Take a fresh look at your lifestyle.

శాసన మండలి చైర్మన్‌ ‌గుత్తా ఏకగ్రీవ ఎన్నిక

  • రెండోసారి బాధ్యతల స్వీకరణ
  • మంత్రులు కేటీఆర్‌, ‌ప్రశాంత్‌ ‌రెడ్డి, శ్రీనివాసగౌడ్‌ ‌శుభాకాంక్షలు

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి వరుసగా రెండోసారి ఏకగ్రీవగా ఎన్నికయ్యారు. చైర్మన్‌గా గుత్తా వొక్కరే నామినేషన్‌ ‌వేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమే అయింది.. సోమవారం ఎన్నిక అనంతరం సుఖందర్‌ ‌రెడ్డిని మంత్రులు కేటీఆర్‌, ‌మహమూద్‌ అలీ, ప్రశాంత్‌ ‌రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్‌ ‌చైర్మన్‌ ‌స్థానంలో కూర్చోబెట్టరు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌మాట్టాడుతూ గుత్తా అపార రాజకీయ అనుభవం ప్రజాప్రతినిధులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

చట్టసభలలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించడంలో మండలి సభ్యులకు చైర్మన్‌ ‌మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. అత్యున్నత పదవుల్లో రైతు బిడ్డలు ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమని చెప్పారు. గతంలోనూ మండలి చైర్మన్‌గా గుత్తా ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి గౌరవప్రదంగా నడిపారనీ, ఇప్పుడూ అదే పద్దతిలో నడపాలని కోరుతున్నట్లు ఈ సందర్బంగా కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply