Take a fresh look at your lifestyle.

శాసనమండలి ఎన్నికల పోరు… ప్రచార హోరు

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ, వరంగల్‌, ‌ఖమ్మంబీ మహబూబ్‌ ‌నగర్‌, ‌రంగారెడ్డి, హైదరాబాద్‌ ‌రెండు పట్టభద్రుల నియోజక వర్గాలనుంచి శాసన మండలికి ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మార్చి 14న పోలింగ్‌, ‌మార్చి 17న ఫలితాలు విడుదలకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్‌, ‌ఖమ్మం జిల్లాల మండలి నియోజకవర్గంనుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి, మహబూబ్‌ ‌నగర్‌, ‌రంగారెడ్డి హైదరాబాద్‌ ‌జిల్లాల నియోజకవర్గాల భాజపా సభ్యుడు రాంచందర్‌ ‌రావు పదవీకాలం 2021 మార్చ్ 29‌న ముగుస్తుండటంతో ఈ దఫా ఎన్నికలపోరు రసవత్తరంగా మారింది. ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకతను విపక్షాలు సద్వినియోగం చేసుకునే దిశగా ఇప్పటికే ప్రచారం ఉధృతం చేయడం ఒకెత్తైతే, ఇండిపెండెంట్‌ అభ్యర్థుల సంఖ్య బాగా పెరిగింది. ఈ ఎన్నికలకు గ్రాడ్యుయేట్‌ ఓట్ల నమోదు పెద్ద ఎత్తున జరిగి పాత ఆరు జిల్లాలలో పురుషులు 3,32,634, మహిళలు 1,72,864, థర్డ్ ‌జెండర్‌ 67 ‌మంది మొత్తం 5,05,565 ఓటర్లున్నారు. 731 పోలింగ్‌ ‌స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు రిటర్నింగ్‌ ఆఫీసర్లు చెబుతున్నారు.

ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం ఉధృతమైంది. నామినేషన్‌ ‌పక్రియ ముగిసింది. మహబూబ్‌ ‌నగర్‌, ‌రంగారెడ్డి, హైదరాబాద్‌ ‌జిల్లాల నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధినిగా దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవి, భారతీయ జనతాపార్టీ అభ్యర్ధిగా రాం చందరరావు, కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్భిగా జి. చిన్నారెడ్డి, వామపక్షాల మద్దతుతో ప్రొఫెసర్‌ ‌నాగేశ్వర్‌, ‌తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా ఎల్‌ ‌రమణ కాకుండా, స్వతంత్ర అభ్యర్థులుగా హర్షవర్ధన్‌ ‌రెడ్డి, గౌరీ సతీష్‌ ఇలా 93మంది అభ్యర్థులు బరిలో దిగారు. గత ఎన్నికల్లో 35 మంది పోటీచేస్తే, ఇప్పుడు 3 రెట్లు పెరిగింది.

వరంగల్‌, ‌ఖమ్మం, నల్గొండ నియోజక వర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధిగా పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి, భా జ పా అభ్యర్ధిగా ప్రేమేందర్‌ ‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్ధిగా రాములు నాయక్‌, ‌వామపక్షాల అభ్యర్థిగా జయసారధి రెడ్డి, తెలంగాణ జనసమితి తరఫున జేఏసీ చైర్మన్‌ ‌ప్రొఫెసర్‌ ‌కోదండరాం, యువ తెలంగాణ పార్టీ అభియల్ధినిగా రాణిరుద్రమ రెడ్డి , తెలంగాణ ఇంటిపార్టీ ప్రతినిధిగా చెరుకు సుధాకర్‌, ‌స్వతంత్ర అభ్యర్థులుగా తీన్మార్‌ ‌మల్లన్న, షేక్‌ ‌షబ్బీర్‌ అలీ (ప్రైవేట్‌ ‌టీచర్స్ ‌ఫోరం)… మొత్తం 71 మంది బరిలోకి దిగారు. గతంలో 23 అభ్యర్థులు పోటీ చేసారు. ఇప్పటికే అందరూ ప్రచారం ముమ్మరం చేశారు. ఈ రెండు నియోజకవర్గాలలో గెలుపెవరిదో మేధావుల అంచనాకు అందడంలేదు. గత ఆరు సంవత్సరాల పాలనలో నిరుద్యోగ నిర్మూలనలో ప్రభుత్వం విఫలమయిందన్న భావన ఉంది. దుబ్బాక ఉపఎన్నికలో ప్రజల తీర్పు అందుకు నిదర్శనమని, మండలికి జరగనున్న ఎన్నికలలో సైతం తిరిగి ఫలితం అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంటుందని భావిస్తున్నారు.

ప్రభుత్వ వ్యతిరేకత ఉండడం వాస్తవం అయినప్పటికీ, దుబ్బాక ఉపఎన్నికలో పార్టీల పరంగానే కాక స్వతంత్ర అభ్యర్ధులు అధిక సంఖ్యలో ఓట్లను చీల్చగలిగారు. ఇప్పుడుకూడా పోటీలో అభ్యర్థుల సంఖ్య పెరగడం అందరూ ముందుగానే ఎన్నికల ప్రచారం ప్రారంభించి ఓటర్లను ఆకర్షించ డానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. . ఉద్యమ పార్టీ, ఉద్యమ సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులు కన్న కలలు సాకారం చేసుకోవడానికి 2014 ఎన్నికల్లో ఒకటై నిలిచి అధికారాన్ని అందించారు. నేడా పరిస్థితి కానరావడంలేదని, గ్రాడ్యుయేట్‌ ఎన్నికలలో నిరుద్యోగ ఓటర్లు నిరుద్యోగులు పంతం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారంటున్నారు. కానీ స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య ఓట్లనుచీల్చి అధికారపార్టీకి మేలు చేయవచ్చు నంటున్నారు.

గత ఆరు సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజల ఆశలు నీరుకారి సమస్యలు అపరిష్కారంగా మిగిలాయని, అందువల్ల ఓటర్లు ప్రతీకారం తీర్చుకుంటారని విపక్షం ఆశ. నిరుద్యోగ సంఘాలు, ప్రజాసంఘాలు పరస్పర అవగాహనతో నడిస్తే, ప్రత్యల్ధులు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిని అధికారపక్షం అర్థం చేసుకుని, సరైన నిర్ణయాలు తీసుకొని ప్రజలపక్షం నిలబడ టానికి ప్రయత్నిస్తేనే ప్రయోజనం. శాసన మండలి ఎన్నికలలో ఓటర్లు విద్యాధికులై నందువల్ల ప్రలోభాలకు లోనుగాకుండా విటక్షణతో ఆలోచించి ఉత్తమ వ్యక్తిని ఎన్నుకోవాలి. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఫోన్‌ ‌సందేశాలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచార కార్యక్రమాలు తీవ్రం చ్ఱేసారు. చేతిలోని ఓటు వజ్రాయుధాన్ని సద్వినియోగం చేసుకుని, సమాజ హితవునకు పాటుపడే అభ్యర్థులను ఎన్నుకుంటాని ఆశిద్దాం.

dr polam saidhulu
డా.పోలం సైదులు ముదిరాజ్‌ , 9441930361

Leave a Reply