Take a fresh look at your lifestyle.

సమస్యలు తక్కువ, ఆదాయం ఎక్కువ

పంటలు  మంచి ఉత్పత్తి కోసం సరైన నేల ఎంపిక చేయాలి. తద్వారా  పంట నుంచి సకాలంలో మంచి ఉత్పత్తిని పొందవచ్చు. దీనితోపాటు పంట నాణ్యత కూడా బాగుండాలి. కాబట్టి నల్ల నేలలు ఏ పంటకు ఉపయోగపడుతుందో ప్రతి రైతు తెలుసుకోవాలి. మొక్క అభివృద్ధికి నేల పాత్ర చాలా ముఖ్యమైనది. వివిధ పంటలలో వివిధ రకాలైన నేలలు వాటి స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఐదు  రకాల నేలలు ఉన్నాయి.  నల్ల నేల, ఇసుక నేల, ఒండ్రు నేల అంటే లోమీ నేల, ఎర్ర నేల మొదలైనవి. అన్ని రకాల నేలలు తమదైన ప్రత్యేకతను కలిగి ఉన్నప్పటికీ నల్ల నేల యొక్క లక్షణాల గురించి చూద్దాం. నల్ల నేల యొక్క లక్షణం మొక్కల ఉత్పత్తికి ఎక్కువగా ఉపయోగించే నల్ల నేల. ఇనుము, సున్నం, మెగ్నీషియం మరియు అల్యూమినా వంటి పోషకాలు నల్ల నేలలో ఉంటాయి, కాబట్టి పంట ఉత్పత్తికి నల్ల నేలను ఉపయోగించడం ఉత్తమం గా పరిగణించబడుతుంది. నత్రజని, భాస్వరం, పొటాష్‌ ‌మొత్తం కూడా ఇతర నేల రకాలు పోలిస్తే నల్ల నేలల్లో ఎక్కువగా ఉండదు.

నల్ల నేల ఏ పంటకు ఉపయోగపడుతుంది పత్తి పంట ఉత్పత్తిలో నల్లమట్టి ఎక్కువగా ఉపయోగించబడుతుంది. కాబట్టి నల్ల నేలను నల్ల పత్తి నేల అని కూడా అంటారు. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన పంట వాము. వాము సాగులో సమస్యలు తక్కువగా ఉండటం వల్ల రైతులు దీని సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. తెలుగు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రైతులు వాము సాగు చేపడుతూ లాభాలు ఆర్జిస్తున్నారు. చల్లని వాతావరణం, మంచు ఈ పంట పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. వర్షాధారం కింద సాగు చేయదలిస్తే నల్లరేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి. నీటిపారుదల కింద సాగు చేయదలిస్తే తేలికపాటి నేలలు కూడా అనుకూలం. అధిక ఆమ్ల, క్షార నేలలు, నీరు నిల్వ ఉండే నేలలు అనుకూలం కాదు. వర్షాధారంగా ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబర్‌ ‌మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. నీటి పారుదల క్రింద సెప్టెంబర్‌ ‌మొదటి పక్షం నుండి అక్టోబర్‌ ‌ద్వితీయ వారం వరకు విత్తుకోవచ్చు. విత్తన రకాలకు సంబంధించి లాం సెలక్షన్‌-1 : 150-160 ‌రోజుల్లో పంటకు వస్తుంది. నూనె శాతం 3 శాతం ఎకరాకు సుమారు 5 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. లాం అజోవాన్‌ -2 (ఎల్‌.‌టి.ఏ.-26) : 145 -160 రోజుల్లో కోతకు వస్తుంది. నూనె శాతం 4 శాతం విడుదలకు సిద్ధంగా ఉన్న అధిక దిగుబడినిచ్చే వంగడం.

ఎకరాకు 5-6 క్వింటాళ్ల దిగుబడి లభిస్తుంది. పంట 140-160 రోజుల్లో కోతకు వస్తుంది. గింజలు గోధుమ రంగులోకి మారి పరిపక్వ దశకు వచ్చినప్పుడు గింజ రాలకుండా మొక్కలు పీకడం కానీ కోయడం కానీ చేయాలి. కోసిన మొక్కలను 2-3 రోజులు పొలంలో ఎండనిచ్చి నూర్చు కోవాలి. సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా వాము సాగులో అధిక దిగుబడి తో పాటు ఆదాయం పొందవచ్చు.  పంటను ఆశించే పేనుబంక నివారణకు ఎసిఫేట్‌ 1 ‌గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఎర్రనల్లి ఆకుల అడుగు భాగాన చేరి రసం పీలుస్తాయి. నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే తామర పురుగులు రసం పీల్చడం వల్ల ఆకులు పైకి ముడుచుకొని పోతాయి.పప్పు ధాన్యాల్లో శనగకు ప్రాధాన్యత ఉంది. రాష్ట్రంలో   నల్లరేగడి భూముల్లో  రబీ పంటగా దీనిని సాగు చేస్తున్నారు.  సారవంతమైన నల్లరేగడి భూములు ఈ పంటకు అనుకూలం. నిల్వ ఉండే తేమను ఉపయోగించుకుంటూ శీతాకాలంలోని మంచు తో మొక్కలు పెరుగుతాయి.

