంతా ఒకటే. ఉదాహరణకు ప్రిన్స్ ‌చార్లెస్‌, ‌బ్రిటిష్‌ ‌ప్రధాని బోరిస్‌ ‌జాన్సన్, సోఫీ ట్రూడవూ, టామ్‌ ‌హ్యాంక్స్, అం‌తర్జాతీయ ఖ్యాతి పొందిన చెఫ్‌ ‌ప్లోయెడ్‌ ‌కార్డోజ్‌.. ఇలా ఒకరేమిటి చిన్నా, పెద్దా తెడా లేకుండా, ఈ దేశం, ఆ దేశమని లేకుండా అందరికీ ఈ వైరస్‌ ‌సోకింది.

వివిధ దేశాల్లో 50 నుంచి 80 శాతం మందికి ఈ వైరస్‌ ‌సోకవచ్చని అంటునవ్యాధుల నిపుణులు పేర్కొన్నారు. దీనిని నివారించేందుకు వ్యాక్సిన్‌ను కనుగొనే వరకూ ఈ వైరస్‌ను నిరోధించడం కష్టం. అయితే, ఎవరెవరికి ఏయే దేశంలో ఎంత మందికి సోకింది అనే శాతాలు పట్టించుకోదగినవి కావు. కొరోనా అనేది మరో ఫ్లూ. గతంలో వచ్చిన ఫ్లూలకు భిన్నమైనది కావచ్చు, అంతకంటే భయంకరమైనది కావచ్చు. కానీ, దానిని గురించి తక్కువ అంచనా వేయడం కానీ, ఎక్కువగా భయపెట్టడం కానీ తగదు. ఇలాంటి భయంకర వ్యాధులు సంభవించినప్పుడు రేపు చూస్తామో లేదో, భవిషఖ్యత్‌ ఎలా ఉంటుందోనన్న ప్రశ్నలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తాయి. గతంలో ఇలాంటి వైరస్‌లు వ్యాపించాయి. అప్పటి వారు వాటిని ఎదుర్కొని జీవించలేదా. ప్రజలకు పాలకులు ధైర్యాన్ని ఇవ్వాల్సిన మాట నిజమే కానీ, నిర్లిప్తత పనికి రాదు. ఇప్పుడు అందరూ అంటువ్యాధుల స్పెషలిస్టులు, నిపుణులు అయిపోతున్నారు. లక్షలాది మంది మరణిస్తారనీ, జూలైనాటికి ఐదు లక్షల మంది చనిపోవచ్చని అంచనా వేస్తున్నారు. వారి అంచనాలను ఎవరూ ఆమోదించలేరు. ఎవరి భవిష్యత్‌ ‌వారిది, అందరి భవిష్యత్‌ను మనం ముందే అంచనా వేసి చెప్పగలమా? అసలు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే కాదు. ఎన్నో యుద్ధాలు, ఉద్యమాలను చూశాం. సస్య విప్లవానికి ముందు అమెరికా నుంచి దిగుమతి అయిన గోధుమలు ఎంత ఇబ్బంది పెట్టేవో, ఎంపీల కోటా నుంచి గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌కోసం జనం ఎన్ని అవస్థలు పడ్డామో మా తరం వారికి తెలుసు. అయితే, నేను మాత్రం ఎంపీగారి కోటాలో సిలిండర్‌ ‌సంపాదించలేదు. అప్పటికే ఆయన కోటాలో వచ్చిన సిలిండర్ల పంపిణీ జరిగిపోయింది. 20 డాలర్ల కోటా కోసం ఎన్నో ఫారాలను భర్తీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు విదేశాల్లో భారతీయులు 250 వేల డాలర్లు సాధారణ బ్యాంకింగ్‌ ‌చానల్స్ ‌ద్వారా స్వేచ్ఛగా పంపవచ్చు. ఇప్పుడు అలాంటి ఆంక్షలేవీ లేవు.

అంటు రోగాల గురించి మాట్లాడుకుందాం. మా తల్లితండ్రులు ప్లేగ్‌ ‌వ్యాధి వ్యాప్తిని చూశారు. మా తరం వచ్చేసరికి దానిని మన దేశం జయించింది. మసూచి, ఆటలమ్మ వంటి రోగాలకు వ్యాక్సినేషన్లు వచ్చాయి. తుంటి మీద, చేతుల మీద టీకాలు వేసేవారు. ఆ పీడ 1980లో తొలగిపోయింది. ఇప్పుడు ఆ రోగాల గురించి ఎవరికీ తెలియదు. గవద బిళ్ళలు వంటివి కూడా ఇప్పుడు ఎవరికీ రావడం లేదు. చిన్న పట్టణాల్లో ఎంబీబీఎస్‌ ‌డాక్టర్లే ఉంటారు. వారు మీకొచ్చిన రోగం ఏమిటో కనుగొంటారు. మీ జ్వరాలు, ఏమిటో తెలుసుకుంటారు. కాళ్ళు విరిగితే శస్త్ర చికిత్సలు చేస్తారు. ఇలాంటి రోగాలను మన వాళ్ళు గతంలో జయించారు. అలాగే, కొరోనాను కూడా ఎదుర్కోవచ్చు. ప్రజలను ఉపాధి లేకుండా చేయడం సరైన పద్దతి కాదు. భారత్‌ ‌మావో చైనా కాదు. వలస కార్మికులు వేలాది మంది తమ స్వస్థలాలకు చేరుకోవడానికి ఎన్నో అవస్థలు పడుతున్నారు. భవిష్యత్‌లో అందరూ మరణించేవారే. కానీ, ఉన్నంత కాలం మంచి భవిష్యత్‌ను కోరుకుని జీవనం సాగిద్దాం. నిరాశా వాదం మనల్ని నిర్వీర్యుల్ని చేస్తుంది. రేపు మంచి జరగవచ్చని ఆశిద్దాం. కేన్సర్‌, ‌టీబీ వంటి భయంకరమైన రోగాలను జయించే యత్నాల్లో ఉన్నాం, కొరోనా కూడా ఏదో ఒకరోజున లొంగక మానదు. ప్రజలను భయపెట్టవద్దు. భవిష్యత్‌పై వారి ఆశలపై నీళ్ళు పోయవద్దు. రేపు ఎప్పుడూ వస్తుందన్న ఆశ జనంలో కలిగిద్దాం.

– శేఖర్‌ ‌గుప్త
‘ద ప్రింట్‌’ ‌సౌజన్యంతో

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!