Take a fresh look at your lifestyle.

జమ్మికుంట గడ్డ …..గులాబీ జెండా అడ్డా…

  • యువకుడైన గెల్లుకే మా మద్ధతు బీజేపీని వీడిన యువత
  • మంత్రి కొప్పుల నేతృత్వంలో, మంత్రి హరీశ్ రావు సమక్షంలో 200 మంది యువత తెరాసలో చేరిక.

హూజూరాబాద్ ఉపఎన్నికలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ కే తమ మద్ధతు అంటూ 200 వందల మంది జమ్మికుంట టౌన్ యువత బీజేపీని వీడి తెరాస తీర్తం పుచ్చుకున్నారు. బుధవారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో యువత హుజూరాబాద్ లో ఆర్థిక మంత్రి హరీశ్ రావును సమక్షంలో గులాబీ తీర్తం పుచ్చుకున్నారు. గులాబీ జెండా తోనే జమ్మికుంట పట్టణం అభివృద్ధి చెందుతుందని, యువతకు భవిత ఉంటుందని భావించి మద్ధతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. వారికి మంత్రి హరీశ్ రావు గులాబీ కండువాలు కప్పి తెరాసలోకి ఆహ్వానించారు. బీజేపీ నేతలు ఎన్నికల వేళ తమ స్వంత లాభానికి వినియోగించుకుంటూ తప్పు దారిలోకి నడిపిస్తున్నారని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము చేసిన అభివృద్ది చెప్పి ఓట్లడుగుతుంటే, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేేందర్ మందు బాటిళ్లు, మాంసం , దావత్ ల పేరుతో పిల్లలను చెడగొడుతున్నారని చెప్పారు. హూజూరాబాద్ అభివృద్ధిపై మంత్రిగా దృష్టి పెట్టి ఉంటే ఇలాంటివి పంచే అవసరం ఏముందన్నారు. తన స్వంత లాభం కోసం రాజీనామా చేసి ఆ సమస్యను ప్రజల సమస్యగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఈ మాయమాటల్లో పడితే హూజూరాబాద్ నష్టపోవాల్సి వస్తుందన్నారు. మంత్రిగా అభివృద్ధి చేయని ఈటల గెలిస్తే ఎమ్మెల్యేగా ఏం పనులు చేస్తారని ప్రశ్నించారు. యువత భవిత గులాబీ జెండాతోనేని మంత్రి చెప్పారు. తాము గెలిస్తే జమ్మికుంట అభివృద్ధి బాధ్యత తెరాస ప్రభుత్వం తీసుకుంటుందని హరీశ్ రావు చెప్పారు. తాము గెల్లు శ్రీను గెలుపుకు కృషి చేస్తామని, జమ్మికుంట అభివృద్ధికి ఇది ముందడుగని యువకులు చెప్పారు. వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్ల వద్దకు తీసుకుపోవాలని మంత్రి హరీశ్ రావు వారికి సూచించారు.

Leave a Reply