Take a fresh look at your lifestyle.

పాఠ్య పుస్తకాల అమ్మకాలు అంతంత మాత్రం ..!

“2020-21 విద్యా సంవత్సరం ప్రారంభం పై అనిశ్చితి ..ఆన్ లైన్ క్లాసుల నిర్వహణ ఆలోచన ..10 వ తరగతి విద్యార్థుల 100 శాతం ఉత్తీర్ణత ..పాఠ్య పుస్తకాల డౌన్ లోడ్ ఉచితం..1 నుంచి 5 తరగతి వరకు ప్రైవేట్ పబ్లిషర్ల సిలబస్ అమలు …వెరసి 1 నుంచి 10 తరగతి పాఠ్య పుస్తకాల ముద్రణా , అమ్మకం బాధ్యత చేపట్టిన ప్రింటర్లు, పబ్లిషర్లు అమ్మకాలు లేక తీవ్ర నష్టాల్లోకి నెట్టబడుతున్నారు..!”
ఆందోళనలో ముద్రాపకులు ..కుదేలవుతున్న చిన్న పరిశ్రమ

సమస్త మానవాళిని అతలాకుతలం చేస్తున్న కొరోనా వైరస్ మహమ్మారి దుష్ప్రభావాలు అన్ని రంగాల పై ప్రత్యక్షంగా పడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక రంగం కుదేలయిపోయింది . ప్రభుత్వాలు ఎన్ని ఉపశమనాల కోసం ప్రయత్నిస్తున్న అవి నామ మాత్రంగానే మిగిలిపోతున్నాయి . అన్ని రంగాల మాదిరి విద్యా వ్యవస్థ పై కొరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం తీవ్రంగా పడింది . 2020-21 విద్యా సంవత్సరం పై అనిశ్చితి నెలకొంది . ప్రతి సంవత్సరం జూన్ నెలలో ప్రారంభం కావలసిన విద్యా సంవత్సరం పై ఇంకా స్పష్టత రాలేదు . 1 నుంచి 10 తరగతి విద్యార్థులకు కావలసిన ఉచిత పాఠ్య పుస్తకాలు ఇప్పటికే ముద్రించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాలకు సరఫరా జరిగి పోయింది . ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు కావలసిన సుమారు 20 లక్షల సేల్ పుస్తకాల పబ్లిషర్లు , ప్రింటర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 2020-21 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు కావలసిన తరగతులు 1 నుండి 10 వరకు పాఠ్య పుస్తకాల ముద్రణ, అమ్మకం కోసం తెలంగాణ టెక్స్ట్ బుక్ ప్రెస్ ఈ సంవత్సర ఫిబ్రవరి లో టెండర్లు పిలిచింది . ఆందులో పాల్గొన్న 33 మంది ముద్రాపకులకు సేల్ పుస్తకాల బాధ్యతను జూన్ మొదటి వారం అప్పగించింది . ఈ మొత్తం ప్రక్రియకు ..ఒకటి నుంచి పది తరగతి పాఠ్య పుస్తకాల ముద్రణ , అమ్మకం కోసం ముద్రాపకులు ధరావత్తు రు. 10 లక్షలు , 10 లక్షలు రాయల్టీ ,10 లక్షలు బ్యాంకు గ్యారంటీ మరియు ఇతర ఖర్చులు కలుపుకుని మొత్తంగా సుమారు 35 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి వొచ్చింది . కొరోనా వైరస్ వ్యాప్తి భయం తో వలస కార్మికులు ఇంటి బాట పట్టగా ..స్థానిక కార్మికులు పని పట్ల ఆసక్తి చూపడం లేదు . జూన్ నెలలో పుస్తకాల సరఫరా కోసం ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ముద్రాపకులు పూర్తి చేసే అవకాశం కనిపించడం లేదు.

మార్కెట్లో విడుదల చేసిన పుస్తకాలు అమ్ముడు పోక ముద్రాపకులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పుస్తకాల సంఖ్య కు ..అమ్మకాలకు భారీ వ్యత్యాసం కనిపిస్తుంది .ఒక వేళ విద్యా శాఖ నిర్ధారించిన పుస్తకాల సంఖ్య ముద్రణ పూర్తి చేసినా ..విద్యా సంవత్సరం ప్రారంభం పై అనిశ్చితి కారణంగా పుస్తకాల అమ్మకాల పై తీవ్ర ప్రభావం చూపుతుంది . ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 1 నుంచి 5 తరగతి పుస్తకాల పై వివాదం కొనసాగుతూనే ఉన్నది . ఒక వైపు ప్రభుత్వం ఆ తరగతుల పుస్తకాలను ప్రైవేట్ పబ్లిషర్లు తమ సిలబస్ వి కాకుండా ..ప్రభుత్వం ప్రతిపాదించిన సిలబస్ పుస్తకాల ద్వారానే బోధనా జరగాలె అని ఆదేశాలు జారీ చేసినా ..అవి అమలు కావడం లేదు . ఇక ఈ సంవత్సరం కొరోనా కారణంగా 10 వ తరగతి విద్యార్థులందరినీ పాస్ చేయడం వల్ల కూడా ఆ తరగతి పుస్తకాల అమ్మకాల పై తీవ్ర ప్రభావం పడనుంది . సాధారంగా ప్రతి సంవత్సరం పడవ తరగతి ఉత్తీర్ణత శాతం 70 నుంచి 75 శాతం ఉంటుంది .ఫెయిల్ అయిన విద్యార్థులు తమ పుస్తకాలను మళ్ళీ చదువుకోడానికి భద్ర పరచు కుంటారు . ఈ సంవత్సరం ఆ పరిస్థితి లేదు . ఆ 25 శాతం విద్యార్థులు 9 తరగతి పాస్ అయినా విద్యార్థులకు ఇవ్వడం సహజంగా జరిగేదే.. మొత్తం కాకపోయిన అధిక శాతం ..! మరో వైపు ఎస్ సీ ఈ ఆర్ టి 1 నుంచి 10 తరగతి పుస్తకాలను పీడీఎఫ్ ఫార్మేట్ లో అందుబాటు లోకి తేవడం ..ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కలిపించడం కూడా పుస్తకాల అమ్మకాల పై తీవ్ర ప్రభావం చూపనున్నది . 2020-21 విద్యా సంవత్సరం ప్రారంభం పై అనిశ్చితి ..ఆన్ లైన్ క్లాసుల నిర్వహణ ఆలోచన ..10 వ తరగతి విద్యార్థుల 100 శాతం ఉత్తీర్ణత ..1 నుంచి 5 తరగతి వరకు ప్రైవేట్ పబ్లిషర్ల సిలబస్ అమలు …వెరసి 1 నుంచి 10 తరగతి పాఠ్య పుస్తకాల ముద్రణా , అమ్మకం బాధ్యత చేపట్టిన ప్రింటర్లు, పబ్లిషర్లు అమ్మకాలు లేక తీవ్ర నష్టాల్లోకి నెట్టబడుతున్నారు . ప్రభుత్వం , విద్యా శాఖ అధికారులు పరిస్థితి సమీక్షించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ ని పూర్తి గా మినహాయించాలని టెండర్ లలో పాల్గొన్న వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Leave a Reply