Take a fresh look at your lifestyle.

ద్రోణంరాజు శ్రీనివాస్‌కు నేతల నివాళి

భారీగా తరలి వచ్చిన నేతలు, ప్రజలు
‌ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న ద్రోణంరాజు శ్రీనివాస్‌కు ఆగస్టు 29న కోవిడ్‌ ‌పాజిటివ్‌ ‌రావడంతో నాలుగు రోజులు హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందారు. తరువాత నగరంలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్ లో చేరారు. హాస్పిటల్ లో చికిత్సతో కొరోనా నెగిటివ్‌ ‌వచ్చినప్పటికీ.. ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ ‌సోకడంతో ఆరోగ్యం క్షీణించింది. వీఎంఆర్డీఏ తొలి చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ ‌హెల్త్‌సిటీలోని పినాకిల్‌ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు.విశాఖ అభివృద్ధిలో ద్రోణంరాజు శ్రీనివాస్‌ ‌చెరగని ముద్ర వేశారని, ఆయన మరణం పార్టీకీ తీరని లోటని వైస్సార్‌సీపీ నేతలు ద్రోణంరాజుకు నివాళి అర్పించారు.

తమ అభిమాన నేతను కడసారిగా చూసేందుకు పెద్దఎత్తున నగర ప్రజలు, నాయకులు ద్రోణంరాజు శ్రీనివాస్‌ ‌నివాసానికి చేరుకున్నారు. ఆయన భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించి కన్నీటి పర్యంతమయ్యరు. ద్రోణంరాజు శ్రీనివాస్‌ ‌భౌతిక కాయానికి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్‌ ‌బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ స్పీకర్‌ ‌కోన రఘుపతి, ఎమ్మెల్యే అదీప్‌ ‌రాజ్‌, ‌వైస్సార్‌సీపీ రూరల్‌ అధ్యక్షుడు శరగడం చిన్న అప్పలనాయుడు నివాళులు అర్పించారు. విశాఖ అభివృద్ధిలో అవిశ్రాంతంగా పనిచేసిన ద్రోణంరాజు శ్రీనివాస్‌ ‌లేరన్న బాధ జీర్ణించుకోలేక పోతున్నా అని సీపీఎం నేత నర్సింగ రావు అన్నారు. డాక్టర్స్ ‌కాలనీలో ద్రోణంరాజు శ్రీనివాస్‌ ‌భౌతిక కాయాన్నిసందర్శించి నివాళులు అర్పించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply