Take a fresh look at your lifestyle.

కామారెడ్డి మాస్టర్‌ ‌ప్లాన్‌పై అపోహలు వీడండి

అపోహలతో ఆందోళనలకు దిగడం సరికాదు
ప్రస్తుతం ఇది ముసాయిదా మాత్రమే
రైతుల భూములు ఎక్కడికీ పోవు
అభ్యంతరాలను నమోదు చేసుకుంటాం
డియా ముందు వివరణ ఇచ్చిన కలెక్టర్‌ ‌జితేశ్వి పాటిల్‌

కామారెడ్డి,ప్రజాతంత్ర,జనవరి7: కామారెడ్డి నూతన మాస్టర్‌ ‌ప్లాన్‌పై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అది కేవలం ముసాయిదా మాత్రమేనని జిల్లా కలెక్టర్‌ ‌జితేష్‌ ‌వి పాటిల్‌  ‌వివరణ ఇచ్చారు. దీనిపై రైతులు అనవసర అపోహలకు గురవుతున్నారని అన్నారు.  శనివరాం కలెక్టర్‌ ‌డియాతో మాట్లాడుతూ.. అపోహలు నమ్మి ఆందోళన చెందుతున్నారని… అందరి అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఎవరి భూములూ నష్టపోరని స్పష్టం చేశారు. ఏదైనా ఇబ్బందులు, అభ్యంతరాలు ఇస్తే రికార్డు చేస్తామని… అందరికీ సమాధానాలు ఇస్తామని చెప్పారు. ఇది ముసాయిదా మాత్రమే అని… ఫైనల్‌ ‌చేయడానికి ఇంకా సమయం ఉందని తెలిపారు. 2000లో పాత మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌తయారైందని… అప్పుడు కూడా ఇలాంటి జోన్లు పెట్టారని…వాటిలోని భూములను ఎవరూ డిస్టర్బ్ ‌చేయలేదని గుర్తుచేశారు. ఇప్పుడు ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. నూతన మాస్టర్‌ ‌ప్లాన్‌పై ఇప్పటి వరకు 1026 అభ్యంతరాలు వచ్చాయని.. అన్నీ పరిశీలిస్తామని తెలిపారు. జనాల అభిప్రాయాలపై చర్చ ఉంటుందని… తర్వాత పై స్థాయిలో ఫైనల్‌ అవుతుందన్నారు. ఇండస్టియ్రల్‌ ‌జోన్‌ ‌కింద మార్క్ అయి ఉంటుందని తెలిపారు. భూమికి, భూ యజమానులకు ఎలాంటి నష్టం ఉండదని తేల్చిచెప్పారు. ఈనెల 11 వరకు అభ్యంతరాలు ఇవ్వచ్చని కలెక్టర్‌ ‌జితేష్‌ ‌వి పాటిల్‌ ‌తెలిపారు.
నిబంధనల ప్రకారమే కొత్త మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌రూపొందించాం అని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పలు విషయాలను ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఇచ్చింది ముసాయిదా మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌మాత్రమే అని స్పష్టం చేశారు. ముసాయిదాలో మార్పులు, చేర్పులు జరుగుతాయన్నారు. రైతుల అభ్యర్థనలను నమోదు చేసుకుంటామని తెలిపారు. రైతుల అభ్యర్థనలను అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఎవరైనా సరే సూచనలు ఇవ్వొచ్చని ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. 60 రోజుల్లో సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని ప్లెక్సీలు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు 1026 అభ్యంతరాలు వచ్చాయి. రైతులకు ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. జనవరి 11న సాయంత్రం 5 గంటల వరకు అభిప్రాయాలు చెప్పొచ్చు అని కామారెడ్డి కలెక్టర్‌ ‌తెలిపారు. భూములు పోతాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భూములు పోతాయని ఎందుకు అపోహ పడుతున్నారో తెలియడం లేదన్నారు. భూములు పోతాయన్నది తప్పుడు సమాచారమే అని స్పష్టం చేశారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. పట్టణం ఎలా విస్తరిస్తుందో.. దాని ప్రకారమే మాస్టర్‌ ‌ప్లాన్‌ ఉం‌టుంది. ముసాయిదా ఫైనల్‌ ‌కావాడానికి చాలా దశలు ఉన్నాయి. ఇది ఇంకా మొదటి దశలోనే ఉంది. రైతుల భూములు ఎక్కడికి పోవు.  భూమి  పేరు దనే ఉంటుందన్నారు. మా దృష్టికి వస్తున్న అభ్యర్థనలను పరిశీలించి, నివృత్తి చేస్తున్నామని తెలిపారు. ఇండస్టీయ్రల్‌ ‌జోన్‌ అం‌టే భూముల సేకరణ కాదు అని కలెక్టర్‌ ‌జితేశ్‌ ‌పాటిల్‌ ‌స్పష్టం చేశారు.
