Take a fresh look at your lifestyle.

దగ్ధమైన సుబాబుల్‌ ‌తోటను పరిశీలించిన నాయకులు

మండల పరిధిలోని మల్లారం, రొంపిమళ్ల గ్రామంలో ఇటీవల దగ్ధమైన సుబాబుల్‌ ‌తోటను బిజెపి రాష్ట్ర కార్యదర్శి అన్నపల్లి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం బిజెపి రాష్ట్ర నాయకుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా కొండపల్లి శ్రీధర్‌రెడ్డి మా ట్లాడుతూ ఐటిసి కంపెనీ వారు సుబాబుల్‌, ‌జమా•యిల్‌ ‌రైతుల జీవితాలతో చె) గాటమాడుతున్నారన్నారు. ఐటిసి పరిశ్రమకు తమ ఉత్పత్తుల కోసం అవసరమైన సుబాబుల్‌, ‌జమాయిల్‌ ‌సాగును ప్రోత్సహించి ఇప్పుడు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ మానసికంగా హింసిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఐటిసి కంపెనీ వారు దళారులతోకుమ్మక్కై రైతులు సుబాబుల్‌, ‌జమాయిల్‌ ‌కర్రను ఏదో ఒక రేటుకు అమ్ముకునే పరిస్థితి సృష్టించి రైతులను మోసం చేస్తున్నారన్నారు.

ఇప్పటికైనా ఐటిసికంపెనీ వారు రైతుల వద్ద నుండి నేరుగా మద్ధతు ధరతో జమాయిల్‌, ‌సుబాబుల్‌ ‌కర్రలను కొనుగోలు చేయాలని, రైతులు సాగు చేసిన తోటను సకాలంలో కొనుగోళ్లు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు గల్లా సత్యనారాయణ, బిజెపి రాష్ట్ర కార్యవర్గసభ్యులు దొంగల సత్యనారాయణ, మండల అధ్యక్షులు శేఖర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షులు పాపట్ల రమేష్‌, ‌చిలువేరు సాంబశివరావు, బిజెవైఎం జిల్లా ఉపాధ్యక్షులు రామిశెట్టి నాగేశ్వరరావు, ఆనంతు ఉపేందర్‌, ‌వీరు గౌడ్‌ ‌పాల్గొన్నారు.

Leave a Reply