హెచ్ ఐవి కేసును తొలి దశలో కనుగొన్న దేశాల్లో క్యూబా ముఖ్యమైన దేశం. హెచ్ఐవి రోగులకు బలమైన ఆహారాన్ని అందించడం, వారికి ఆ వ్యాధి పట్ల సరైన అవగాహన కలిగించడం, విడుదల అయిన తర్వాత బాధ్యత లేకుండా వ్యవహరించేవారిని యావజ్జీవ కారాగారాల్లో ఉంచడం వంటి చర్యలు తీసుకుంది. శానిటోరియాల్లో వారిని రెండు నెలల పాటు ఉంచేవారు. ఈ పద్దతి వల్ల హెచ్ఐవి 0.5 శాతం కన్నా తక్కువకు చేర్చింది. అయితే, వ్యక్తుల వ్యక్తిగత జీవన విధానానికి ఇది ఆటంకం కలిగించిందన్న ఆరోపణలు వచ్చాయి.
కొరోనా వ్యాప్తి విషయంలో వస్తున్న వార్తలు, కథనాలను చూసి భయపడవద్దు. వైరస్ బాధితుల పట్ల వివక్ష చూపవద్దు. వాస్తవికత లేని సమాచారంతో విధానాలను రూపొందించవద్దు. వ్యాక్సిన్ లేకపోవడం వల్ల హెచ్ఐవి రోగం 25 ఏళ్ళ పాటు ప్రపంచవ్యాప్తగా 35 మిలియన్ మందిని బలిగొంది. వీరిలో యువకులు ఎక్కువ. హెచ్ఐవి వ్యాప్తి తొలి రోజుల్లో భయం, ఆందోళన, ప్రజల్లో ఒక విధమైన విలక్షణ భావం ప్రబలాయి. హెచ్ఐవి సోకిన వారిని గ్రామాల్లోకి రానివ్వకుండా ఊరవతల ఉంచడం, ఆరోగ్య రక్షణ సేవలను వారికి అందకుండా చేయడం వంటి చర్యలకు పాల్పడేవారు. హెచ్ ఐవి కేసును తొలి దశలో కనుగొన్న దేశాల్లో క్యూబా ముఖ్యమైన దేశం. హెచ్ఐవి రోగులకు బలమైన ఆహారాన్ని అందించడం, వారికి ఆ వ్యాధి పట్ల సరైన అవగాహన కలిగించడం, విడుదల అయిన తర్వాత బాధ్యత లేకుండా వ్యవహరించేవారిని యావజ్జీవ కారాగారాల్లో ఉంచడం వంటి చర్యలు తీసుకుంది. శానిటోరియాల్లో వారిని రెండు నెలల పాటు ఉంచేవారు. ఈ పద్దతి వల్ల హెచ్ఐవి 0.5 శాతం కన్నా తక్కువకు చేర్చింది. అయితే, వ్యక్తుల వ్యక్తిగత జీవన విధానానికి ఇది ఆటంకం కలిగించిందన్న ఆరోపణలు వచ్చాయి. మన దేశంలో హెచ్ఐవి తొలి కేసు 1986లో కనుగొన్నారు. 15 సంవత్సరాల పాటు దానిని ఖండిస్తూ వచ్చారు.
2005లో మన దేశంలో 5.1 మిలియన్ మందికి హెచ్ఐవి సోకినట్టు నమోదు యింది. అయితే, అసలు గణాంకాలు 2.3 మిలియన్లు మాత్రం నమోదు అయ్యాయి. హెచ్ఐవిని ఎదుర్కొనేందుకు భారత్ సొంత వ్యూహాన్ని అనుసరించింది. ఈ వైరస్ సోకిన వారిపై నిరంతరం నిఘా పెట్టింది. ఇన్ఫెక్షన్ల భారాన్ని బట్టి జిల్లాలు, రాష్ట్రాలను విభజించింది. ఎక్కువ రిస్క్ ఉన్న వారిని దూరంగా ఉంచింది. పరీక్షలు, చికిత్సా విధానాలను వేగవంతం చేసింది. హెచ్ఐవికి ఇప్పటికీ వ్యాక్సిన్ లేనిమాట నిజమే, కానీ, ప్రభుత్వం రూపొందించిన విధానాలను కఠినంగా అమలు జేయడం ద్వారా అదుపు చేయగలిగారు. ఇక పోలియో సంగతి తీసుకుంటే ఈ వ్యాధిని అరికట్టేందుకు రాజకీయ పరమైన మద్దతు లభించింది, హెచ్1 ఎన్1 వ్యాధి 44,000 మందికి సోకింది. నాలుగువేల మంది మరణించారు. 2009-10 మధ్య మూడు లక్షల మంది మరణించారు. ఈ వ్యాధిని అరికట్టేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు.
కోవిడ్ విషయం తీసుకుంటే… కోవిడ్ కూడా వైరస్సే. అయితే, హెచ్ఐవి, పోలియో, లేదా హెచ్1 ఎన్1 వంటిది కాదు. కోవిడ్-19 మొదట 185 దేశాలకు వ్యాపించింది. 2.7 లక్షల మందికి వ్యాపించింది. రెండు మాసాల్లో 2 లక్షల మంది మరణించారు. ఇటీవల కాలంలో ఇంత మందిని బలిగొన్న వైరస్ ఇంకోటి లేదు. 300 నుంచి 600 మిలియన్ ప్రజలు ఈ వైరస్‌కు గురి అయ్యారు. వీరిలో దినసరి వేతన కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. మన దేశంలో మరణాల సంఖ్య తక్కువ అయినప్పటికీ వ్యాధి సోకిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఢిల్లీలో తబ్లిగీ సమావేశాలకు హాజరైన వారి వల్ల ఈ వైరస్ వ్యాప్తి 10 శాతం ఉంది. ముస్లింలంపై ఆగ్రహావేశాలు పెరిగాయి. దాంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ జోక్యం చేసుకుని ఈ వైరస్ వ్యాప్తిని మతపరంగా చూడొద్దని విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. కోవిడ్‌ను ఎదుర్కోవడానికి వెనుకటి అనుభవాలు నేర్పిన గుణపాఠాల నుంచి ప్రభుత్వం ముందుకు సాగాలి. ఎలాంటి వివక్ష లేకుండా వ్యాధిగ్రస్తులందరికీ సమానంగా వైద్యావకాశాలు కల్పించాలి. వ్యాధి తీవ్రత దృష్ట్యా జిల్లాలు, రాష్ట్రాలకు కేటాయించే నిధుల్లో 70 శాతాన్ని ఈ వ్యాధి చికిత్సకు కేటాయించాలి. ప్రధానమంత్రి మీడియా ద్వారా ఇస్తున్న సందేశాలు క్షేత్ర స్థాయికి చేరాలి. కొరోనాను ఎదుర్కోవడంలో అన్ని వర్గాలను కూడగట్టడంలో ప్రభుత్వం ప్రయత్నాలు ఇప్పటికే ఫలించాయి. వీటీని కొనసాగిస్తే వైరస్‌ని జయించడం కష్టమేమీ కాదు. ఈ సమయంలో అన్ని వర్గాలు సంయమనాన్ని పాటించాలి. మానవీయ కోణంలో సాయం అందించాలి. వ్యాధి గ్రస్తులపై జాలి కాదు, మానవతా హృదయంతో సాయం అందించాలి. ఇలాంటి కష్టాలు ఎదురైనప్పుడు మానవతా దృక్పధంతో స్పందించాలి. వ్యాధి వల్ల నష్టాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలి.
– ‘ద వైర్’ సౌజన్యంతో..