Take a fresh look at your lifestyle.

దేశంలో లక్షకు దిగువకు పాజిటివ్‌ ‌కేసులు

  • క్రమంగా తగ్గుతున్న కొరోనా
  • 24 ‌గంటల్లో కొత్తగా 86,498 మందికి పాజిటివ్‌

దేశ వ్యాప్తంగా కొరోనా రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కేసుల సంఖ్య భారీగా తగ్గిపోతున్నది. ఇప్పటి వరకూ లక్షకు పైగా కేసులు నమోదు కాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 86,498 కొత్త పాజిటివ్‌ ‌కేసులు నమోదయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా 24 గంటల్లో 2,123 మంది మృతి చెందారు. 1,82,282 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తంగా కేసుల సంఖ్య 2,89,96,473 కి చేరుకుంది. వైరస్‌ ‌నుండి కోలుకున్న వారి సంఖ్య 2,73,41,462 ఉండగా..యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 13,03,702గా ఉంది. కొరోనాతో దేశ వ్యాప్తంగా మొత్తం 3,51,309 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా టీకా తీసుకున్న వారి సంఖ్య 23,61,98,726కు చేరుకుంది. సుమారు 63 రోజుల తరువాత కొత్త కేసులు లక్షకు దిగువకు చేరాయి.

పాజిటివిటీ రేటు 4.62 శాతానికి పడిపోయింది. గత కొద్ది రోజులుగా మరణాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు మంగళవారం గణాంకాలను వెల్లడించింది. ఏప్రిల్‌ ‌ప్రారంభం నుంచి నిత్యం లక్షకు పైగా నమోదైన కేసులు..ఒక దశలో నాలుగున్నర లక్షలకూ చేరాయి. ఈ క్రమంలో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ‌వంటి కఠిన ఆంక్షలవైపు మొగ్గుచూపాయి. ఆ ఫలితమే ఇప్పుడు కనిపిస్తున్నది. కేసులు తగ్గడంతో పాటు రికవరీ రేటు మెరుగ్గా ఉండటం కూడా ఊరటనిస్తున్నది. గత 26 రోజులుగా రోజూవారీ కేసులకంటే రికవరీలే ఎక్కువగా ఉంటున్నాయి.

Leave a Reply