- అవార్డును ప్రకటించిన కేంద్రం
- ఎం కెసిఆర్ సహా పలువురు ప్రముఖల అభినందనలు
- తమిళనాడు ఎలక్షన్ స్టంట్ అన్న విపక్షాలు
దక్షిణాది సినీ దిగ్గజం, తలైవాగా పిలుచుకునే సూపర్ స్టార్ రజనీకాంత్‌ను దాదాసాహెబ్ ఫాల్కె వరించింది. భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. 2019 సంవత్సరానికి గాను రజనీకాంత్ 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌కు ఎంపికయ్యారు. దక్షిణాది నుంచి మరోమారు సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి ఏడాది ఇచ్చే దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్‌ని వరించింది. ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందించనున్నట్లు తాజాగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.
భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే జన్మ శతి సందర్భంగా 1963లో ఈ పురస్కారం ఏర్పాటు చేసారు. ఒక సంవత్సరానికి సంబంధించిన పురస్కారం మరుసటి ఏడాది చివర్లో ఇచ్చే జాతీయ సినిమా అవార్డులతో పాటు ఇస్తారు. తాజాగా ఈ అవార్డ్‌ను రజని కాంత్ అందుకోవడం విశేషం. అయితే తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారీ ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్‌కు కేంద్రం అవార్డు ప్రకటించడం ఎలక్షన్ స్టంట్ అని విపక్షాలు నేతలు విమర్శిస్తున్నారు. రజనికాంత్ పార్టీ పెట్టి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నందుకు గిప్ట్‌గా ఈ అవార్డు ఇచ్చారని ఆరోపిస్తున్నారు.
సిఎం కెసిఆర్ సహా పలువురు ప్రముఖల అభినందనలు
అవార్డు గెలుచుకున్నందుకు గాను రజనీకాంత్‌కు పలువును సినీ రాజయకీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మిడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ద్వారా రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘వైవిధ్యమైన పాత్రలతో తరతరాలుగా ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న తలైవాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటించడం సంతోషంగా ఉంది. మికు నా అభినందలు’ అని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, దక్షిణాదికి చెందిన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (తెలుగు), ఎల్వీ ప్రసాద్ (తెలుగు), నాగిరెడ్డి(తెలుగు), అక్కినేని నాగేశ్వరరావు(తెలుగు), శివాజీ గణెషన్(తమిళం), రాజ్‌కుమార్(కన్నడ), గోపాలకృష్ణన్(మలయాళం), రామానాయుడు(తెలుగు), బాలచందర్(తెలుగు, తమిళం), కె. విశ్వనాథ్(తెలుగు) ఈ పురస్కారాన్ని అందుకున్నవారిలో ఉన్నారు.
రజనీకాంత్‌కు సూపర్ స్టార్ కమల్ హాసన్ ట్విటర్‌లో శుభాకాంక్షలు చెప్పాడు. రజనీని ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీలో సింగర్లు ఆశా భోస్లే, శంకర్ మహదేవన్, నటులు మోహన్‌లాల్, బిశ్వజీత్, దర్శకుడు సుభాష్ ఘాయ్ ఉన్నారు. రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే ప్రకటించడం పట్ల ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆనందిస్తున్నారు. పలువురు బీజేపీ నాయకులు సైతం రజనీకాంత్ వంటి గొప్పనటునికి రావలసిన అవార్డు ఇదని శ్లాఘిస్తున్నారు. రజనీకాంత్ కీర్తి కిరీటంలో అపూర్వరత్నంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు నిలుస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. 2000లో రజనీకాంత్‌కు పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ లభించాయి. ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు రజనీ దరి చేరి ంది.