కామారెడ్డిలో ఇంకా చల్లారని ఉద్రిక్తతలు
ఇండస్టియ్రల్‌ ‌జోన్‌కు భూములు ఇవ్వమని స్పష్టం
మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసులు
image.png
కామారెడ్డి,ప్రజాతంత్ర,జనవరి7: కామారెడ్డిలో ఇంకా ఉద్రిక్తతలు చల్లారలేదు. రైతుల ఆందోళనలు
ఆగడం లేదు. తమ భూములకు ఎసరు వచ్చిందన్న ఆందోళనలో వారు ఉన్నారు. వరుసగా మూడోరోజూ ఆందోళన సాగుతోంది. దీనికితోడు బహత్‌‌ప్రణాళికపై రైతులు హైకోర్టు గడపదొక్కారు. ఇండస్టియ్రల్‌ ‌జోన్‌కు భూములు ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. ఈ మేరకు 40మంది రైతులు కోర్టులో కేసు వేశారు. మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. అలాగే చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ ‌చేస్తున్‌ఆనరు. రైతులపై దాడికి నిరసనగా కలెక్టరేట్‌ ‌దగ్గర రైతుల ఆందోళన చేపట్టారు. అడ్లూర్‌ ఎల్లారెడ్డిలో టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్న బండి సంజయ్‌ ‌పర్యటన ఉద్రిక్తతతో రేవంత్‌ ‌రెడ్డి పర్యటన డైలమాలో ఉంది. మరోవైపు జిల్లా కలెక్టర్‌ ‌తీరుపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటి వరకు రైతులను కలెక్టర్‌ ‌కలవలేదు. కామారెడ్డి మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌కారణంగా తనకు నష్టం జరుగుతుందన్న ఆందోళనతో సదాశివనగర్‌ ‌మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డికి చెందిన రైతు రాములు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రాములు కుటుంబాన్ని బండి సంజయ్‌ ‌శుక్రవారం పరామర్శించారు. మాస్టర్‌ ‌ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపారు.
అనంతరం రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జిల్లా కలెక్టరేట్‌ ‌ను బండి సంజయ్‌ ‌ముట్టడించారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతులు, బీజేపీ కార్యకర్తలు.. పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో కొంతమంది బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. కొందరు సొమ్మసిల్లి కిందపడి పోయారు. చివరకు పోలీసులు బండి సంజయ్‌ ‌ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించారు.  రైతుల పోరాటానికి అండగా ఉంటామని, మాస్టర్‌ ‌ప్లాన్‌ను రద్దు చేసేంత వరకూ ఉద్యమిస్తామని బండి సంజయ్‌ ‌హెచ్చరించారు. ఇండస్టియ్రల్‌ ‌జోన్‌కు బీజేపీ వ్యతిరేకం కాదని,కానీ దాని కోసం ఏడాదికి రెండు పంటలు పండే భూములను లాక్కోవడం సరికాదన్నారు. మాస్టర్‌ ‌ప్లాన్‌కు వ్యతిరేకంగా, కలెక్టర్‌ ‌తీరుకు నిరసనగా రైతు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన కామారెడ్డి బంద్‌ ‌సక్సెస్‌ అయింది. పట్టణంలోని దుకాణాలు, సినిమా హాల్స్, ‌హోటళ్లు, ప్రైవేట్‌ ‌విద్యాసంస్థలను మూసేసి తమ నిరసనలు తెలిపారు. బంద్‌కు బీజేపీ, కాంగ్రెస్‌ ‌మద్దతు ఇచ్చాయి. పట్టణ శివార్లలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించిన పోలీసులు.. వివిధ గ్రామాల నుంచి కామారెడ్డికి వస్తున్న రైతులు, బీజేపీ, కాంగ్రెస్‌ ‌లీడర్లను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. బంద్‌ ‌సందర్భంగా రైతులు, బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన 170 మంది నేతలను అరెస్టు చేశారు. ఇకపోతే తాజాగా అక్కడ పరిస్థితులను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Leave a Reply