Take a fresh look at your lifestyle.

చిరు వ్యాపారులకు ఊరట

చిరువ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ల నేపథ్యంలో మే, జూన్‌, ‌జులై మాసాలకు జీఎస్టీఆర్‌-3‌బీ ఫామ్‌లను ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా దాఖలు చేసే రూ 5 కోట్ల టర్నోవర్‌ ‌లోపు చిరువ్యాపారులపై ఎలాంటి ఆలస్య రుసుము, వడ్డీ వసూలు చేయబోమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌వెల్లడించారు. ఇక జులై 6 వరకూ జీఎస్టీ రిటన్స్‌ను దాఖలు చేసే పన్నుచెల్లింపుదారులపై అపరాథ వడ్డీ ఉండదని, ఆ తర్వాత జీఎస్టీ రిటన్స్‌ను ఫైల్‌ ‌చేసే చిరు పన్నుచెల్లింపుదారులపై విధించే వడ్డీ రేటును 9 శాతానికి తగ్గించామని, ఇది ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 ‌వరకూ వర్తిస్తుందని మంత్రి తెలిపారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ ‌సమావేశంలో మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌పాల్గొన్నారు. ఇక రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారంపై చర్చించేందుకు జులైలో అదే అజెండాతో ప్రత్యేక సమావేశం జరుగుతుందని వెల్లడించారు. పాన్‌ ‌మసాలాపై పన్ను విధించే ప్రతిపాదనపై తదుపరి జీఎస్టీ భేటీలో చర్చిస్తామని చెప్పారు.

చిన్న వ్యాపారుల కోసం కీలక సంస్కరణలను తీసుకురానున్నట్లు నిర్మలా సీతారామన్‌ ‌వెల్లడించారు. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి సీతారామన్‌ ‌కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.  జూలైలో మరోసారి జీఎస్టీ మండలి భేటీ జరగనున్నది. అప్పుడు నష్టపరిహారం పన్ను గురించి చర్చించనున్నారు. ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి అన్న అంశాన్ని చర్చించనున్నారు.

పటిష్టంగానే భారత ఆర్థిక వ్యవస్థ :నిర్మల
భారతదేశ ఆర్థికవ్యవస్థ సురక్షితంగానే ఉన్నదని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌చెప్పారు. సమర్ధుల చేతిలోనే ఉందని అంటూ చరిత్ర కారుడు రామచంద్ర గుహ విమర్శలకు ఘాటుగా స్పందించారు.ట్విటర్‌ ‌వేదికగా ఇటీవల ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, ‌గుజరాత్‌ ‌ముఖ్యమంత్రి విజయ్‌ ‌రూపానీలపై ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అయితే, గుహ వ్యాఖ్యలకు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ‌దీటుగా జవాబిచ్చారు. గుజరాత్‌ ఆర్థికంగా ముందంజలో ఉందేమో కానీ, సాంస్క•తికంగా వెనుకబడి ఉంది. అదేవిధంగా బెంగాల్‌ ఆర్థికంగా వెనుకబడినా సాంస్క•తికంగా సంపన్నమైనది’ అని బ్రిటిష్‌ ‌రచయిత ఫిలిప్‌ ‌స్పార్ట్ 1939‌లో రాసిన పంక్తులను రామచంద్ర గుహ తన ట్విటర్‌ ‌ఖాతాలో పోస్ట్ ‌చేశారు. అంతేగాక ఆ పంక్తులు తన సొంత అభిప్రాయాలు కాదని, పరిశోధనలో భాగంగా తనకు లభించాయని తెలిపారు. ఈ విషయమై ఎవరైనా పొగిడినా, ఆగ్రహం వ్యక్తం చేసినా అవి ఆ పంక్తులు రాసిన వ్యక్తి ఆత్మకే చెందుతాయని గుహ ట్వీట్‌ ‌చేశారు. ట్వీట్‌పై ఆర్థిమంత్రి నిర్మలా సీతారామన్‌ ‌స్పందించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన మహారాజా జామ్‌ ‌సాహెబ్‌ ‌దిగ్విజయ్‌సింగ్‌జీ జడేజా రెండో ప్రపంచయుద్ధ సమయంలో పోలాండ్‌కు చెందిన వెయ్యి మంది చిన్నారులను రక్షించారని, మహారాజు చేసిన పనిని అదే చరిత్రకారుడు ఫిలిప్‌ ‌స్పార్ట్ ‌ప్రశంసించాడని ఆమె గుర్తుచేశారు. గుజరాత్‌ ‌ముఖ్యమంత్రి విజయ్‌ ‌రూపానీ కూడా గుహ ట్వీట్‌పై స్పందిస్తూ.. గతంలో బ్రిటిష్‌ ‌వారు భారత్‌లో విభజించి పాలించే విధానాన్ని అనుసరిస్తే, ప్రస్తుతం కొందరు మేధావులు భారతీయుల్లో విభేదాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

వారి రియాక్షన్‌లపై స్పందించిన రామచంద్రగుహ.. విసుగెత్తించే తనలాంటి ఓ చరిత్రకారుడి వ్యాఖ్యలకు గుజరాత్‌ ‌ముఖ్యమంత్రితోపాటు కేంద్ర ఆర్థికమంత్రి కూడా స్పందించారంటే దేశ ఆర్థిక పరిస్థితి సురక్షితంగా ఉన్నట్టే అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన నిర్మలా సీతారామన్‌.. ‌దేశ ఆర్థిక పరిస్థితి సురక్షితంగా ఉందన్న గుహ వ్యాఖ్యలను అంగీకరిస్తూనే కౌంటర్‌ ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థ సరైన వ్యక్తుల చేతుల్లోనే ఉందని, ఆయన చింతించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. చరిత్రపట్ల ఆసక్తి, పరిజ్ఞానం తనకున్న అదనపు అర్హతలని, ఈ విషయాన్ని రామచంద్రగుహ గమనించాలని ఆర్థికమంత్రి సూచించారు

Leave a Reply