చౌడు భూములు పనికిరావు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు  మూడు  లక్షల ఎకరాల్లో శనగ సాగవుతోంది. 1.48 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతోంది. ఎకరానికి సరాసరి దిగుబడి 55 కిలోలు.  తొలకరిలో వేసిన పైరును కోసిన తర్వాత భూమిని నాగలితో ఒక సారి, గొర్రుతో రెండుసార్లు మెత్తగా దున్ని చదును చేయాలి.రకాలు: జేజే 11, జేఏకేబీ 9218, క్రాంతి(ఐసీసీసీ 37), అన్నెగిరి, జ్యోతి, ఐసీసీవీ 10, నంద్యాల శనగ, కాబూలి రకాలు : కేఏకే 2, పూలే జీ 95311, శ్వేత (ఐససీవీ 2) విత్తేసమయం: అక్టోబరు నుంచి నవంబరు మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. ఆలస్యంగా విత్తినప్పుడు పంట చివరి దశలో బెట్టకు గురై, అధిక ఉష్ణోగ్రతల వల్ల గింజ సరిగా గట్టిపడక దిగుబడి తగ్గొచ్చు.  విత్తే విధానం: సాధారణంగా శనగను వర్షాధారంగా సాగు చేస్తారు. విత్తడానికి సరిపడా తేమ లేనప్పుడు ఒక తడి ఇచ్చి విత్తనం వేసుకోవచ్చు. విత్తేటప్పుడు విత్తనాన్ని 5 నుంచి 8 సెం.మీ లోతులో తడిమట్టి తగిలే విధంగా విత్తుకోవాలి. వరుసల మధ్య 30సెం.మీ మొక్కల మధ్య 10 సెం.మీ దూరం ఉండే విధంగా విత్తుకోవాలి. ఒక చదరపు మీటరుకు 33 మొక్కలు ఉండే విధంగా చూసుకోవాలి. నీటి సౌకర్యం ఉన్నప్పుడు లావు గింజ కాబూలి రకాలను ఎంచుకున్నప్పుడు వరుసల మధ్య 45 నుంచి 60 సెం.మీ దూరం పాటించాలి.  విత్తన మోతాదు: విత్తన బరువును బట్టి మోతాదు మారుతుంది. దేశవాళీ రకాలు ఎకరానికి 25 నుంచి 30 కిలోలు. కాబూలి రకాలు ఎకరానికి 45 నుంచి 60 కిలోలు అన్ని వంటకాల్లో ఉపయోగించే సామాన్య మసాలా దినుసులలో ధనియాల గింజలు పొడి ఒక్కటి. పచ్చి ఆకులు వివిధ వంటకాలలో సువాసన కొరకు వేస్తారు. ధనియాలు అనేక ఔషధ గుణాలు కలిగి ఉంది. భారతదేశం లో అన్ని రాష్ట్రాల్లో పండిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌ ‌లో సుమారు 1 లక్ష హెక్టార్లలో పండిస్తున్నారు. చల్లని వాతావరణంతో పాటు తక్కువ ఉష్ణోగ్రత తగినంత మంచు అనుకూలం.  వర్షాధారం కింద నల్ల రేగడి నేలలు అనుకూలం.  నీటి వసతి కింద గరప నేలలు, ఎర్ర నేలలు మరియు ఇతర తేలికపాటి నేలలు అనుకూలం. నీరు నిలబడే లోతట్టు ప్రాంతాలు, అధిక ఆమ్ల, క్షార గుణాలు కలిగిన భూమి ఈ పంటకు అనుకూలం కాదు.విత్తే కాలం: అక్టోబర్‌ 15 ‌నుంచి నవంబర్‌ 15 ‌వరకు.నీటి ఆధారం కింద నవంబర్‌ ‌నేల ఆఖరు వరకు విత్తుకోవచ్చు.ధనియాలు ఆకుల కోసం సంవత్సరం పొడవున విత్తుకోవచ్చు. వేసవిలో షెడ్‌ ‌లు వేసుకుంటే దిగుబడి వస్తుంది.ఎకరాకు 6 కిలోల విత్తనం అవసరం అవుతుంది. విత్తే ముందు అజోస్పైరిల్లం ఎకరానికి 600 గ్రా.చొప్పున విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి ఇలా చేస్తే దిగుబడి 6-7% పెరిగే అవకాశం ఉంది. ఎండు తెగులు ఆశించే ప్రాంతంలో ధనియాలు సాగు చేయరాదు.

లేదా పంట మార్పిడి 2-3 సార్లు చేయవచ్చు. వేసవిలో లోతు దుక్కి దున్నడం వలన బూజు తెగులు ను అదుపులో పెట్టుకోవాలి. 1గ్రా. కార్బడిజం 1 కిలో విత్తనానికి కలిపి చేయడం విత్తన శుద్ధి చేయడం వలన తెగులు నివారణ చేయవచ్చు.ఎరువుల యాజమాన్యం: వర్షాధారం కింద నల్ల రే గడి నేలల్లో ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువుతో పాటు 25 కిలోల యూరియా 100 కిలోల సింగిల్‌ ‌సూపర్‌ ‌ఫాస్ఫేట్‌ 15 ‌కిలోల మ్యూరేట్‌ అఫ్‌ ‌పోటాష్‌ ఎరువులను వేయాలి.కోత: రకాన్ని బట్టి 40- 45 రోజులకు పూత మొదలై 80-110 రోజులకు పక్వానికి వస్తాయి.60% గింజలు పక్వానికి వచ్చినప్పుడు పంటను కోయాలి. పంట ఉదయం పూట మాత్రమే కోయాలి. కోసిన తర్వాత 2-3 రోజులు పొలంలో నే అరనించి నూర్చాలి.విత్తనం నిల్వ చేయుట: నిల్వ ఉంచిన సంచులపై మాలధియన్‌ ‌వేయాలి.  విత్తనాన్ని అప్పుడప్పుడు ఎండ బెట్టడం చేయాలి.

– డా. ముచ్చుకోట సురేష్‌ ‌బాబు, అధ్యక్షులు, గౌతమ్‌ ‌బుద్ధ అభివృద్ధి సమాఖ్య.

Leave a Reply