Take a fresh look at your lifestyle.

ఆరో రోజూ 2 లక్షల లోపే…!

  • రోజువారీ కోవిడ్ కేసులు 1.32 లక్షలు
  • రోజువారీ పాజిటివిటీ 6.57%; 9 రోజులుగా 10% లోపే
హైదరాబాద్,జూన్ 2: రోజువారీ కోవిడ్ కేసులు తగ్గుతూ  గత 24 గంటలలో 1,32,788 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇలా రెండు లక్షలలోపు కేసులు రావటం వరుసగా ఇది ఆరో రోజు..అని  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. చికిత్సలో ఉన్న కేసులు క్రమేపీ తగ్గటం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య  17,93,645 గా నమోదైంది. గత 24 గంటలలో నికరంగా 1,01,875 తగ్గిన ఫలితమే ఈ సంఖ్య. ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నవారి వాటా 6.34% మాత్రమే..దేశంలో రోజువారీ కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం గత 20 రోజులుగా సాగుతోంది. గడిచిన 24 గంటలలో 2,31,456 మంది కోలుకున్నారు. ఇది అంతకుముందు రోజుకంటే 98,668 అధికం..అని ప్రకటనలో పేర్కొన్నారు.

Read Also: ఆర్థికంగా భారమైనా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం

 ఇప్పటివరకు కోవిడ్ సోకినవారిలో మొత్తం 2,61,79,085 మంది కోలుకున్నారు. గత 24 గంటలలో 2,31,456 మంది కొలుకున్నారు. ఇది మొత్తం కోలుకున్నవారి శాతాన్ని 92.48% గా చూపుతూ పెరుగుతున్న దిశలో సాగుతోంది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా మొత్తం  20,19,773 కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరిగాయి. దీంతో ఇప్పటిదాకా జరిపిన మొత్తం పరీక్షల సంఖ్య 35 కోట్లు దాటి   35,00,57,330 కు చేరింది.  ఒకవైపు కోవిడ్ పరీక్షల సంఖ్య పెరుగుతూ ఉండగా, మరోవైపు వారపు పాజిటివిటీ తగ్గుతోంది. ప్రస్తుతం అది 8.21%  ఉండగా రోజువారీ పాజిటివిటీ 6.57%కు తగ్గింది. వరుసగా 9వ రోజుకూడా 10% లోపే నమోదైంది.  దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 21.85 కోట్లు దాటింది.  ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం ప్రకారం 30,91,543 శిబిరాల ద్వారా ఇప్పటిదాకా 21,85,46,667 టీకా డోసుల పంపిణీ జరిగింది.

Leave a Reply