Take a fresh look at your lifestyle.

ప్రముఖ నటి కారులో మద్యం బాటిళ్లు..?

 ప్రముఖ సినీ నటి  కారులో భారీగా మద్యం పట్టుబడింది. చెన్నై ఈసీఆర్ రోడ్డులో శుక్రవారం(జూన్ 12) రాత్రి పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. అటుగా వచ్చిన  ఇన్నోవా క్రిస్టా కారు (టీఎన్07క్యూ0099)లో భారీగా మద్యం సీసాలను గుర్తించారు. అందులో 96 బీర్ బాటిల్స్, 8 విస్కీ బాటిల్స్ ఉన్నాయి. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో చెన్నైలో ప్రస్తుతం మద్యం అమ్మకాలను అనుమతించట్లేదు. ఇలాంటి తరుణంలో  నటి కారులో భారీగా మద్యం పట్టుబడటం కలకలం రేపుతోంది.
అదుపులో డ్రైవర్..  నటికి స్టేషన్ బెయిల్..
కారులో దొరికిన ఆ మద్యాన్ని  హీరొయిన్  మహాబలిపురంలో కొనుగోలు చేసినట్టు గుర్తించారు. పోలీసులకు పట్టుబడిన సమయంలో కారులో ఆమెతో పాటు సోదరి  ఉన్నారు. అయితే  సెలబ్రిటీ కావడంతో పోలీసులపై ఒత్తిడి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెకు స్టేషన్ బెయిల్‌ ఇచ్చి పంపించారు. డ్రైవర్ ను మాత్రం అదుపులోకి తీసుకుని.. కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై తమిళనాడులోని కనత్తూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. మద్యం సీసాలకు సంబంధించి పూర్తి వివరాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.
ఇంత భారీ మొత్తంలో ఎందుకు కొనుగోలు చేసినట్టు..
చెన్నైలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ ఒక్క నగరాన్ని మినహాయించి మిగతాచోట్ల మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొంతమంది వ్యాపారులు మహాబలిపురం నుంచి అక్రమంగా మద్యాన్ని చెన్నైకి తరలించి విక్రయిస్తున్నట్టు సమాచారం. హీరొయిన్ కూడా మహాబలిపురంలోనే మద్యం సీసాలను కొనుగోలు చేసినట్టు గుర్తించారు. అయితే ఆమె ఇంత భారీ మొత్తంలో మద్యం ఎందుకు కొనుగోలు చేసిందన్నది చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సెలబ్రిటీల ఇళ్లల్లో మినీ బార్ లాంటిది మెయింటైన్ చేస్తుంటారు. కాబట్టి  అందుకోసమే మద్యం బాటిళ్లు కొనుగోలు చేసిందా.. లేక మరేదైనా కారణం ఉందా అన్న తేలాల్సి ఉంది.
పోలీసులు ఏమంటున్నారు..
ఈ ఘటనపై ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ‘ఈసీఆర్ రోడ్డులో మేము శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహించాం. మహాబలిపురం వైపు నుంచి వస్తున్న వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నాం.అదే సమయంలో టయోటా ఇన్నోవా క్రిస్టా కారులో ఓ నటి కారు అక్కడికి వచ్చింది. అందులో భారీగా మద్యం బాటిళ్లను గుర్తించాం.’ అని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

Leave a Reply