Take a fresh look at your lifestyle.

చట్టబద్ధంగా కర్మాగారాల్లో… కార్మికుల12 పని గంటల వల్ల మార్పు ఏ విధంగా?

“మానవ శక్తి అవసరాలను 33 శాతానికి తగ్గించడం, రోజుకు 12 గంటల పనిని ప్రవేశపెట్టడం ఈ సంస్కరణల లక్ష్యం. ఇప్పటికే కోవిడ్‌ -19 ‌ప్రభావంగా లాక్‌ ‌డౌన్‌ ‌పేరు చెప్పి కార్మికులపై పని భారం పెంచారు. కొన్ని చోట్ల పనులు లేకుండా ఫ్యాక్టరీలు మూసివేశారు. కొన్ని చోట్ల తక్కువ మందితో ఉత్పత్తులు జరిపిస్తున్నారు. లాక్‌ ‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత కూడా ఇదే పద్దతిని కొనసాగిస్తారేమోనన్న ఆందోళన ట్రేడ్‌ ‌యూనియన్లలో వ్యక్తం అవుతోంది. లాక్‌ ‌డౌన్‌ అనంతరం కార్మిక చట్టాలు అమలు జరగవేమోనన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది.”

కోవిడ్‌-19 ‌వ్యాప్తి వల్ల నాలుగు రాష్ట్రాల్లో వారానికి 72 గంటల పాటు పని చేయాలని కార్మికులను ఆదేశిస్తున్నారు. దీని వల్ల ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఏప్రిల్‌ 15‌వ తేదీన కేంద్ర హోం శాఖ కంటైన్‌మెంట్‌ ‌జోన్లలో కాకుండా ఇతర జోన్లలో ఆర్థిక పరమైన కార్యక్రమాలు తిరిగి ఎలా ప్రారంభం కావాలో పరిస్థితులను గురించి మార్గ దర్శకాలతో సుదీర్ఘమైన నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. ఆ నోటి ఫికేషన్‌లో ఏవి చేయకూడదో, ఏవి చేయవచ్చో సుదీర్ఘమైన వివరణ ఇచ్చింది. ముఖ్యంగా సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలను జోడించింది. కార్మికులకు ప్రైవేటు రవాణా సౌకర్యం కల్పించడం, మెడికల్‌ ఇస్యూరెన్స్ ‌కల్పించడం వంటివి అందులో చేరి ఉన్నాయి. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారికి 2005 నాటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలకు సంబంధించిన చట్టంలోని నిబంధనలను అనుసరించి కఠినమైన చర్యలు తీసుకొనేందుకు అవకాశం ఉంది. నిబంధనలను ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించేందుకు అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనను కేంద్ర ట్రేడ్‌ ‌యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక శాఖకు ఒక లేఖ రాశాయి. 1948 నాటి ఫ్యాక్టరీల చట్టం సవరణను వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నాయి.

ఈ సవరణ వల్ల ఫ్యాక్టరీల్లో కార్మికులు షిఫ్ట్‌కు 12 గంటలు పని చేయాల్సి ఉంటుందని, సవరణకు ముందు రోజుకు 8 గంటల చొప్పున కార్మికులు వారానికి 48 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉండగా ఈ సవరణ వల్ల వారానికి 72 గంటలు పని చేయాల్సి ఉంటుందని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. 1919 నాటి మొదటి కార్మిక ఒప్పందం ప్రకారం, ఆ తర్వాత 1921లో ధ్రువీకరించిన చట్టం ప్రకారం కార్మికులు వారానికి 48 గంటలు మాత్రమే పని చేయాలిసి ఉంటుందని ట్రేడ్‌ ‌యూనియన్లు పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌ను కేంద్రం జారీ చేయాల్సి ఉంది, కానీ, హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌గుజరాత్‌, ‌రాజస్థాన్‌ ‌పంజాబ్‌లు ఇప్పటికే రోజుకు పని గంటలను పెంచుతూ నోటిఫికేషన్లను జారీ చేశాయి.

కార్మిక రంగంలో సంస్కరణలను ట్రేడ్‌ ‌యూనియన్లు తరచూ వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు కార్మిక చట్టాల సవరణ లేదా, సంస్కరణల అమలు విషయంలో ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. కార్మిక రంగానికి సంబంధించిన అంశాలను రాజకీయ కోణంలో చూడటం బీజేపీకి మొదటి నుంచి అలవాటు. ఉద్యోగుల భద్రతకు ఎసరు పెట్టే హైర్‌ అం‌డ్‌ ‌ఫైర్‌ ‌విధానాన్ని వామపక్ష అనుబంధ కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కాంట్రాక్టు కార్మికుల చట్టాన్ని ఉమ్మడి ఆంధప్రదేశ్‌ 2013‌లోనూ, మహారాష్ట్ర 2017లోనూ సరళీకరణ చేశాయి. రాజస్తాన్‌ 2014‌లో సరళీకరించింది. కాంట్రాక్ట్ ‌లేబర్‌ ‌చట్టం సవరణ వల్ల కార్మికులు కనీస హక్కులు కోల్పోతారని ట్రేడ్‌ ‌యూనియన్లు వాదిస్తున్నాయి. వారానికి 48 గంటలు మాత్రమే పని గంటలు ఉండాలన్న పాత చట్టంలోని నిబంధనను తుంగలోకి తొక్కడానికే ఈ సవరణలు తెచ్చారన్నది వామపక్షాల ఆరోపణ. మానవ శక్తి అవసరాలను 33 శాతానికి తగ్గించడం, రోజుకు 12 గంటల పనిని ప్రవేశపెట్టడం ఈ సంస్కరణల లక్ష్యం. ఇప్పటికే కోవిడ్‌ -19 ‌ప్రభావంగా లాక్‌ ‌డౌన్‌ ‌పేరు చెప్పి కార్మికులపై పని భారం పెంచారు. కొన్ని చోట్ల పనులు లేకుండా ఫ్యాక్టరీలు మూసివేశారు. కొన్ని చోట్ల తక్కువ మందితో ఉత్పత్తులు జరిపిస్తున్నారు. లాక్‌ ‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత కూడా ఇదే పద్దతిని కొనసాగిస్తారేమోనన్న ఆందోళన ట్రేడ్‌ ‌యూనియన్లలో వ్యక్తం అవుతోంది. లాక్‌ ‌డౌన్‌ అనంతరం కార్మిక చట్టాలు అమలు జరగవేమోనన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. ప్రమాదాలు జరిగినప్పుడు పరిహారం చెల్లించే పద్దతి, వ్యాధిగ్రస్తులైన వారికి వేతనంతో సెలవులు వంటి సదుపాయాలు అమలు జరగవేమోనని ట్రేడ్‌ ‌యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
– ‘ద వైర్‌’ ‌సౌజన్యంతో..

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!