Take a fresh look at your lifestyle.

కుష్టు వ్యాధిపై అవగాహన అవసరం

Leprosy Prevention Day on January 30 B. Mohammed Rafi Social Worker, Don
జనవరి 30న కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా…

కుష్టు వ్యాధి మైకో బ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వలన కలిగే దీర్ఘకాలిక వ్యాధి. ఇది చాలా నెమ్మదిగా కొన్ని సంవత్సరాల్లో సంక్రమిస్తుంది. మన దేశంలో చాలా మంది ఈ వ్యాధి తో బాధపడుతున్నట్లు కొన్ని సర్వేల ద్వారా తెలుస్తుంది. ఈ వ్యాధి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొన్ని రోజులలో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. చర్మ మ్యూకస్‌ ‌మెంబ్రేన్‌ ‌నరాలు రోగగ్రస్తమవుతాయి. ఈ వ్యాధి వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి వ్యాధి తీవ్రత ఎక్కువగును. శరీరం పై తెల్ల మచ్చలు ఉన్న చోట చర్మంపై పొరలు పరిక్షించి వ్యాధి నిర్ధారిస్తారు. ఈ వ్యాధి కుష్టు వ్యాధి అని తెలియగానే జబ్బు తీవ్రతను బట్టి వైద్యనిపుణులు వైద్యం అందిస్తారు.ఈ వ్యాధికి పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైద్యశాలలో ఉచితంగా వైద్యం అందిస్తుందని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారని సామాజిక కార్యకర్త డోన్‌ ‌పి. మహమ్మద్‌ ‌రఫి తెలిపారు.

వ్యాది వచ్చి వారు జబ్బు తీవ్రతను బట్టి
దాదాపు రెండు సంవత్సరాలు క్రమం తప్పకుండా మందులు వాడాలి. అప్పుడు జబ్బు నయం అవుతుందని వైద్యనిపుణులు తెలిపారు.
జాతీయ కుష్టు నివారణ పథకం కింద రోగగ్రస్తులనూ ముందుగానే గుర్తించి వారికి సరైన వైద్యం అందించే విధంగా ప్రతి ఒక్కరూ అవగాహణ కలిగి ఉండాలి. వ్యాధి వచ్చిన తర్వాత ఖచ్చితంగా క్రమం తప్పకుండా వైద్యనిపుణుల పర్యవేక్షణ లో వైద్యం పొందాలని సామాజిక కార్యకర్త డోన్‌ ‌పి. మహమ్మద్‌ ‌రఫి తెలిపారు.

కొన్ని లక్షణాలు
శరీరముపై పాలిపోయిన లేదా రాగి రంగు మచ్చలు ఉన్నప్పుడు ,ఆ మచ్చలపై స్పర్శజ్ఞానము లేనప్పుడు, మరియు నొప్పి తెలియనప్పుడు, శరీరమందు ముఖ్యంగా పాదములు, చేతులు, వ్రేళ్లు తిమ్మిర్లు ఉన్నప్పుడు, చర్మం దళసరిగా ఉన్నప్పుడు, ముఖం నూనె రాసినట్లు నిగనిగలాడుతూ కన్పించినపుడు ఈ వ్యాధిగా అనుమానించాలని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారని , వెంటనే ప్రభుత్వ వైద్యశాల లో వైద్యనిపుణులను సంప్రదించి ఉచితంగా వైద్యం పొంది ఆరోగ్యాలను కాపాడుకోవాలని సామాజిక కార్యకర్త డోన్‌ ‌పి. మహమ్మద్‌ ‌రఫి తెలిపారు.
కుష్టువ్యాధి సూక్ష్మ క్రిమి, మైక్రో బాక్టీరియల్‌ ‌ద్వారా సంక్రమించు వ్యాధి.1873వ సం.లోనే హన్‌ ‌సన్‌ అను నార్వే శాస్త్రవేత్త ఈ వ్యాధి కారకమైన సూక్ష్మ జీవిని సూక్ష్మ దర్శినితో కనుగొన్నాడు.ఈ వ్యాధి, వ్యాధి గ్రస్తుని నుండి గాలి ద్వారా, సన్నిహిత సాన్నిధ్యం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.

కుష్టు వ్యాధిగా అనుమానించిన వెంటనే సమీపంలోని కుష్టు వ్యాధి నిర్మూలనా కేంద్రంలో చూపించుకొని ఉచిత వైద్యం పొంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సామాజిక కార్యకర్త డోన్‌ ‌పి. మహమ్మద్‌ ‌రఫి తెలిపారు కుష్టు వ్యాధి యొక్క ప్రారంభ దశలో గమనించిన వెంటనే వారిని వైద్య పరీక్షలకు ప్రోత్సహించండి. కుటుంబ సభ్యులకు, ఇతరులకు కుష్టు రోగులను బహిష్కరించకుండా ఉండుటకు సరైన శిక్షణ, అవగాహణ కల్పించండి.కుష్టు రోగులను కుటుంబంలోను, సంఘంలోనూ ఆదరణతో చూడండి మరియు వారు సంతోషముతో, ఆరోగ్యదాయకమైన జీవితం గడుపుటకు సమాజం లో అందరి ప్రోత్సాహం అవసరమని సామాజిక కార్యకర్త డోన్‌ ‌పి. మహమ్మద్‌ ‌రఫి తెలిపారు.

పి. మహమ్మద్‌ ‌రఫి
సామాజిక కార్యకర్త, డోన్‌

Leave a Reply